ప్రశ్నించినందుకు తల మొండెం వేరు చేశాడు
దళితుడి దారుణ హత్య
డెహ్రాడూన్: తమ అగ్రకులస్తుల పిండి మరను వినియోగించి మలినం చేశాడంటూ ఓ దళితుడి తల నరికి చంపాడో ఉపాధ్యాయుడు! ఈ ఘటన ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లా కదారియా గ్రామంలో మంగళవారం జరిగింది. ‘సోహాన్ రామ్(31) కుందన్‌కు చెందిన మరలో గోధుమలు ఆడించి పిండిని తీసుకెళ్తుండగా.. పాఠశాల ఉపాధ్యాయుడు లలిత్ కర్ణాటక్ చూశాడు. సోహాన్ కులాన్ని దూషించి, అతడి వల్ల మర మలినమైందని అవమానించాడు. ఎందుకు దూషిస్తున్నావని సోహాన్ ప్రశ్నించగా లలిత్ కొడవలితో నరికి హత్య చేశాడు’ అని పోలీసులు చెప్పారు.
సోహాన్‌ను గురువారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ పిండి మరను అగ్రకులస్తులు, దళితులూ వాడేవారని గ్రామస్తులు చెప్పారు. అయితే దసరా నేపథ్యంలో తాము అమ్మ వారికి నైవేద్యం పెట్టేందుకు పిండిని ఆడించాకే మరను దళితులు వినియోగించుకోవాలని అగ్రకులస్తులు ఆదేశించారన్నారు.