కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)స్థాయిలో కాకతీయ యూ నివర్సిటీ అభివృద్ధి చెందుతుందని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అభిప్రాయపడ్డారు. కేయూ దూరవిద్యాకేంద్రంలో శని వారం జరిగిన జర్నలిజం విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యావనరులను విస్తరించుకోవాల్సి ఉంటుం దన్నారు. తాను 18 ఏళ్లలోపే పాత్రికేయ వృత్తిలో ప్రవేశించానని గుర్తుచేశారు.
ఇంటర్ తర్వాత దూరవిద్య విద్యార్థినేనని చెప్పారు. జర్నలిజం కోర్సులో మెళకువలు నేర్చుకుంటే పాత్రికేయ వృత్తిలో రాణించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆరు ద శాబ్దాలుగా పోరు కొనసాగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాక యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఉద్యమాల ఫలితంగా ఇటీవల కేంద్రం తెలంగాణ విభజన ప్రకటన చేసిందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలకు రూపం లేదని విమర్శించారు.
మన బొగ్గు, ముడి ఇనుము, ఖనిజాలు, వనరులను వినియోగించుకుంటే అద్భుత తెలంగాణ పునర్నిర్మితమవుతుందని పేర్కొన్నారు. కేయూ వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ దూరవిద్య జర్నలిజం కోర్సును నాణ్యమైన విద్యగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఓయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ భారతదేశంలో 90 వేల పత్రికలు, 894 టీవీ చానళ్లున్నాయన్నారు. అందులో 424 న్యూస్ చానళ్లున్నాయని వివరించారు.
ప్రస్తుతం ఎఫ్‌ఎం, ఇంటర్నెట్ వినియోగం కూడా భారతదేశంలో విస్తరిస్తున్నదన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ డి.రాజేంద్రప్రసాద్, జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ సంగాని మల్లేశ్వర్ మాట్లాడారు. కార్యక్ర మంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజారాం, అకుట్ అధ్యక్షుడు జి.దామోదర్, జనరల్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి,అధ్యాపకులు వీరాచారి, వి.జగన్, కె.నర్సింహారావు, జయపాల్, సంపత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు బాబురావు, డి.రఘుపతి బీసీజే, ఎంసీజే విద్యార్థులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాలకు రూపం లేదు
Published Sun, Sep 1 2013 3:01 AM | Last Updated on Tue, Jul 31 2018 4:52 PM
Advertisement