
టెహ్రాన్: తమ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ పవర్‌ను ఇజ్రాయెల్‌కు చూపించాలన్నారు. దీని కోసం ఎలా స్పందించాలనే విషయాన్ని అధికారులే నిర్ణయిస్తారని ఖమేనీ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది.
ఇజ్రాయెల్ దాడులను మరీ తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని ఖమేనీ చెప్పినట్లు తెలిపింది. కాగా,శనివారం(అక్టోబర్ 26) తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి.
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా 100 యుద్ధ విమానాలు,డ్రోన్లతో అక్కడి క్షిపణి,డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది.
ఇదీ చదవండి: ఇరాన్‌పై నిప్పుల వర్షం