న్యూఢిల్లీ : భారత్‌ను నిలువరించేక్రమంలో మరో వ్యూహాత్మకను ప్రణాళికను చైనా తెరమీదకు తెచ్చింది. అందుకు పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును వేదికగా మార్చుకుంటోంది. ఈ నౌకా కేంద్రంగా భారత నేవీ ఆపరేషన్లును గమనించాలని చైనా కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగా న్యూక్లియర్ సబ్ మెరైన్లను గ్వాదర్ పోర్టుకు తరలించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గ్వాదర్ పోర్టులో న్యూక్లియర్ సబ్ మెరైన్ స్టేషన్‌ను హుటాహుటిన చైనా నిర్మిస్తోంది.
అంతర్జాతీయ వాణిజ్యం కోసమే గ్వాదర్ పోర్టు అభివృద్ధి అని చైనా బయటకు చెబుతున్నా.. భవిష్యత్ అవసరాల కోసమే వ్యూహాత్మంగా దీని మీద కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్వాదర్ పోర్టులో న్యూక్లియర్ సబ్ మెరైన్ స్టేషన్ సిద్ధమైతే.. చైనా నేరుగా ఇక్కడ నుంచే ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా తన యుద్ధనీతిని పదును పెట్టే అవకాశం ఉంది.
సబ్ మెరైన్ కమ్యూనికేషన్ల కోసం గ్వాదర్ పోర్టులో పాకిస్తాన్ నేవీ అధికారులు వీఎల్‌ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) స్టేషన్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఏంటెన్నా టవర్, అండర్ గ్రౌండ్‌లో వీఎల్‌ఎఫ్ భవనాలు, విద్యుత్ సౌకర్యాల ఏర్పాటు పూర్తయింది. ఇదిలావుండగా తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి ప్రాంతం నుంచి చైనా పూర్తి స్థాయిలో మిలటరీ కార్యకలాపాలను మొదలు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment