
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో కూడిన తొలి బృందం శనివారం దుబాయ్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఈ మొదటి బ్యాచ్‌లో రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఉన్నారు. మిగతా ప్లేయర్లు ఆదివారం దుబాయ్‌కు చేరుకునే అవకాశముంది.
ఇక దుబాయ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనున్నారు. ఈ టోర్నీలో రన్నరప్‌గా బరిలోకి దిగుతున్న బారత జట్టు.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.
బుమ్రా స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను జట్టు నుంచి తప్పించారు. జైశ్వాల్ స్ధానంలో మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే వేదికలో దాయాది పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. కాగా భారత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
Comments
Please login to add a commentAdd a comment