
ప్రతిష్టాత్మక గామా అవార్డుల వేడుక అంతా సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న ఐదో ఎడిషన్‌కు సంబంధించిన వివరాలను దుబాయ్ వేదికగా ప్రకటించారు. దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో తేదీ, వేదికను ఖరారు చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సింగర్ రఘు కుంచె సమక్షంలో జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గామా అవార్డ్స్ గ్రాండ్ రివీల్ పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
మొట్టమొదటి సారి చాలా వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. గామా అవార్డ్స్-2025 వేడుక 5వ ఎడిషన్ జూన్ 7, 2025న దుబాయ్ షార్జా ఎక్స్‌పో సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ జ్యూరీ చైర్ పర్సన్స్ సభ్యులుగా టాలీవుడ్ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి , సంగీత దర్శకులు కోటి , సినీ దర్శకులు బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో ఎంపికైన టాలీవుడ్ నటీనటులకు, సినిమాలకు గామా అవార్ద్స్ అందజేస్తారు.
ఈ సందర్బంగా కుంచె రఘు గారు మాట్లాడుతూ.. 'తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా అవార్డ్స్. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ వేడుకలో యాంకర్, సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలతో ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment