టెహ్రాన్: ఇరాన్ అణు విభాగం అధిపతిగా మహ్మద్ ఎస్లామీ(67)ని అధ్యక్షుడు పెజెష్కియాన్ మరోసారి నియమించారు. 2021లో అప్పటి అధ్యక్షుడు ఎబ్రహీం రైసీ ఈయన్ను మొదటిసారిగా అణు విభాగానికి అధిపతిగా నియమించారు. ఎస్లామీ అంతకుముందు 2018లో అధ్యక్షుడు రౌహానీ హయాంలో రవాణా, పట్టణాభివృద్ధి శాఖమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు.
అమెరికాలోని డెట్రాయిట్, టొలెడో యూనివర్సిటీల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టాలు అందుకున్న ఎస్లామీకి దేశ సైనిక పరిశ్రమలకు సంబంధించి విస్తారమైన అనుభవముంది. ఇరాన్ అణు విధానానికి ప్రత్యక్షంగా తోడ్పాటునందిస్తున్నారంటూ 2008లో ఇరాన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్‌గా ఉన్న ఎస్లామీపై ఐరాస ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment