BSF Battalion
-
కీలక మావోయిస్టు లొంగుబాటు.. 45మంది జవాన్ల హత్యలో సూత్రధారి
సాక్షి, చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 45 మంది జవాన్లను హతమార్చిన ఓ మావోయిస్టు కాంకేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయాడు. బీజాపూర్ జిల్లాకు చెందిన సున్నూ మడవి అలియాస్ శివాజీ మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్-5లో డిప్యూటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఆ పార్టీలో పనిచేసే ఓ మహిళా మావోయిస్టును వివాహం చేసుకోవడంతో పార్టీ డీప్రమోట్ చేసి గంగులూరు ఏరియా కమిటీకి పంపింది. ఆ సమయంలో అతడికి అగ్రనాయకుల వేధింపులు ఎదురవడంతో పార్టీ నుంచి పారిపోయి ఇంటికి వచ్చాడు. కాగా, గ్రామంలో అప్పటికే లొంగిపోయిన కొందరు మావోయిస్టులు.. మళ్లీ పార్టీలోకి వెళ్లవద్దని, నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించడంతో కాంకేర్‌లోని బీఎస్ఎఫ్ 135 బెటాలియన్ పోలీసు అధికారులను ఆశ్రయించాడు. బాలల సంఘం నుంచి డిఫ్యూటీ కమాండర్‌గా.. శివాజీ తొలుత 2005లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు పెంచుకుని బాలల సంఘంలో చేరాడు. 2006లో కాంకేర్ జిల్లాలోని పార్తాపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత మిలటరీ ప్లాటూన్ కంపెనీ నంబర్-5కు డిప్యూ టీ కమాండర్‌గా నియమితులయ్యాడు. ఇక, అతనిపై రూ.3 లక్షల రివార్డు ఉంది. 2009లో మదనవాడలో ఎస్పీ వినోద్ చౌబోతే సహా 29 మంది జవాన్లను, 2006లో దంతెవాడలో ఎనిమిది మంది సీఐఎఫ్ జవాన్లపై దాడి చేసి హత మార్చిన ఘటనలో మడవి అలియాస్ శివాజీ పాల్గొన్నాడు. ఇది కూడా చదవండి: బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి -
అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు
న్యూఢిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు కవాతు చేశారు. ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ఆకట్టుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరయ్యారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో పాక్ రేంజర్లు, బీఎస్ఎఫ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. 1959 నుంచి ప్రతి ఏటా ఇరు దేశాల సైనికులు ఈ బీటింగ్ రీట్రీట్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పలు నృత్య ప్రదర్శనలు, గీతాలపనలు నిర్వహించారు. ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు! ఈ విషయాలు తెలుసా? -
సహచరులను కాల్చేసిన బీఎస్ఎఫ్ జవాను
అమృతసర్: బీఎస్ఎఫ్ జవాను ఒకరు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో తోటి జవాన్లు నలుగురు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం సదరు జవాను కూడా మృతి చెందాడు. పంజాబ్‌లో ఖాసా ఏరియాలోని 144వ బెటాలియన్ క్యాంపులో ఆదివారం ఈ ఘోరం జరిగింది. కర్ణాటకకు చెందిన సత్తెప్ప అనే జవాను తనకు బాగాలేదని చెప్పడంతో శనివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చినట్టు బీఎస్ఎఫ్ పంజాబ్ ఐజీ ఆసిఫ్ జలాల్ చెప్పారు. ఆదివారం ఉదయమే అతను డిశ్చార్జై క్యాంపులోకి వచ్చాడని, ఆయుధాగారం నుంచి తుపాకీ తీసుకొనికాల్పులకు దిగాడని చెప్పారు. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ర్యాంకు జవాన్లు నలుగురు చనిపోయారన్నారు. మరో జవాను పరిస్థితి విషమంగా ఉందనిత చెప్పారు. తర్వాత సత్తెప్ప కూడా చనిపోయి కన్పించాడు. ఎలా చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. మృతులను రామ్ వినోద్ (బిహార్), తొరాస్కర్ (మహారాష్ట్ర), రతన్ సింగ్ (జమ్మూకశ్మీర్), బల్జీందర్ కుమార్ (హరియాణా)గా గుర్తించారు. -
మావోల కట్టడికి కసరత్తు
ఏవోబీలో కీలకప్రాంతాల్లో అవుట్ పోస్టులు ముందుగా పూర్తికానున్న రాళ్లగెడ్డ కొత్తూరు అవుట్‌పోస్టు శతృదుర్భేద్యంగా నిర్మాణం జూలై నాటికి రానున్న బీఎస్ఎఫ్ బెటాలియన్ భయంనీడన ఆరు గిరిజన గ్రామాలు మన్యంలో మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ముందుగా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న అయిదు మండలాల్లో పోలీసు అవుట్ పోస్టులను ఏర్పాటుచేయనున్నారు. చింతపల్లి మండలం రాళ్లగెడ్డ కొత్తూరులో ఏర్పాటు చేస్తున్న అవుట్‌పోస్టు మార్చి చివరికి లేదా ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తికానుంది. వీటిని శత్రు దుర్భేద్యంగా నిర్మిస్తారు. ఒకవేళ మావోయిస్టులు వాటిపై దాడి చేసినా వారిని తిప్పికొట్టే విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. కేంద్రం కూడా సరిహద్దు భద్రత బలగాలు (బీఎస్ఎఫ్) బెటాలియన్‌ను కేటాయించింది. మరో వైపు గడిమామిడి ఎన్కౌంటర్ జరిగి వారం దాటినా ఆ ప్రాంతంలో భయం వీడలేదు. కొయ్యూరు: ఏవోబీలో మావోయిస్టుల రాకపోకలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ గట్టి చర్యలు తీసుకుంటోంది. కీలక ప్రాంతాల్లో అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తోంది. రాళ్లగెడ్డ అవుట్‌పోస్టు పూర్తికాగానే పెదబయలులో రూఢకోట వద్ద రెండో అవుట్‌పోస్టును ఏర్పాటు చే యనున్నారు. దాని తరువాత గూడెంకొత్తవీధి మండలం జెర్రెల, జి.మాడుగుల మండలం మద్దిగరువు, ముంచంగిపుట్ మండలం లక్ష్మీపురం వద్ద అవుట్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. బీఎస్ఎఫ్కు చెందిన ఏడు కంపెనీల నుంచి 700 మంది ఈ అవుట్ పోస్టుల వద్ద కాపలా కాస్తారు. స్థానిక పోలీసులు వారికి సహాయకులుగా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భాష సమస్య కావడంతో స్థానిక పోలీసులు ఉంటాల్సి ఉంటుంది. గతానికి భిన్నంగా.. గతంలో అవుట్ పోస్టులున్నా వాటికి సరైన రక్షణ ఉం డేది కాదు. దీంతో మావోయిస్టులు వాటిపై దాడులు చేసేందుకు అవకాశం ఉండేది. అప్పట్లో ధారకొండ, పెదవలస అవుట్‌పోస్టులపై దాడులు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ నుంచి ఒడిశాకు, అటు నుంచి ఇటువైపునకు మావోయిస్టులు సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వారి రాకపోకలను నిలువరించాలంటే వారు సంచరించే ప్రాంతాల్లో అవుట్ పోస్టులు కీలకమని భావించి వీటి నిర్మాణం చేపట్టారు. ఇవి పూర్తయిన త్వరలో రానున్న బీఎస్ఎఫ్ జవాన్లకు వీటిని అప్పగిస్తారు. పూర్తయిన పోస్టుల వద్ద బీఎస్ఎఫ్ బలగాలు ఉంటే వారికి సహాయంగా స్థానిక పోలీసులుంటారు. ఈ ఏడాది జూలై నాటికి బీఎస్ఎఫ్ బలగాలు ఈప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాకుండా గిరిజనులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. భయం నీడన ఆరు గ్రామాలు గిరిజనులను ఎన్కౌంటర్ భయం ఇప్పటికీ వీడలేదు. ఈ నెల 21న పుట్టకోట సమీపంలో గడిమామిడి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రాంతంలో ఆరు గ్రామాలు భయం నీడన ఉన్నాయి. ఇదివరకు అడవిలోకి స్వేచ్ఛగా వంటచెరకు లేదా అటవీ ఉత్పత్తులు సేకరణు వెళ్లే గిరిజనులు ఇప్పుడు అడవిలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. కాకులమామిడి, జ్యోతులమామిడి, పుట్టకోట, బొబ్బిలిలంక, పెదలంక, కొత్తూరు గ్రామాలను నేటికీ భయం వదలలేదు. వారం మొత్తం సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతకు తీసుకువచ్చి అమ్ముకుంటారు. గడిమామిడి సంఘటనతో అడవికి వెళ్లడాన్ని తగ్గించారు. ఇదివరకు ఎవరికి వారు వంటచెరకు కోసం వెళ్లే వారు. ఇప్పుడు భయంతో పదిమంది వరకు కలిసి అడవికి వెళ్తున్నారు. ఇక రాత్రయితే బయటకు రావడం లేదు.