మబ్బువాళ్లపేటలో దారుణం
⇒బడిలోనే టీచర్ హత్య
⇒ ఆర్థిక లావాదేవీలే కారణమా..?
⇒ అనాథలైన ఇద్దరు చిన్నారులు
⇒ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
విద్యార్థులకు నీతి బోధనలు చేస్తూ సమాజానికి మంచి పౌరులను అందించాల్సిన ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. వివాహితురాలైన టీచర్‌ను ప్రేమ పేరిట వంచించాడు. ఆర్థిక లావాదేవీలతో గొడవ పడ్డాడు. చివరికి ఆమెను అందరూ చూస్తుండగానే బడిలోనే హత్య చేశాడు. ఈ సంఘటన గంగవరం మండలం మబ్బువాళ్లపేటలో గురువారం జరిగింది.
పలమనేరు:పాఠశాలలోనే ఉపాధ్యాయురాలు హత్యకు గురైన సంఘటన జిల్లాలో సంచల నం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలం సూరయ్యగారిపల్లికి చెంది న చంద్రమౌళి(45) గంగవరం మండలం లోని గుండుగల్లు బొమ్మనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతంలో ఓ టీచర్‌ను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇదే మండలం మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పలమనేరుకు చెంది న ప్రేమకుమారి(40)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలి యడంతో చంద్రమౌళి భార్య అతన్ని వదిలేసింది.
ఈ నేపథ్యంలో చీటీలు వేస్తానని చెప్పి ప్రేమకుమారి నుంచి చెక్కులు తీసుకుని మోసం చేశాడు. ఈ విషయంగా 2014 మేలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. అప్పట్లో తనను తిరుపతికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశాడని ప్రేమకుమారి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పిం చారు. తనకున్న పలుకుబడితో మళ్లీ ఉద్యోగంలో చేరిన చంద్రమౌళి ఆరునెలలుగా ప్రేమకుమారి వెంట పడుతున్నాడు. భార్య ప్రేమకుమారి ప్రవర్తనపై విసుగు చెందిన భర్త రమేష్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు.
ఎక్సైజ్ ఎస్‌ఐగా చేరాల్చి ఉండగా..
ఎక్కైజ్ ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ పడడంతో ప్రేమకుమారి పాఠశాలకు రెండు నెలలు సెలవు పెట్టి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఇంటర్వూ్యల్లో ఎస్‌ఐగా ఎంపికైంది. త్వరలోనే ఆమె ఆ పోస్టులో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె గత వారం నుంచి పాఠశాలకు వెళుతోంది. ఎక్సైజ్ ఎస్‌ఐగా వెళ్లొద్దని ప్రియుడు బెదిరిస్తుండడంతో బెదిరింç ³#ల నేపథ్యంలో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకుని బడికి వెళుతోంది. గురువారం సైతం ఆమె తండ్రి అర్జునయ్యతో కలిసి వెళ్లింది. ఇంతలో మంకీ క్యాప్‌తో వచ్చిన వ్యక్తి నిమిషాల వ్యవధిలో ప్రేమకుమారిని కత్తితో 12 చోట్ల పొడిచాడు. విద్యార్థులు కేకలు వేయడంతో అర్జునయ్య అగంతకున్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. 108లో ఆమెను పలమనేరు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందింది. తమ కుమార్తెను ముసుగులో వచ్చి నరికింది చంద్రమౌళేనని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనాథలైన పిల్లలు
ప్రేమకుమారికి బంగారుపాళ్యం మండలానికి చెందిన రమేష్‌తో పెళ్లి జరిగింది. వీరికి లయగ్రేస్(11), గిరిగ్రేస్(6) పిల్లలు ఉన్నారు. రమేష్ స్థానికంగా హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నాడు. తల్లి మృతిచెందడం, తండ్రి దూరంగా ఉండడంతో పిల్లలకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నా బిడ్డలను బాగా చూసుకోండి
రెండు రోజుల క్రితం ప్రేమకుమారి పాఠశాలకు వెళుతూ తన బిడ్డలకు మీరేదిక్కని, బాగా చూసుకోవాలని తమతో చెప్పిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.