![Masood Azhar Now In Pakistan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/6/Randhir%20Jaiswal.jpg.webp?itok=ExBMEgb1)
ఢిల్లీ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఆచూకీ దొరికింది. ఇటీవల పాకిస్థాన్‌లో బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ మాట్లాడుతూ.. మసూద్ అజార్ పాకిస్తాన్‌లో ఉన్నట్లు వచ్చిన సమాచారం నిజమైతే ఉగ్రవాద కార్యకలాపాలను పరిష్కరించడంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందనేగా అర్ధం.
అజార్ తమ దేశంలో లేడని పాక్ చెప్పుకుంటుంది. ఒకవేళ ఉంటే అజార్‌పై పాక్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని జైస్వాల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment