Submarines
-
పరిశోధనల హబ్‌గా హైదరాబాద్
సాక్షి,హైదరాబాద్: సబ్మెరైన్ల తయారీలో వినియోగించే పదార్థాల అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ఎన్నో పరిశ్రమలు పనిచేస్తున్నాయని ఇప్పుడు పరిశోధనలు, అభివృద్ధికి భాగ్యనగరం కేంద్రంగా ఉందని రక్షణరంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మాజీ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీ–హబ్ వేదికగా ‘వేదజ్ఞానం, ఆధునిక సాంకేతికత’పై శ్రీవీటీ సంస్థ రజతోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఐకాన్ భారత్’అంతర్జాతీయ సదస్సును సతీశ్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సదస్సు ద్వారా విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్‌ను ‘విశ్వ గురువు’గా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రాచీన శాస్త్రీయతకు ఆధునికతను కలిపే చక్కటి వేదిక ఇదని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ నిర్భరత సాధించాలంటే ముందుగా మెటీరియల్స్, తయారీరంగంలో నూతన సాంకేతికత విషయంలో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. దేశీయంగా కీలకమైన మెటీరియల్స్ అభివృద్ధి చేయడంలో ఎంతో ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. సబ్మెరైన్ల తయారీలో, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమానాల తయారీలో 80% ముడి పదార్థాలు భారత్‌లోనే తయారయ్యాయని గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తి, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని చెప్పారు. శ్రీవీటీ నిర్వహిస్తున్న పరిశోధనల ద్వారా వివిధ మెటీరియల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, గత 25 ఏళ్లుగా ఈ వర్సిటీ దేశంలోని వివిధ సంస్థలతో కలసి పని చేసిందని చెప్పారు. ఈ సదస్సుకు గౌరవ అతిథిగా బిట్స్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు హాజరయ్యారు. సదస్సులో టీ–హబ్ సీఈవో శ్రీనివాస్ మహంకాళీ, సీఎస్ఐఆర్ మాజీ డీజీ డాక్టర్ శేఖర్ మండే తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన భారత నౌకాదళం
న్యూఢిల్లీ: ఇటీవలికాలంలో ఎన్నడూలేనంతగా భారత నౌకా దళం ఒకేసారి భారీ సంఖ్యలో నౌకలు, జలాంతర్గాములతో యుద్ధవిన్యాసం చేసి ఔరా అనిపించింది. అరేబియా సముద్రం ఇందుకు వేదికైంది. ట్విన్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ) ఆపరేషన్స్ పేరిట నిర్వహించిన ఈ యుధ్ధవిన్యాసం నౌకాదళ పోరాట పటిమను ప్రపంచానికి మరోమారు తెలియజెప్పిందని భారత నౌకాదళ తర్వాత ఒక వీడియోను ట్విట్‌చేసింది. యుద్ధవిమాన వాహకనౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్‌లుసహా పలు రకాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 35కుపైగా యుద్ధవిమానాలను సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఈ ఆపరేషన్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు భారత నౌకాదళం ప్రకటించింది. మిగ్–29కే, ఎంహెచ్ 60ఆర్, కమోవ్, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు సైతం ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయని నేవీ అధికారులు శనివారం చెప్పారు. అయితే ఈ ఆపరేషన్స్‌ను ఎప్పుడు నిర్వహించారో వెల్లడించలేదు. సముద్ర ఆధారిత గగనతల శక్తిసామర్థ్యాలు, హిందూమహా సముద్ర జలాలు, ఆవల సైతం భద్రతా భాగస్వామిగా భారత కీలకపాత్రను ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని నేవీ ప్రతినిధి వివేక్ మథ్వాల్ వ్యాఖ్యానించారు. దేశీయ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సెప్టెంబర్‌లో విధుల్లోకి తీసుకున్నాక చేపట్టిన తొలి భారీ విన్యాసమిది. యుద్ధవిమాన వాహకనౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్, డెస్ట్రాయర్, ఇతర నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు ఇలా అన్నింటి కలపుకుంటూ కదనరంగంలోకి దిగితే ఈ బృందాన్ని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ)/ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. -
‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.) -
జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా, రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా ఉన్నారు. -
మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐఏఎఫ్‌కు 110 ఫైటర్ జెట్లు.. అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని–5’ భారత అమ్ములపొదిలో చేరనుందన్నారు. -
నేవీలోకి త్వరలో 56 యుద్ధనౌకలు
న్యూఢిల్లీ: భారత నావికాదళంలోకి త్వరలోనే 56 కొత్త యుద్ధనౌకలు, ఆరు జలాంతర్గాములు చేరనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. సోమవారం నావికాదళ దినోత్సవం(నేవీ డే) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాంబా మాట్లాడుతూ.. ‘2050 నాటికి 200 యుద్ధనౌకలు, 500 సొంత యుద్ధ విమానాలతో భారత నేవీ ప్రపంచస్థాయి నౌకాదళంగా తయారవుతుంది’ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు షిప్‌యార్డుల్లో 32 నౌకలు, జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిని అదనంగా తాజాగా మరో 56 యుద్ధనౌకలు, 6 జలాంతర్గాముల చేరికకు కేంద్రం పచ్చజెండా ఊపిందని వెల్లడించారు. చైనా, పాక్‌తో ద్విముఖ పోరు సంభవిస్తే నేవీ ఎలా ఎదుర్కొంటుందన్న మీడియా ప్రశ్నకు..‘పాక్ నేవీ కంటే మనం చాలాముందున్నాం. ఇక హిందూ మహాసముద్రం పరిధిలో చైనాపై మనదే పైచేయిగా ఉంది’ అని పేర్కొన్నారు. భారత త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్–సీడీఎస్)ని నియమించాలన్న ప్రతిపాదనకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అంగీకారం కుదిరిందనీ, త్వరలోనే ఈ విషయాన్ని రక్షణ శాఖకు నివేదిస్తామని లాంబా అన్నారు. రిలయన్స్‌కు షాకిచ్చిన నేవీ.. ఐదు ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌకలను నిర్ణీత సమయంలోగా అందించలేకపోయిన రిలయన్స్ నేవల్ ఇంజనీరింగ్ లిమిటెడ్(ఆర్ఎన్ఈఎల్)పై భారత నేవీ కొరడా ఝుళిపించింది. కాంట్రాక్టు సందర్భంగా రిలయన్స్ సమర్పించిన బ్యాంకు గ్యారెంటీని నేవీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్పందిస్తూ..‘రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టును రద్దుచేయాలా? వద్దా? అనే విషయమై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. నౌకల నిర్మాణానికి రూ.3,200కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న పిపవావ్ డిఫెన్స్, ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ సంస్థను 2016లో ఆర్ఎన్ఈఎల్ కొనుగోలు చేయడం తెల్సిందే. -
చైనా దొంగబుద్ధి !?
-
చైనా దొంగబుద్ధి !?
న్యూఢిల్లీ : భారత్‌ను నిలువరించేక్రమంలో మరో వ్యూహాత్మకను ప్రణాళికను చైనా తెరమీదకు తెచ్చింది. అందుకు పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టును వేదికగా మార్చుకుంటోంది. ఈ నౌకా కేంద్రంగా భారత నేవీ ఆపరేషన్లును గమనించాలని చైనా కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగా న్యూక్లియర్ సబ్ మెరైన్లను గ్వాదర్ పోర్టుకు తరలించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గ్వాదర్ పోర్టులో న్యూక్లియర్ సబ్ మెరైన్ స్టేషన్‌ను హుటాహుటిన చైనా నిర్మిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసమే గ్వాదర్ పోర్టు అభివృద్ధి అని చైనా బయటకు చెబుతున్నా.. భవిష్యత్ అవసరాల కోసమే వ్యూహాత్మంగా దీని మీద కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గ్వాదర్ పోర్టులో న్యూక్లియర్ సబ్ మెరైన్ స్టేషన్ సిద్ధమైతే.. చైనా నేరుగా ఇక్కడ నుంచే ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా తన యుద్ధనీతిని పదును పెట్టే అవకాశం ఉంది. సబ్ మెరైన్ కమ్యూనికేషన్ల కోసం గ్వాదర్ పోర్టులో పాకిస్తాన్ నేవీ అధికారులు వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) స్టేషన్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఏంటెన్నా టవర్, అండర్ గ్రౌండ్లో వీఎల్ఎఫ్ భవనాలు, విద్యుత్ సౌకర్యాల ఏర్పాటు పూర్తయింది. ఇదిలావుండగా తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి ప్రాంతం నుంచి చైనా పూర్తి స్థాయిలో మిలటరీ కార్యకలాపాలను మొదలు పెట్టింది. -
ఏకంగా ఆరు : చైనాకు వెన్నులో వణుకే!
సాక్షి, న్యూఢిల్లీ : చైనాను అంతర్జాతీయంగా ఇప్పటికే పూర్తిగా ఇరుకున పెట్టిన భారత్.. తాజాగా మరో అడుగు ముదుకేసింది, డోక్లాం వివాదం తరువాత సరిహద్దుల్లో భారత్ భద్రతను కట్టు దిట్టం చేసింది. ఇప్పటివరకూ న్యూక్లియర్ సబ్ మెరైన్లపై పెద్దగా దృష్టిపెట్టని భారత్.. ఏక కాలంలో ఆరు న్యూక్లియర్ సబ్ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా స్పష్టం చేశారు. భారత నేవీ సామర్థ్యాన్ని ఇవి పరిపుష్టం చేస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని భారత్ సవాల్ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల చతుర్భుజ కూటమికి స్థిరమైన ఆకృతిని తీసుకురావంలో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనాకు చెక్ పెట్టే శక్తి ఒక్క భారత్‌కు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. -
మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే..
చైనా జలాంతర్గాముల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ఢాకా: చైనా నుంచి రెండు జలాంతర్గాముల కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని బంగ్లాదేశ్ సమర్థించుకుంది. దీనిని గురించి ఇతర దేశాలు ప్రతికూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదని, తమ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికొచ్చామని ప్రధానమంత్రి షేక్ హసీనా పేర్కొన్నారు. తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. కాగా 035జీ తరహా జలాంతర్గాములను నాలుగు నెలల క్రితం సైన్యానికి అంకితం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు బుధవారం ఆమె పైవిధంగా జవాబిచ్చారు. -
రూ.60 వేల కోట్ల జలాంతర్గాముల ప్రాజెక్టు
న్యూఢిల్లీ: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రూ.60,000 కోట్ల విలువైన జలాంతర్గాముల ప్రాజెక్టును త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హిందూ మహా సముద్ర గర్భంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలో అందుకు దీటుగా భారత్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనికి పీ–75– ఐ అని పేరు పెట్టారు. వ్యూహాత్మక భాగస్వామ్య పద్ధతిలో రక్షణ శాఖ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇది. వ్యూహాత్మక భాగస్వామ్య పద్ధతి అంటే జలాంతర్గాములు, యుద్ధవిమానాలు తదితరాలను భారత్‌లో తయారు చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను ఎంపిక చేస్తుంది. విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో ప్రైవేటు కంపెనీలు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాయి. గరిష్టంగా 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తారు. జలాంతర్గాముల ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ త్వరలోనే కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించనుంది. అయితే ఎల్ అండ్ టీ, రిలయన్స్ డిఫెన్స్, మజ్గావ్ డాక్ లిమిటెడ్ సంస్థలకు మాత్రమే పీ–75– ఐని చేపట్టే అర్హతలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆ విధంగా దగ్గరవుతోన్న చైనా- పాక్
ఇస్లామాబాద్: ఓవైపు బలూచిస్టాన్ ప్రాంతంలో ఆర్థిక కారిడార్ నిర్మించాలనుకుంటున్న చైనా.. పాకిస్థాన్ తో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రక్షణ రంగ సహకారంలో భాగంగా మంగళవారం పాక్ ఎనిమిది చైనీస్ జలాంతర్గాముల దిగుమతికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 34 వేల కోట్లు. 2028 నాటికి మెత్తం ఎనిమిది చైనీస్ సబ్ మెరైన్లు పాక్ నౌకాదళంలో చేరనున్నాయి. పాక్ జలాంతర్గాముల ప్రాజెక్టు అధిపతితో పాటు సీనియర్ నౌకాదళ అధికారులు ఆగస్టు 26న జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఒప్పించినట్లు పాక్ జాతీయ మీడియా వెల్లడించింది. మరో విశేషం ఏమంటే పాకిస్థాన్ కు అతి తక్కువ వడ్డీపై దీర్ఘకాలిక రుణం మంజూరు చేసేమరీ చైనా ఈ జలాంతర్గాములను అమ్ముతోంది. అయితే ఏ రకం జలాంతర్గాములపై ఒప్పందం చేసుకున్నారనే విషయాన్ని ఇరుదేశాలు రహస్యంగా ఉంచాయి. ప్రచారంలో ఉన్నట్లుగా టైప్ 039, టైప్ 041 యువాన్ తరగతికి చెందిన ఎటాక్ సబ్‌మెరైన్స్‌ను అందజేసే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
నిర్ణయానికి పద్నాలుగేళ్లు.. వెల రూ.1900 కోట్లు
న్యూఢిల్లీ: సముద్ర గర్భాల్లో జరిగే ప్రమాదాల నుంచి నేవీ సైనికులను రక్షించే ఉద్దేశంతో రెండు భారీ జలాంతర్గాములు భారత్ కొనుగోలు చేయనుంది. దాదాపు పద్నాలుగేళ్ల కింద చేసిన ఆలోచనపై గత రాత్రి నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు చెందిన రెండు జలాంతర్గాములను రూ.1,900 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 'సముద్ర అట్టడుగులోతుల్లో నిర్వహించే మిషన్లకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడి వారిని రక్షించేందుకు రెండు బ్రిటన్‌కు చెందిన జలాంతర్గాములను కొనుగోలుచేయనున్నాం' అని కేబినెట్ కమిటీ చెప్పింది. భారత్‌కు ఇప్పటి వరకు 13 జలాంతర్గాములు ఉన్నాయి. కానీ, వాటిల్లో ఏ ఒక్కటీ ప్రమాద బారినుంచి రక్షించేవి లేవు. ఈ నేపథ్యంలో కొత్తగా రెండింటిని బ్రిటన్ ను తీసుకురానున్నారు.