జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే | Dubai Jamaica Flight Sent Back; Check The Reason | Sakshi
Sakshi News home page

జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే

Published Thu, May 9 2024 8:18 PM | Last Updated on Thu, May 9 2024 8:24 PM

Dubai Jamaica Flight Sent Back; Check The Reason

దుబాయ్ నుంచి జమైకా చేరుకున్న విమానాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. జమైకా చేరుకున్న విమానంలో చాలామంది భారతీయులు ఉన్నట్లు తెలిసింది. విమానానికి సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా ఈ విధంగా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

జమైకా చేరుకున్న చాలామంది ప్రయాణికులు ఐదు రోజుల పర్యటన కోసం అక్కడకు వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు తెలిపారు. వీరిలో కొందరు అక్కడ ఉండటానికి ముందుగానే హోటల్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. వీరి వద్ద పర్యటనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లతో అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో వారిని వెనక్కి పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

మే 7న మధ్యాహ్నం చార్టర్డ్ విమానం జమైకా నుంచి బయలుదేరింది. ప్రయాణీకులలో ఎక్కువ మంది భారతీయులు కాగా, ఇద్దరు ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందినవారు ఉన్నట్లు జమైకన్ అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement