మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టోల్ఫ్రీ నంబరు ఏర్పాటుచేసి, ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆడవాళ్లపై ఎవరైనా దాడులకు దిగితే నిర్భయ చట్టంతో వారిని నియంత్రిస్తామని స్పష్టం చేశారు.
ఇక మావోయిస్టులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని చినరాజప్ప కోరారు. తాము అభివృద్ధి చేస్తాము కనుక వారి కార్యకలాపాలను తగ్గించుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, త్వరలోనే వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.