
సాక్షి, యశవంతపుర: జైల్లో విచారణ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉడుపిలో జరిగింది. ఉడుపి ఒత్తినెణె సమీపంలోని హేనబేరు రోడ్డులో జులై 12న కార్కళకు చెందిన ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని సదానంద, తన స్నేహితురాలు శిల్ప సాయంతో కారులో పిలుచుకుని వచ్చి ఆయనకు నిద్ర మాత్రలు ఇచ్చి కారుతో సహా నిప్పు పెట్టారు.
ఈ ఘటనలో సదానంద ఉడుపి జైలులో ఉన్నాడు. 20 మంది ఖైదీలతో ఓ బ్యారెక్‌లో ఉన్న సదానంద ఆదివారం తెల్లవారుజామున పంచెతో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించి సహచర ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా సదానంద మార్గం మధ్యలో మృతి చెందాడు. కోర్టులో శిక్ష ఎక్కువగా పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.