
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జన జాతర కొనసాగు తోంది. జనవరి 13వ తేదీన మే ళా అధికారికంగా ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన భక్తుల రాకడ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 45 కోట్ల మంది వరకు రావచ్చన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా తలకిందులైంది. ఇప్పటికే 60 కోట్ల మార్కును దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు.
26వ తేదీన కుంభమేళా ముగిసేసరికి ఇది 75 కోట్లకు చేరుకునే అవకాశముందని అధికార యంత్రాంగం చెబుతోంది. చివరి రోజైన 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం, ఆఖరి షాహీ స్నాన్ ఉండటంతో త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని యంత్రాంగం అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఇలా ఉండగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబసభ్యులతో పాటు శనివారం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. ఆయనతోపాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా స్నానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment