లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్‌? | Maoist leader Prakash in surrender? | Sakshi
Sakshi News home page

లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్‌?

Published Sat, Mar 11 2017 2:45 AM | Last Updated on Tue, Oct 9 2018 2:43 PM

లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్‌? - Sakshi

లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్‌?

కొన్నాళ్లుగా ఆస్తమాతో ఇబ్బంది..

సాక్షి, ఖమ్మం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు అలియాస్‌ ప్రకాశ్‌ అలియాస్‌ రాజన్న పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన కొన్నేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నట్లు తెలిసింది. కత్తి మోహన్‌రావుది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల మండల కేంద్రం. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు.

1977లో ఉస్మానియా  వర్సిటీలో ఎంఏ చదువుతూ ఆర్‌ఎస్‌యూలో పనిచేశారు. అప్పటి పీపుల్స్‌వార్‌ కార్యకలాపాలకు ఆకర్షితులై అజ్ఞాతబాట పట్టారు.   40 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఐదేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో లొంగిపోవాలని భావించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయనపై పలు కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement