నిర్ణయానికి పద్నాలుగేళ్లు.. వెల రూ.1900 కోట్లు | It Took 14 Years. India To Buy 2 Rescue Submarines For 1,900 Crores | Sakshi
Sakshi News home page

నిర్ణయానికి పద్నాలుగేళ్లు.. వెల రూ.1900 కోట్లు

Published Fri, Mar 11 2016 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

నిర్ణయానికి పద్నాలుగేళ్లు.. వెల రూ.1900 కోట్లు

నిర్ణయానికి పద్నాలుగేళ్లు.. వెల రూ.1900 కోట్లు

న్యూఢిల్లీ: సముద్ర గర్భాల్లో జరిగే ప్రమాదాల నుంచి నేవీ సైనికులను రక్షించే ఉద్దేశంతో రెండు భారీ జలాంతర్గాములు భారత్ కొనుగోలు చేయనుంది. దాదాపు పద్నాలుగేళ్ల కింద చేసిన ఆలోచనపై గత రాత్రి నిర్ణయం తీసుకుంది. బ్రిటన్కు చెందిన రెండు జలాంతర్గాములను రూ.1,900 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

'సముద్ర అట్టడుగులోతుల్లో నిర్వహించే మిషన్లకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడి వారిని రక్షించేందుకు రెండు బ్రిటన్కు చెందిన జలాంతర్గాములను కొనుగోలుచేయనున్నాం' అని కేబినెట్ కమిటీ చెప్పింది. భారత్కు ఇప్పటి వరకు 13 జలాంతర్గాములు ఉన్నాయి. కానీ, వాటిల్లో ఏ ఒక్కటీ ప్రమాద బారినుంచి రక్షించేవి లేవు. ఈ నేపథ్యంలో కొత్తగా రెండింటిని బ్రిటన్ ను తీసుకురానున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement