సాక్షి, హైదరాబాద్: అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్న విద్యార్థులకు వీసాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరా భవన్‌లో టీపీసీసీ, ఎన్‌ఆర్‌ఐ విభాగం, ఏపీసీసీ, ఎన్‌ఎస్‌యూఐల ఆధ్వర్యం లో అవగాహన సదస్సు జరిగింది.
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, అమెరికా న్యాయ నిపుణులు షాండ్రిల్ల శర్మ, ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈ సదస్సులో మాట్లాడారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేసి వారికి సూచనలు, సలహాలు అందించడానికి కృషి చేయనున్నట్లు వారు చెప్పారు. ఇటీవల అమెరికా నుంచి వెనక్కు పంపిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం కాంగ్రెస్ ప్రత్యేక సెల్
Published Mon, Jan 11 2016 3:16 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement