
వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ దాయుదుల పోరు కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ రెండు జట్లు ఎక్కడ తలపడినా స్టేడియం హౌస్ ఫుల్ కావల్సిందే. ఇప్పడు మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్థులు సిద్దమయ్యారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో భాగంగా పాక్-భారత్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23 న జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజును బ్లాక్ మార్కెట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారికరంగా టిక్కెట్లు దొరకని అభిమానులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
బ్లాక్‌లో గ్రాండ్ లాంజ్ టిక్కెట్ ధర 4 లక్షల రూపాయల కంటే ఎక్కువగా పలుకుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ ఈ టిక్కెట్ ధరను దిర్హామ్ 5,000(రూ.1,18,240.90)గా నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో కొన్ని వెబ్‌సైట్‌లు అసలు ధరను మూడింతలు చేసి అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
దుబాయ్‌లో అడుగుపెట్టిన టీమిండియా..
ఇక ఈ మెగా టోర్నీ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే దుబాయ్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్‌ను కూడా భారత్ మొదలు పెట్టింది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లా జట్టు కూడా దుబాయ్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశమిచ్చారు.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: ఆ ఇద్దరి విషయంలో అగార్కర్‌తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
Comments
Please login to add a commentAdd a comment