ఇరాన్‌లో గతంలో కంటే అధికంగా అణుస్థావరాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా నియమించబడిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఇరాన్‌లో గతంలో కంటే ఎక్కువ అణు స్థావరాలు వెలుగు చూశాయి. ఆ దేశంపై దాడులు చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడం, అడ్డుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం.
ఇక.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండింస్తూ వస్తున్న విషయం తెలిసిందే.2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా.. ఇరాన్ అణుసామర్థ్య ఆశయాలను పరిమితం చేసేందుకు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇక.. ప్రస్తుతం అమెరికా మళ్లీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. టెహ్రాన్ వద్ద యురేనియంను 60 శాతం వరకు ఉండగా.. 30 శాతం తక్కువ అణు ఆయుధాల గ్రేడ్ ఉంది.
In my first meeting today with the @IDF General Staff Forum, I emphasized: Iran is more exposed than ever to strikes on its nuclear facilities. We have the opportunity to achieve our most important goal – to thwart and eliminate the existential threat to the State of Israel. pic.twitter.com/HX4Z6IO8iQ
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) November 11, 2024
ఇజ్రాయెల్, ఇరాన్ చెసుకుంటున్న క్షిపణి దాడుల కారణం మధ్యప్రాచ్యంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఈ దాడిలో ఇరాన్ రెండుసార్లు ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా మిసైల్స్ దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసింది. ఇటీవల అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అదీ కాక.. గత నెలలో జరిగిన దాడికి ప్రతిస్పందించవద్దని ఇరాన్‌ను ఇజ్రాయెల్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment