Teacher murder
-
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీచర్ సులోచన కేసులో వీడిన మిస్టరీ.. గాయత్రి భర్తే కారణం!
మైసూరు: సుమారు 6 నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో జరిగిన వసతి పాఠశాల ఉపాధ్యాయురాలు సులోచన (45) హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. నంజనగూడు నగరసభ సభ్యురాలితో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మొరార్జి దేశాయి వసతి పాఠశాల హిందీ టీచర్ సులోచన మార్చి నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది. అప్పటి నుంచి హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నగరసభ సభ్యురాలు గాయత్రి మురుగేశ్, ఆమె బంధువు భాగ్య, నాగమ్మ, కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని వెల్లడైంది. తన భర్తతో సన్నిహితంగా ఉందని.. సులోచన భర్త నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఇక గాయత్రి భర్త మురుగేష్ శ్రీకంఠేశ్వర దేవాలయంలో డి గ్రూప్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇతనికి, టీచర్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఉండడం అనేకసార్లు గాయత్రి గమనించి కసితో రగిలిపోయింది. తన భర్తను కలవవద్దని గాయత్రి టీచరమ్మను హెచ్చరించినప్పటికీ తీరు మారలేదు. దీంతో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది. నంజనగూడులోనే అద్దె ఇంట్లో సులోచన ఉండేది. మరో ముగ్గురి సహకారంతో సులోచన ఇంటికి వెళ్లి ఆమెను గొంతు పిసికి చంపి హత్య చేసినట్లు గాయత్రి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనకు ఒక పెళ్లయిన కూతురు, బెంగళూరులో ఉద్యోగం చేసే కొడుకు ఉన్నారు. ఇది కూడా చదవండి: అర్పిత 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా పార్థ ఛటర్జీ! -
ఫ్రాన్స్‌లో టీచర్ తలనరికిన యువకుడు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక ఉపాధ్యాయుడిని తలనరికి దారుణంగా హత్య చేశారు. చెచెనీయాకు చెందిన 18ఏళ్ల యువకుడు ఇందుకు బాధ్యుడని పోలీసులు భావిస్తున్నారు. టీచర్‌ను చంపిన అనంతరం సదరు యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. శుక్రవారం ఒక పాఠశాలలో ప్రవక్తకు సంబంధించిన క్యారికేచర్లను ప్రదర్శించినందుకు టీచర్‌ను హత్య చంపేశాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ ఆరంభించారు. మూడువారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. క్యారికేచర్లు ప్రదర్శించారంటూ గత నెల పాక్‌కు చెందిన ఒక యువకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచాడు. త్వరలో ఇస్లామిక్ రాడికల్స్‌కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు మాక్రాన్ ప్రభుత్వం యత్నిస్తోంది. హత్యకు గురైన టీచర్‌పై ఒక స్టూడెంట్ తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
చిత్తూరు, బంగారుపాళెం: ఉపాధ్యాయుని హత్య కేసులో నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఆమె ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించా రు. చెర్లోపల్లెకు చెందిన టీచర్ వాసుదేవన్ భార్య రమాదేవికి అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రమేష్‌తో వివాహేతర సం బంధం ఉంది. ఈ విషయం తెలిసిన వాసుదేవన్ భార్యను, రమేష్‌ను మందలించాడు. వారిలో మార్పు రాలేదు. వాసుదేవన్ ఈ విషయాన్ని రమేష్ భార్య ఉషారాణి దృషికి తీసుకువెళ్లాడు. ఆమె మూడు నెలలుగా భర్త రమేష్‌ను రమాదేవితో కలవనీయకుండా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భర్త వాసుదేవన్ అడ్డు తొలగించుకోవాలని రమాదేవి ప్రియుడితో కలిసి పథకం పన్నింది. శనివారం వాసుదేవన్ భార్యాపిల్లలతో కలిసి బంగారుపాళెం మండలం బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం బైక్‌లో చెర్లోపల్లెకు వెళ్లివస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని రమాదేవి ప్రియుడి కి చెప్పింది. రమేష్ నూనెగుండ్లపల్లె సమీపంలో సుమోతో ఢీకొట్టి వాసుదేవన్(40)ను హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకు నిదర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పారిపోయేందుకు కేజీ సత్రం బస్టాండ్ వద్ద ఉండగా రమేష్, రమాదేవిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. -
మబ్బువాళ్లపేటలో దారుణం
⇒బడిలోనే టీచర్ హత్య ⇒ ఆర్థిక లావాదేవీలే కారణమా..? ⇒ అనాథలైన ఇద్దరు చిన్నారులు ⇒ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు విద్యార్థులకు నీతి బోధనలు చేస్తూ సమాజానికి మంచి పౌరులను అందించాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. వివాహితురాలైన టీచర్‌ను ప్రేమ పేరిట వంచించాడు. ఆర్థిక లావాదేవీలతో గొడవ పడ్డాడు. చివరికి ఆమెను అందరూ చూస్తుండగానే బడిలోనే హత్య చేశాడు. ఈ సంఘటన గంగవరం మండలం మబ్బువాళ్లపేటలో గురువారం జరిగింది. పలమనేరు:పాఠశాలలోనే ఉపాధ్యాయురాలు హత్యకు గురైన సంఘటన జిల్లాలో సంచల నం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలం సూరయ్యగారిపల్లికి చెంది న చంద్రమౌళి(45) గంగవరం మండలం లోని గుండుగల్లు బొమ్మనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతంలో ఓ టీచర్‌ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇదే మండలం మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పలమనేరుకు చెంది న ప్రేమకుమారి(40)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలి యడంతో చంద్రమౌళి భార్య అతన్ని వదిలేసింది. ఈ నేపథ్యంలో చీటీలు వేస్తానని చెప్పి ప్రేమకుమారి నుంచి చెక్కులు తీసుకుని మోసం చేశాడు. ఈ విషయంగా 2014 మేలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. అప్పట్లో తనను తిరుపతికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశాడని ప్రేమకుమారి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పిం చారు. తనకున్న పలుకుబడితో మళ్లీ ఉద్యోగంలో చేరిన చంద్రమౌళి ఆరునెలలుగా ప్రేమకుమారి వెంట పడుతున్నాడు. భార్య ప్రేమకుమారి ప్రవర్తనపై విసుగు చెందిన భర్త రమేష్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఎక్సైజ్ ఎస్ఐగా చేరాల్చి ఉండగా.. ఎక్కైజ్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ పడడంతో ప్రేమకుమారి పాఠశాలకు రెండు నెలలు సెలవు పెట్టి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఇంటర్వూ్యల్లో ఎస్ఐగా ఎంపికైంది. త్వరలోనే ఆమె ఆ పోస్టులో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె గత వారం నుంచి పాఠశాలకు వెళుతోంది. ఎక్సైజ్ ఎస్ఐగా వెళ్లొద్దని ప్రియుడు బెదిరిస్తుండడంతో బెదిరింç ³#ల నేపథ్యంలో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకుని బడికి వెళుతోంది. గురువారం సైతం ఆమె తండ్రి అర్జునయ్యతో కలిసి వెళ్లింది. ఇంతలో మంకీ క్యాప్‌తో వచ్చిన వ్యక్తి నిమిషాల వ్యవధిలో ప్రేమకుమారిని కత్తితో 12 చోట్ల పొడిచాడు. విద్యార్థులు కేకలు వేయడంతో అర్జునయ్య అగంతకున్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. 108లో ఆమెను పలమనేరు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందింది. తమ కుమార్తెను ముసుగులో వచ్చి నరికింది చంద్రమౌళేనని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనాథలైన పిల్లలు ప్రేమకుమారికి బంగారుపాళ్యం మండలానికి చెందిన రమేష్‌తో పెళ్లి జరిగింది. వీరికి లయగ్రేస్(11), గిరిగ్రేస్(6) పిల్లలు ఉన్నారు. రమేష్ స్థానికంగా హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నాడు. తల్లి మృతిచెందడం, తండ్రి దూరంగా ఉండడంతో పిల్లలకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డలను బాగా చూసుకోండి రెండు రోజుల క్రితం ప్రేమకుమారి పాఠశాలకు వెళుతూ తన బిడ్డలకు మీరేదిక్కని, బాగా చూసుకోవాలని తమతో చెప్పిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
వీడిన ఉపాధ్యాయుడి హత్య మిస్టరీ
అనంతగిరి: ఉపాధ్యాయుడి హత్య మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్ కోసమే ఓ వ్యక్తి ఆయనను చంపేశాడు. పోలీసులు మృతుడి సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. వికారాబాద్ సీఐ లచ్చిరాంనాయక్ సోమవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గత ఏప్రిల్ 28న వికారాబాద్ పట్టణంలోని హైదారాబాద్ మార్గం కొత్రేపల్లి గేట్ సమీపంలో అజీజ్‌నగర్‌లోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం. అనంతయ్య(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెం దాడు. అనంతయ్య స్వగ్రామం ధారూ రు మండలం జైదుపల్లి. ఆయన భార్య సుగుణతో కలిసి అజీజ్‌నగర్‌లోనే ఉండేవాడు. భూపంచాయితీ నేపథ్యంలో సుగుణ తన అన్నదమ్ములపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు అనంతయ్య ఫోన్‌పై దృష్టి పెట్టారు. ఆయన వద్ద ఉన్న సామ్సంగ్ డ్యూయల్ ఫోన్ కనిపించకుండా పోయింది. అనంతయ్య ఫోన్లో కొంతకాలంగా ఎవరో వేరే సిమ్‌కార్డు వినియోగిస్తున్నారు. పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేశారు. నవాబ్‌పేట మండలానికి చెందిన ఓ వ్యక్తి సిమ్‌కార్డు పోయింది. దానిని వికారాబాద్ మండలం ధన్నారం అనుబంధ శ్రీరాంనగర్ తండావాసి రాత్లావత్ నరేష్ అనంతయ్య ఫోన్లో వేసుకొని ఉపయోగిస్తున్నాడు. పోలీసులు అనంతయ్య సెల్‌ఫోన్ ఐఎంఈఐపై దృష్టిపెట్టి నరేష్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అనంతయ్య ఏప్రిల్ 27న తన తల్లి అనారోగ్యానికి గురవడంతో ఆమెను ఆస్పత్రికి చూయించేందుకు వికారాబాద్‌కు వచ్చాడు. సాయంత్రం వికారాబాద్ సమీపంలోని బురంతపల్లిలో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అక్కడ మద్యం తాగి అజీజ్‌నగర్ వెళ్లేందుకు కొత్రేపల్లి గేట్ వద్దకు వచ్చాడు. అక్కడ బస్సు కోసం నిరీక్షిస్తున్న అనంతయ్యను నరేష్ గమనించాడు. అనంతయ్య వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ఎలాగైనా అపహరించాలని మద్యం మత్తులో ఉన్న నరేష్ భావించాడు. అనంతయ్య నుంచి అతడు సెల్‌ఫోన్ లాక్కునే సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలో నరేష్ అనంతయ్య నోరును అదిమి పట్టుకోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. అనంతరం అతడు సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కేసును సీసీఎస్ సీఐ సోమనాథ్, ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుళ్లు బాలునాయక్, శివలు చాకచక్యంగా ఛేదించారు. నిందితుడిని సోమవారం రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.