సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని కిమ్ ప్రార్థించినట్లు ఉత్తర కొరియా మీడియా శనివారం ప్రకటించింది. ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. (చదవండి: త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ)
దీంతో వారి ఆరోగ్యంపై కిమ్ స్పందిస్తూ.. ట్రంప్ దంపతులు త్వరగా మహమ్మారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అయితే ఈ రెండు దేశాల అధ్యక్షులు ఒకప్పుడు ఉప్పు, నిప్పులా ఉండేవారు. ఇటీవల వీరిద్దరూ కలిసి సింగపూర్‌లోని ఓ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. అయితే సమావేశంలో చర్చలు విఫలమైనప్పటికీ.. వీరి మధ్య మాత్రం మైత్రి బలపడింది. అందుకే గతంలో కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ట్వీట్ చేయగా.. ఇవాళ ట్రంప్ ఆరోగ్యంపై కిమ్ స్పందించారు. (చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు)
Comments
Please login to add a commentAdd a comment