Prostitution Under The Guise Of A Spa Center In Karnataka, 7 People Arrested - Sakshi
Sakshi News home page

స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం

Published Tue, Aug 8 2023 12:30 AM | Last Updated on Tue, Aug 8 2023 11:45 AM

- - Sakshi

సాక్షి,బళ్లారి: నగరంలోని ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో స్పా సెంటర్ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వస్తోంది. ఆదివారం రాత్రి నగరంలోని ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డులో వేశ్యవాటికపై కౌల్‌బజార్‌ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. తనిఖీలు చేసి పలువురు మహిళలను రక్షించడంతో పాటు సెంటర్‌ను నిర్వహిస్తున్న ప్రభుగౌడతో పాటు మరో ఏడుమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నాగాల్యాండ్‌, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలను రక్షించి, అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించే వారిని పట్టుకున్నారు. నగరంలో పలు స్పా(మసాజ్‌) సెంటర్ల పేరుతో లోపల అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే స్పా సెంటర్లలో అసాంఘీక కార్యకాలాపాలు జరుపుతూ నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయిలో ప్రముఖ లాడ్జీలు, హోటళ్లలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లను తనిఖీ చేస్తే పైన బోర్డులు మాత్రం మసాజ్‌ సెంటర్లు అని చూపుతూ లోపల మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలతో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement