మిస్సైల్‌ | Mythri Movie Makers Suggesting Missile Title And Nuclear Title For KGF | Sakshi
Sakshi News home page

మిస్సైల్‌

Published Thu, Jun 11 2020 12:06 AM | Last Updated on Thu, Jun 11 2020 12:06 AM

Mythri Movie Makers Suggesting Missile Title And Nuclear Title For KGF - Sakshi

ఎన్టీఆర్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందట. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘న్యూక్లియర్‌’ లేదా ‘మిస్సైల్‌’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. ఇందులో రామ్‌చరణ్‌ మరో హీరో. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివ్రిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసే సినిమా ఆరంభమవుతుందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement