
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉ.కొరియా ప్రతినిధులు కిమ్ నిర్ణయాన్ని తమకు చెప్పారన్నారు.
మరోవైపు ట్రంప్–కిమ్ భేటీపై ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య ఇప్పటికే రహస్య చర్చలు ప్రారంభమయ్యాయని సీఎన్‌ఎన్ తన కథనంలో పేర్కొంది. మంగోలియా లేదా స్వీడన్‌లో ట్రంప్–కిమ్‌ల మధ్య భేటీ జరిగే అవకాశముందని వెల్లడించింది. కాగా, తాను కిమ్‌తో ఈ ఏడాది మే లేదా జూన్‌లో సమావేశమవుతానని ట్రంప్ వెల్లడించారు.