అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం | Vladimir Putin Launches Drills Of Russia's Nuclear Forces Simulating Retaliatory Strikes, More Details | Sakshi
Sakshi News home page

అణు క్షిపణుల పరీక్షకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశం

Published Wed, Oct 30 2024 8:02 AM | Last Updated on Wed, Oct 30 2024 10:07 AM

Vladimir Putin Launches Drills of Nuclear Forces

మాస్కో: ఉక్రెయిన్‌ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ న్యూక్లియర్‌ ఫోర్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలకు కసరత్తు వెంటనే ప్రారంభించాలని సూచించారు. అణ్వాయుధ సామర్థ్యం  కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సైనిక అధికారులతో జరిగిన వీడియో సమావేశంలో పుతిన్ ఆదేశించారు.  

పుతిన్ ఆదేశాల మేరకు రష్యా అణు దళం అణు క్షిపణులను పరీక్షించడం మొదలుపెట్టింది. ఉక్రెయిన్‌కు పెరుగుతున్న పాశ్చాత్య దేశాల మద్దతు నేపథ్యంలో అణుశక్తి సామర్థ్యాన్ని ప్రస్తావించిన పుతిన్.. రష్యాలోని అణు ఆయుధాగారం దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నమ్మదగిన హామీ అని పేర్కొన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,  కొత్త హెచ్చరికలు, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే, యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా  ఉండటం చాలా ముఖ్యమని పుతిన్ పునరుద్ఘాటించారు.

కాగా కమ్‌చట్కా ద్వీపకల్పంలోని కురా టెస్టింగ్ రేంజ్‌లోని ప్లెసెట్స్క్ లాంచ్ ప్యాడ్ నుంచి యార్స్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ను సైన్యం పరీక్షించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని క్షిపణులు తమ లక్ష్యాలను ధ్వంసం చేశాయని  పేర్కొంది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా, నాటో మిత్రదేశాలను హెచ్చరించారు. రష్యా పై దాడులు చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఇచ్చిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే, రష్యాపై నాటో యుద్ధం ప్రారంభించినట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్  పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్‌- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement