holy dips
-
మహా కుంభ్‌కు 60 కోట్ల మంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జన జాతర కొనసాగు తోంది. జనవరి 13వ తేదీన మే ళా అధికారికంగా ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన భక్తుల రాకడ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 45 కోట్ల మంది వరకు రావచ్చన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంచనా తలకిందులైంది. ఇప్పటికే 60 కోట్ల మార్కును దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. 26వ తేదీన కుంభమేళా ముగిసేసరికి ఇది 75 కోట్లకు చేరుకునే అవకాశముందని అధికార యంత్రాంగం చెబుతోంది. చివరి రోజైన 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం, ఆఖరి షాహీ స్నాన్ ఉండటంతో త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని యంత్రాంగం అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఇలా ఉండగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబసభ్యులతో పాటు శనివారం త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించారు. ఆయనతోపాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా స్నానాలు చేశారు. -
మహా కుంభ్‌కి 2 కోట్ల మంది
ప్రయాగ్‌రాజ్: మహా కుంభ మేళాలో మాఘి పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. జనవరి 29వ తేదీన పుణ్య స్నానాల సమయంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో ఈసారి ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేశామని తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయం 4 గంటల నుంచే లక్నోలోని తన నివాసంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని వివరించింది. త్రివేణీ సంగమంతోపాటు ఇతర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవాన కురిపించామంది. మాఘి పూర్ణిమ స్నానంతో నెలపాటు కఠోర దీక్షలు చేసిన కల్పవాసీలు సుమారు 10 లక్షల మంది మహాకుంభ్‌ను వీడి వెళ్లనున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరిస్తూ, నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలను ఉపయోగించుకోవాలని వీరికి సూచించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు కుంభ్ ఎస్ఎస్పీ రాజేశ్ ద్వివేదీ చెప్పారు. ఆపరేషన్ చతుర్భుజ్లో భాగంగా 2,750 హైటెక్ కెమెరాలు, డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఉపయోగించుకుని 24 గంటలూ నిఘా కొనసాగించినట్లు వివరించారు. మహాకుంభ్ ప్రాంతాన్ని మంగళవారం 4 గంటల నుంచే నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ నగరాన్ని సైతం నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఇందులో అత్యవసర, ఎమెర్జెన్సీ సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించారు. అన్ని టోల్‌ప్లాజాల వద్ద రాకపోకలను క్రమబద్ధీకరించారు. భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకొకటి చొప్పున అదనంగా 1,200 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 26వ తేదీ వరకు కొనసాగే మహాకుంభ్‌లో చిట్టచివరి అమృత్ స్నాన ఘట్టం మహాశివరాత్రి రోజున ఉంటుంది.పలువురు ప్రముఖుల రాకమాఘి పూర్ణిమ సందర్భంగా బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, తల్లి కోకిలా బెన్, కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలు తదితరులతో కలిసి త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. అదేవిధంగా, దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఆయన భార్య పుణ్యస్నానాలు చేశారు. వీఐపీ ప్రొటోకాల్స్‌ను బుధవారం నిలిపివేయడంతో కుంబ్లే దంపతులు మిగతా భక్తుల మాదిరిగానే పడవలో త్రివేణీ సంగమానికి పడవలో చేరుకుని, పూజలు చేశారు. -
త్రివేణి సంగమం భక్తజనసాగరం
మహాకుంభ్ నగర్: మౌనీ అమావాస్య దగ్గర పడుతుండటంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకుపైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నంనాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలుచేశారని అధికారులు చెప్పారు. జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీప రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జాతీయరహదారులు కిక్కిరిసిపోయాయి. మౌనీఅమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనావేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతిచోటా ‘నో వెహికల్’ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరక్కుండా ఉండేందుకు మరో వరస బ్యారీకేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. అమృత్‌స్నాన్ నేపథ్యంలో స్నానానికి వెళ్లేవాళ్లు, తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను క్రియాశీలం చేశారు. ఇసకేస్తే రాలనంత జనం పోగుబడే చోట అత్యయక స్పందనా దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టంచేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనమతించి, ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2,000 మార్గసూచీ బోర్డ్లను ఏర్పాటుచేశారు. మహాకుంభమేళా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ఏఐ చాట్‌బాట్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని అక్కడి యంత్రాంగం భక్తులను ప్రోత్సహిస్తోంది. సరైన మార్గం చూపేందుకు సహాయక సిబ్బంది అనుక్షణం అందుబాటులో ఉంటున్నారు. ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పుణ్యస్నానంచేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులంతా పుణ్యస్నానాలు చేయడంతోపాటు ఒకరిపై మరొకరు నీళ్లు చిమ్ముకుంటూ వాటర్ గేమ్స్ ఆడుతున్నారు. జనం ఇక్కడికొచ్చేది భక్తిశ్రద్ధలతో. మీలా ఆటలాడటానికి కాదు’’ అని చురకలంటించారు. -
కుంభమేళాలో మళ్లీ అగ్ని ప్రమాదం
మహాకుంభ్ నగర్(యూపీ): ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం చోటుచేసుకున్న ఘటనలో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన ఓ కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఫైర్ అధికారి వివరించారు. అందులోని వారందరినీ కాపాడి, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చామన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ నెల 19న మహాకుంభ్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 18 క్యాంపులు భస్మీపటలమయ్యాయి. మంటలను సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒకటిన 73 దేశాల దౌత్యవేత్తల రాకరష్యా, ఉక్రెయిన్ సహా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు మహాకుంభ్ మేళాలో మొదటిసారిగా పుణ్యస్నానాలు చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన వీరంతా రానున్నారని మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం విదేశాంగ శాఖ యూపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసిందన్నారు. జపాన్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలండ్, బొలీవియా తదితర దేశాల దౌత్యాధికారులు పాల్గొంటారని చెప్పారు. బోట్లో సంగం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారన్నారు. అనంతరం, అక్షయ్వట్, బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోనున్నారు. డిజిటల్ మహాకుంభ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో వీరికి మహాకుంభ్ ప్రాశస్త్యాన్ని వివరించనున్నామన్నారు.సొంత అఖాడాకు సీఎం యోగి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని తన సొంత శ్రీ గురు గోరక్షా నాథ్ అఖాడాను సందర్శించారు. ధర్మ ధ్వజ్‌కు స్వయంగా ఉత్సవ పూజ జరిపారు. ఈ సందర్భంగా సీఎం యోగి దేశం నలుమూలల నుంచి మహాకుంభ్‌కు విచ్చేసిన సిద్ధ యోగులతో చర్చలు జరిపారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గురు గోరక్షా నాథ్ సంప్రదాయాన్ని కొనసాగించే సీఎం యోగి సొంత అఖాడా అని యోగి మహాసభ ప్రత్యేక ఉపాధ్యక్షుడు మహంత్ బాలక్ నాథ్ యోగి చెప్పారు. యోగుల బసకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లున్నాయన్నారు. -
జనహారతి
పుష్కరుడు పులకరించిన వేళ! 12 రోజుల్లో 2.92 కోట్ల మంది పుణ్యస్నానాలు మహాహారతితో ముగిసిన పన్నెండేళ్ల పండుగ పుష్కరుడు పులకరించేలా.... గోదారమ్మ పరవశించేలా పన్నెండేళ్ల పండుగ వైభవంగా ముగిసింది. గోదావరి మహాపుష్కరాలు ఆరంభమైంది మొదలు ముగిసేవరకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. గతంలో ఏ పుష్కరాలకు లేనంతగా 12 రోజుల్లో 2,92,17,992 మంది భక్తులు జిల్లా వ్యాప్తంగా పుష్కర స్నానమాచరించారు. పన్నెండు రోజుల పండుగతోపుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో 6 కోట్ల మందికి పైగాపుష్కరస్నానమాచరిస్తే అందులో సగం మంది మన జిల్లాకే వచ్చారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గోదావరి మహా పుష్కరాలు ముగిశాయి. 14న ఉదయం 6.20 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా ధర్మపురిలో పుష్కరాలు ప్రా రంభించిన నాటి నుంచి మొదలు శనివారం సాయంత్రం 6.21 గంటలకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతుల చేతుల మీదుగా మహాహారతి కార్యక్రమంతో పుష్కర పండుగకు ఘన వీడ్కోలు పలికేంతవరకు జనం తండోపతండాలుగా పుష్కర ఘాట్లకు వస్తూనే ఉన్నారు. గోదావరి పుష్కరాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన దాఖలాల్లేవు. రాష్ర్టవ్యాప్తంగా 6 కోట్ల మందికిపైగా పుష్కర స్నానమాచరిస్తే అందులో సగం మంది కరీంనగర్ జిల్లాకే రావడం విశేషం. వీరిలో పుష్కర స్నానం చేసి వివిధ ఆలయాల్లో దైవదర్శనం చేసుకున్న వారు 1.73 కోట్ల మంది ఉన్నారు. సాధారణ భక్తులతోపాటు పుష్కర స్నానం చేసేందుకు జిల్లాకు తర లివచ్చిన ప్రముఖులెందరో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, సినీ, కళారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు... ఇలా ప్రముఖులెందరో వచ్చారు. పన్నెం డు రోజుల పండుగతో పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతిరోజు లక్షల మంది భక్తులతో ధర్మపురి దద్దరిల్లింది. కాళేశ్వరం కిటకిటలాడింది. కోటిలింగాల కోటేశ్వరుడి నామస్మరణతో ఊగిపోయింది. మంథని మహాజాతరలా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.... గోదావరి పుష్కరాలు కరీంనగర్‌కు ప్రత్యేక శోభను సంతరించి వెళ్లాయి. కాళేశ్వరంలో... త్రిలింగ క్షేత్రం... త్రివేణి సంగమంలో 12 రోజుల పండగ మహా వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య లో భక్తులు తరలివచ్చారు. 12 రోజుల్లో 83 లక్షల పైచిలుకు భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. ఇందులో 30 లక్షల మంది కాళేశ్వర ముక్తీరస్వామిని దర్శించుకున్నారు. అభిషేకాలు, దర్శన టికెట్లు, లడ్డూ, పులి హోర ప్రసాదాల ద్వారా రూ.1.40కోట్ల ఆదాయం ఆలయూనికి సమకూరింది. అంచనాకు మించి భక్తులు తరలిరావడంతో పలుమార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 5 నుంచి 8వ రోజు వరకు రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు తరలిరావడంతో కాస్త అసౌకర్యం తప్పలేదు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు కాళేశ్వరంలోనే బస చేయగా, స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు పన్నెండు రోజులు ఇక్కడే మకాం వేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఓఎస్డీ సుబ్బరాయుడు నిరంతర పర్యవేక్షణతో ట్రాఫిక్ సమస్య సహా భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా అపశ్రుతులు దొర్లాయి. పుష్కర స్నానానికి వస్తూ కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు, మంథని మండలం ఎగ్లాస్పూర్ వద్ద ఆరుగురు మృతి చెందారు. మహారాష్ట్రలోని వెంకటాపురానికి చెందిన ఒకరు, కథలాపూర్ మండలం తాం డ్రియాల సర్పంచ్ పానుగం టి శంకర్ అస్వస్థతతో మరణించారు. పుష్కరాలను రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించగా, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మహాహారతితో ముగింపు పలికారు. ధర్మపురి... భక్తకోటి ధర్మపురి పుష్కరఘాట్లలో 93 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు చేశారు. మొదటి నుంచే భారీగా తరలివచ్చారు. మొదటి రెండు రోజు లు భక్తుల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.25 లక్షల మధ్యలో ఉండగా తరువాత రోజుల్లో భక్తజనం పెరిగింది. గడిచిన శని, ఆదివారాల్లో అత్యధికంగా జనం వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బం దులతో భక్తులు సమస్యల పాలయ్యారు. స్పీకర్ మధుసూదనాచారితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పుష్కర స్నానాలు ఆచరించారు. ఆర్టీసీ వారు ధర్మపురిలో 60-100 ఉచిత బస్సులు నడిపి భక్తులకు ఘాట్ల వద్దకు చేర్చారు. ధర్మపురి గోదావరి పుష్కర స్నానాల అనంతరం లక్ష్మీనృసింహస్వామివారిని 50 లక్షల మంది దర్శించుకున్నారు. మొత్తం 12 రోజుల వ్యవధిలో గుడికి రూ.1.38 కోట్ల ఆదాయం సమకూరింది. సాయంత్రం ధర్మపురి అన్ని ఘాట్లలో పూర్ణాహుతి నిర్వహించడంతోపాటు మంత్రి ఈటల చేతుల మీదుగా మహాహారతి ఇచ్చి పన్నెండు రోజుల పండుగకు ముగింపు పలికారు. మంథని, గోదావరిఖనిలోనూ... మంత్రపురిగా పిలువబడే మంథనిలో సైతం పుష్కర గోదావరి పరవశించింది. పన్నెండు రోజుల్లో 24 లక్షల మంది భక్తులు పుష్కర స్నా నం చేశారు. పది లక్షల మంది భక్తులు గౌతమేశ్వరున్ని దర్శించుకున్నారు. గోదావరిఖని వద్దనున్న మూడుఘాట్ల వద్ద 12రోజులుగా 17.25 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు పుష్కరఘాట్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఢిల్లీకి చెందిన బోర్డు డెరైక్టర్ డీఎన్ ప్రసాద్ గోదావరిఖని పరిసర ప్రాంత పుష్కరఘాట్లలో స్నానం చేసి వెళ్లారు. కోటిలింగాలలో 20 లక్షలు కోటిలింగాలలో పుష్కరాల మొదటిరోజు ప్రారంభమైన భక్తుల ప్రవాహ ఝరి చివరిరోజు వరకు కూడా తగ్గలేదు. శనివారం లక్ష మంది పుష్కరస్నానం చేశారు. మొత్తం 12 రోజుల్లో 20 లక్షలమంది స్నానమాచరించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు మొదలైన రద్దీ ఘాట్లు ముగిసే వరకు కొనసాగింది. మంత్రి ఈటల, చీఫ్ విప్ కొప్పుల, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కోటిలింగాల పుష్కర ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటిలింగాల పుష్కర ఘాట్ నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బోట్లో వెళ్లి వచ్చారు. కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. డెప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
రెండుకోట్లకు చేరిన పుష్కర స్నానాలు
హైదరాబాద్ సిటీ: గోదావరి పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కోట్ల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శని, ఆదివారం నాడే కోటి మందికి పైగా భక్తులు పుష్కరాలకు హాజరైనట్టు పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి రోజు వారీగా పుష్కరాలకు హాజరైన భక్తుల వివరాలు.. 14-07 15-07 16-07 17-07 18-07 19-07 మొత్తం (తూ.గో.గ్రామ 8,04,605 9,85,318 11,55,112 10,96,497 19,40,699 15,05,082 74,87,353 పట్టణ ప్రాంతం 9,97,329 6,46,969 10,87,587 11,15,062 19,54,619 14,35,267 72,36,833 (ప.గో.గ్రా,ప) 5,44,511 7,90,864 8,34,609 8,61,782 19,30,403 14,71,559 64,33,728 23,46,485 24,23,151 30,77,308 30,73,341 58,25,721 44,11,908 2,11,57,914