పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక ఉపాధ్యాయుడిని తలనరికి దారుణంగా హత్య చేశారు. చెచెనీయాకు చెందిన 18ఏళ్ల యువకుడు ఇందుకు బాధ్యుడని పోలీసులు భావిస్తున్నారు. టీచర్‌ను చంపిన అనంతరం సదరు యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. శుక్రవారం ఒక పాఠశాలలో ప్రవక్తకు సంబంధించిన క్యారికేచర్లను ప్రదర్శించినందుకు టీచర్‌ను హత్య చంపేశాడని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ ఆరంభించారు. మూడువారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. క్యారికేచర్లు ప్రదర్శించారంటూ గత నెల పాక్‌కు చెందిన ఒక యువకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచాడు. త్వరలో ఇస్లామిక్ రాడికల్స్‌కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు మాక్రాన్ ప్రభుత్వం యత్నిస్తోంది. హత్యకు గురైన టీచర్‌పై ఒక స్టూడెంట్ తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment