బాంబు దాడుల్లో 45 మంది మృతి | 45 people killed in three blasts in Syrian capital of Damascus | Sakshi
Sakshi News home page

బాంబు దాడుల్లో 45 మంది మృతి

Published Sun, Jan 31 2016 6:28 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

బాంబు దాడుల్లో 45 మంది మృతి - Sakshi

బాంబు దాడుల్లో 45 మంది మృతి

డమాస్కస్: సిరియా మరోసారి బాంబు దాడులతో అట్టుడికింది. రాజధాని డమాస్కస్ దక్షిణ ప్రాంతంలోని సయిదా జీనాబ్ ప్రార్థనా మందిరం సమీపంలో జరిగిన మూడు వరుస బాంబు పేలుళ్లలో 45 మంది మృతి చెందినట్లు సిరియన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

శక్తిమంతమైన పేలుళ్లు జరిగిన ప్రాంతంలోని సమీప భవనాలు, కార్లు ధ్వంసమైన దృశ్యాలను సిరియన్ స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. సిరియా ప్రభుత్వ వర్గాలు ప్రతిపక్షాలతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement