sucide attack
-
ఇటీవలే పెళ్లి, అంతలోనే ..
సాక్షి, హోసూరు: ఇటీవలే పెళ్లయింది, కానీ అనారోగ్యంతో బాధపడుతూ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు హోసూరు సమీపంలోని కూస్తనపల్లి గ్రామానికి చెందిన అశోక్ (38). ఇతనికి గత ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అశోక్ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు అతన్ని చికిత్స కోసం హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. (చదవండి: ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు.. సృహతప్పి పడిపోయిన భార్య..) -
భర్తకు తెలియకుండా అప్పులు..చివరికి అదే ఆమెను..
సాక్షి, తాడిపత్రి అర్బన్: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని పాతకోటలో నివాసముంటున్న షేక్ గౌస్, ఖతీజా (38) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్తకు తెలియకుండా ఖతీజా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసింది. దీంతో పాటు సొంత పూచీకత్తుపై తన ఇంటి సమీపంలోని కొందరికి అప్పులు ఇప్పించింది. ఈ క్రమంలో అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తడంతో తరచూ వడ్డీ వ్యాపారులు ఇంటి వద్దకు చేరుకుని దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవవుతుందని భావించిన ఆమె శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!) -
ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత
సాక్షి, మియాపూర్ (హైదరాబాద్): ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడమేగాక తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటూరుజిల్లా, ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపతులకు కుమార్తె వైభవీ, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. వెంకటరాజు ముంబైలో ప్యాబ్రికేషన్ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శోభ తన కుమార్తె వైభవీ, గోవర్ధన్‌తో కలిసి మియాపూర్‌లోని న్యూ – హఫీస్‌పేట ఆదిత్య నగర్లో ఉంటోంది. కాగా అదే గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ బబ్లూ వారి ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో వైభవి కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. దీంతో కొన్నాళ్లుగా వైభవీ సందీప్‌ను దూరం పెడుతుంది. దీనిని జీర్ణించుకోలేని సందీప్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో శోభ ఇద్దరు పిల్లలతో సహా నగరానికి వలస వచ్చి న్యూ – హాపీస్‌పేట ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వైభవికి తమ సమీప బంధువుతో పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారం వారి నిశ్చతార్థం జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం ఉదయం నగరానికి వచ్చిన సందీప్ నేరుగా వైభవి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. కోపంతో కూరగాయాలు కోసే కత్తితో వైభవీ, ఆమె తల్లి శోభపై దాడి చేశాడు. వైభవిని గొంతు కింద చాతీభాగంలో, తల్లి శోభను కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అదే చాకుతో దీపూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సందీప్‌ను కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి తరలించారు. వైభవీ, తల్లి శోభలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిలకడగా సందీప్ ఆరోగ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందీప్‌ను పోలీసులు కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితి పరిశీలించిన ఈఎన్టీ వైద్యులు అతడి గొంతుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య
సాక్షి, యశవంతపుర: జైల్లో విచారణ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉడుపిలో జరిగింది. ఉడుపి ఒత్తినెణె సమీపంలోని హేనబేరు రోడ్డులో జులై 12న కార్కళకు చెందిన ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని సదానంద, తన స్నేహితురాలు శిల్ప సాయంతో కారులో పిలుచుకుని వచ్చి ఆయనకు నిద్ర మాత్రలు ఇచ్చి కారుతో సహా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో సదానంద ఉడుపి జైలులో ఉన్నాడు. 20 మంది ఖైదీలతో ఓ బ్యారెక్‌లో ఉన్న సదానంద ఆదివారం తెల్లవారుజామున పంచెతో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించి సహచర ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా సదానంద మార్గం మధ్యలో మృతి చెందాడు. కోర్టులో శిక్ష ఎక్కువగా పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: విహారయాత్రలో విషాదం..బస్సు బోల్తా ఇద్దరు మృతి) -
నిద్రమత్తులో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి..ఆపై భర్త కూడా..
సాక్షి, పరిగి: నిద్రమత్తులో ఉన్న భార్యను గొడ్డలికామతో తలపై కొట్టి హత్య చేసి.. ఆపై దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి భీమయ్య (55) కావలి పెంటమ్మ(50) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరి వివాహం చేసి అత్తవారిళ్లకు పంపించారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా భీమయ్య మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. ఎప్పటిలాగే దంపతులిద్దరూ గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో పెంటమ్మ నిద్రలోకి జారుకోగా భీమయ్య లేచి గొడ్డలి కామతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్య చనిపోయిందనే భయంతో భీమయ్య కూడా దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనికి తీసుకెళ్లేందుకు పెంటమ్మ వద్దకు వచ్చిన గ్రామస్తులు తలుపులు గడియ పెట్టి ఉండటాన్ని గమనించారు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అందరూ వచ్చిన తర్వాత గడియ పగలగొట్టి చూడగా.. పెంటమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. భీమయ్య దూలానికి వేలాడుతూ కనిపించాడు. వీరి పెద్ద కూతురు కృష్ణవేణి అత్తవారి ఇంటి వద్ద జరుగుతున్న భూవివాదాల నేపథ్యంలో మృతులు కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భీమయ్య మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. కూతురు కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. (చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్ రెడ్డి) -
పోలీస్ ఎగ్జామ్ రాసి వస్తున్న యువతిపై....ఫేస్బుక్ స్నేహితుడే అత్యాచారం
Mathura Woman Raped In Moving Car: ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ అత్యాచారాలకు అంతే లేదన్నట్లుగా రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంటుంది. తాజాగా పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న 21 ఏళ్ల యువతిపై కదులుతున్న కారులో అత్యాచారం జరిగింది. పైగా ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో సదరు మహిళ ఎలుకలు మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) అయితే నిందుతుడి ఆ మహిళకు ఫేస్బుక్లో స్నేహితుడిగా పరిచయమైన వ్యక్తే ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు . అంతేకాదు నిందుతుడు హర్యానా వాసి ఆర్మీ వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ నిందుతుడు వివాహితుడని లడఖ్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. పైగా తాము అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...మేము ఆ కారుని కూడా స్వాధీనం చేసుకున్నాం. అయితే ఆ డ్రైవర్ ఆ నిందితుడి బంధువే. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు అని చెప్పారు. ఈ క్రమంతో యూపీ యుపి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ నేరం గురించి ఆరా తీయడమే కాక మధుర పోలీసుల నివేదిక ఇమ్మని కోరింది. (చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్ టాటా ఆవేదన) -
ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం..
వనపర్తి క్రైం: సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన విద్యుత్ అధికారుల మాటలు నమ్మి తనకున్న భూమిని వారికి అప్పగించాడు. తీరా అధికారులు ఇచ్చిన మాట నెరవేర్చకపోయే సరికి ఏం చేయాలో తెలియక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోటపోతు బాలరాజు (28), శివరాములు ఐటీఐ పూర్తి చేశారు. ఆరేళ్ల కిత్రం గ్రామానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరైంది. దీని ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో.. భూమి సమకూరిస్తే ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో 2016లో గ్రామస్తులు అంగీకరించారు. దీంతో ఉద్యోగం కోసం బాలరాజు తల్లిదండ్రులను ఒప్పించి తనకున్న ఎకరన్నర భూమిని అమ్మాడు. శివరాములు వద్ద ఉన్న డబ్బులు, బాలరాజు భూమి అమ్మిన డబ్బులు కలిపి మరోచోట సర్వే నం.58లో 30 గుంటలను కొనుగోలు చేసి అదే ఏడాది మార్చి 29న వనపర్తి డీఈ తాళ్లపల్లి లింగయ్యకు అప్పగించారు. అయితే సబ్‌స్టేషన్ ప్రారంభమైనా ఇంతవరకు వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. మరో పది రోజుల్లో పెళ్లి.. అధికారులు ఇస్తామన్న ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో శనివారం రాత్రి కుంగిపోయాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామంలోని నీటిట్యాంకు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలరాజుకు ఈ నెల 14న పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి దుస్తులు తీసుకోవాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పినందుకే బాలరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతదేహాన్ని ప్రధాన రహదారిపై ఉంచి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. -
కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
-
ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి అరెస్టు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రాన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన ఐసిస్ తమిళనాడు మాడ్యూల్ సూత్రధారి మొహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏడు ప్రాంతాల్లో సోదాల సందర్భంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 14 మొబైల్ ఫోన్లు, 29 సిమ్‌కార్డులు, 10 పెన్‌డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు మెమొరీ కార్డులు, నాలుగు హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, సీడీలు, డీవీడీలు, ఒక కత్తి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల అనంతరం తమిళనాడుపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత నెల కోయంబత్తూరులో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో బుధవారం 35మందితో కూడిన అధికారుల బృందం కోయంబత్తూరుకు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలసి ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉక్కడం అన్భునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో సోదాలు జరిపారు. కోయంబత్తూర్‌కు చెందిన అజారుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు నాయకత్వంలో నడుస్తున్నట్టుగా అనుమానిస్తున్న తమిళనాడు మాడ్యూల్‌పై మే 30వ తేదీన కేసు నమోదు అయ్యింది. తమిళనాడు, కేరళలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు యువతను ఆకర్షించడం వారి లక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది. -
పుల్వామా దాడిలో వాడింది ఇతడి కారునే
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఆత్మాహుతి దాడిపై సాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ దాడిలో వినియోగించింది ‘మారుతి ఈకో’ కారు అని తేల్చిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) దాని యజమానిని కూడా గుర్తించింది. ఫోరెన్సిక్ నిపుణులు, వాహన నిపుణులు కలిసి చేసిన దర్యాప్తులో ఛాసిస్ నంబర్ ఆధారంగా ఆ కారు ఎవరి వద్ద ఉన్నదీ కనిపెట్టారు. అనంత్‌నాగ్ జిల్లా కేంద్రంలోని హెవెన్ కాలనీకి చెందిన జలీల్ అహ్మద్ హకానీ 2011లో మొదట ఈ కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఇది ఏడుగురి చేతులు మారి ఆఖరుకు దక్షిణ కశ్మీర్‌లోని బిజ్బెహారాకు చెందిన సజ్జాద్ భట్‌కు చేరింది. ఇతడు ఈ కారును ఫిబ్రవరి 4వ తేదీన అంటే దాడికి పది రోజుల ముందు కొనుగోలు చేశాడు. ఇతడిని షోపియాన్‌లోని సిరాజ్–ఉల్–ఉలూమ్ స్కూలు విద్యార్థిగా గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శనివారం అతడుండే ఇంటిపై దాడి చేశారు. కానీ, అతడు అక్కడ లేదు. ఆయుధాలు పట్టుకున్నట్లుగా ఉన్న అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండటంతో ఉగ్ర సంస్థ జైషే ముహమ్మద్‌లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. జైషే ముహమ్మద్‌కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లగా 40 మంది జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
మౌనికకు న్యాయం జరిగేనా?
దండేపల్లి(మంచిర్యాల) : పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు, ఏడాది కాలంగా ప్రేమించి గర్భవతిని చేశాడు. ఇక పెళ్లి విషయం అడిగితే పెళ్లి లేదు ఏమీ లేదంటూ, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ, యువతి గత కొద్ది రోజుల క్రితం ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆ తర్వాత ఆమె పోలీసు, రెవెన్యూ, ఐకేపీ అధికారులను కలిసింది. అయినా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో ఆమె మళ్లీ ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. మండలంలోని గుడిరేవుకు చెందిన జంగిల్ శ్రావణ్ ఇదే గ్రామానికి మౌనిక అనే యువతిపై కన్నేశాడు. కొద్ది రోజులు ఆమె వెంటపడ్డాడు. ఏంటీ నావెంట పడుతున్నావని ఆమె అడిగితే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆమె అతడి మాటలు నమ్మింది. ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువతి అప్పుడప్పుడు శ్రావణ్ వాళ్ల ఇంటికి కూడా వచ్చి ఇంటి పనులు చేసేది. దీంతో వీరిద్దరి ప్రేమ విషయం అతడి తల్లికి కూడా తెలిసింది. ఇంతలో యువతి గర్భం దాల్చింది. విషయం అతడికి చెప్పడంతో గర్భం తీయించుకోవాలని శ్రావణ్ ఆమెను ఒత్తిడి చేసి చేయి చేసుకున్నాడు. ఇలా జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆమె వద్దకు రాకుండా తప్పించుకు తిరిగాడు. ఓ రోజు గ్రామ సమీపంలో అడ్డుకుని నా పరిస్థితి ఏంటని ఆమె నిలదీసింది. పెళ్లి చేసుకోనని శ్రావణ్ చెప్పడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించింది. గత నెల 17న ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు డబ్బా పట్టుకుని తల్లిదండ్రుతో కలిసి బైఠాయించింది. స్థానికుల సలహాతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. తహసీల్దార్, ఐకేపీ ఏపీఎంతో పాటు మహిళా సంఘాలను కలిసి తన గోడు వెల్లబోసుకుంది. పోలీసులు కూడా యువకుడిని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. అయినా అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆతర్వాత అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. శనివారం మళ్లీ ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె బైఠాయించడం చూసిన ప్రియుడి తల్లి ఇంటికి తాళం వేసి వెళ్లి పోయింది. యువతికి స్థానిక సర్పంచ్ మంజుభార్గవి, గ్రామానికి చెందిన పలువురు మహిళలు మద్దతుగా నిలిచారు. -
పోలీస్ సేఫ్..?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : అన్యాయంగా అట్రాసిటీ కేసులో ఇరుక్కొని బలవన్మరణం పొందిన నెన్నెలకు చెందిన రంగు రామాగౌడ్ కేసులో పోలీసుల పాత్ర చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఎస్టీ కాని పల్ల మహేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించడంతోనే రామాగౌడ్ మనస్తాపంతో బలవన్మరణం పొందినట్లు నిర్ధారణ అయింది. ఫిర్యాదుదారు పల్ల మహేష్‌కు తహసీల్ధార్ సత్యనారాయణ జారీ చేసిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం సరైనదో.. కాదో తేల్చేందుకు రామాగౌడ్ మృతి తరువాత జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను విచారణాధికారిగా నియమించగా, ఆయన నిజాన్ని నిగ్గు తేల్చారు. పల్ల మహేష్ బీసీ అని, తహసీల్దార్ ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఈనెల 26న కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు తహసీల్దార్‌ను రాత్రికి రాత్రే సస్పెండ్ చేశారు. తహసీల్దార్ సస్పెన్షన్‌తో రామాగౌడ్ ఆత్మహత్యకు తప్పుడు ఎస్టీ ధ్రువీకరణపత్రంతో నమోదైన అట్రాసిటీ కేసే కారణమని స్పష్టమైంది. అయినా... తప్పుడు సర్టిఫికేట్‌తో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో కేసు నమోదు చేయాలనేది నిబంధన. కానీ గొడవ జరిగిన రోజే తనపై పల్ల మహేష్ దాడి చేశాడని రామాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్ఐ కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో మరుసటి రోజు పల్ల మహేష్ నుంచి ఫిర్యాదు అందిన అరగంటలోనే ఆగమేఘాల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ దాఖలైన తరువాత 13 రోజులకు విచారణకు వచ్చిన ఏసీపీ బాలుజాదవ్ ఎస్టీ అయిన పల్ల మహేష్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లు నిర్ధారించారు. ఇందుకు ఆయన తహసీల్దార్ ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్‌నే పరిగణలోకి తీసుకున్నారే తప్ప, పల్ల మహేష్ తండ్రి బీసీ అని, మహేష్ చెల్లెలుకు బీసీ కులం సర్టిఫికేట్ జారీ అయిందనే విషయాన్ని పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో అనాథలైన రామాగౌడ్ భార్య సరస్వతి, కూతురు వసుధలకు తాత్కాలికంగా కొన్ని హామీలు ఇచ్చి కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గొడవ జరిగిన నాడే ఫిర్యాదు చేసినా... నో యాక్షన్ నెన్నెల పెద్ద చెరువులో అక్రమంగా శనగపంట వేశాడని పల్ల మహేష్‌పై రామాగౌడ్ పత్రికలకు ఎక్కిన తరువాత డిసెంబర్ 12న గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తెస్తున్న రామాగౌడ్, సర్పంచి ఇంటి నుంచి వస్తున్న పల్ల మహేష్‌కు గొడవ జరిగింది. వెంటనే తనను మహేష్ కొట్టినట్లు రామాగౌడ్ డిసెంబర్ 12న సాయంత్రం 6.30 గంటలకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసి మహేష్ మరుసటి రోజు డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు రామాగౌడ్ మీద ఫిర్యాదు చేశాడు. ‘సర్పంచి ఇంటి నుంచి వస్తున్న తనను రామాగౌడ్ అడ్డగించి, కులం పేరుతో ధూషించాడని’ ఫిర్యాదు చేయగానే ‘ప్రివెంటివ్ ఆఫ్ అట్రాసిటీస్ సెక్షన్3’ కింద అరగంటలో అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్ఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని బట్టి కేసు నమోదు, తదుపరి చర్యల వెనుక నెన్నెల సర్పంచి భర్త, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం ఉన్నట్లు రామాగౌడ్ భార్య సరస్వతి, గీత కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేసు నమోదు కాగానే రామాగౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లగా డిసెంబర్ 26న విచారణ కోసం నెన్నెల వచ్చిన ఏసీపీ బాలుజాదవ్‌కు స్థానికులు పల్ల మహేష్ ఎస్టీ కాదనే విషయాన్ని చెప్పినా వినలేదని వారు ఆరోపిస్తున్నారు. అప్పుడే కేసును అట్రాసిటీ చట్టం నుంచి తొలగించినట్లయితే రామాగౌడ్ బతికుండేవాడనేది వారి వాదన. తహసీల్దార్‌పై కలెక్టర్ చర్యతో సరా..? రామాగౌడ్ మృతి తరువాత ఈ కేసు తీవ్రతను గమనించిన కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఫిర్యాదుదారు పల్ల మహేష్‌కు జారీచేసిన ఎస్టీ ధ్రువీకరణ æపత్రంపై విచారణ జరపాల్సిందిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఈనెల 26న నివేదిక ఇస్తూ... పల్ల మహేష్ ఎస్టీ కాదని తేల్చి చెప్పారు. ఆ వెంటనే కలెక్టర్ నెన్నెల తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ చర్యతో ఈ కేసు తప్పడుదని తేలిపోయింది. అయినా తదుపరి చర్యలకు పోలీస్ యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాజకీయ జోక్యంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో రామాగౌడ్ ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదనే దానికి సమాధానం లేదు. ఎమ్మెల్యేను న్యాయం చేయమన్న సరస్వతి... కాగా రామాగౌడ్ భార్య సరస్వతి మంగళవారం రూ.50వేల ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వద్ద తన గోడు వెల్లబోసుకుంది. తన భర్త చావుకు కారణమైన పల్ల మహేష్, మండల కో ఆప్షన్ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆయన కూడా హామీ ఇచ్చారు. ఏం చేస్తారో వేచిచూడాలి. -
పాక్‌లో సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడి
కరాచీ: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రావిన్సులోని ఫతేపూర్‌లో పీర్ రఖేల్ షా సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఏఎస్సై, కానిస్టేబుల్ సహా 18 మంది దుర్మరణం చెందగా, 25 మంది గాయపడ్డారు. దర్గా ప్రధాన ప్రవేశద్వారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దర్గాలను పూజించడం ఇస్లామ్‌కు వ్యతిరేకమంటున్న తాలిబాన్లు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
ఉపాధ్యాయుడి ఆత్మహత్య
విశాఖపట్నం: ఊహించని రీతిలో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డుకు పక్కన చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొత్తమారిడికోటకు చెందిన కిమిడి చిరంజీవి (30) నందిగాం మండలం కమలాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనులపై విశాఖకు వచ్చాడు. రాత్రి 7.30 గంటల సమయంలో చిరంజీవి కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద రోడ్డు పక్కన తన బైక్ ఆపి సమీపంలో ఉన్న చెట్ల చాటుకు వె ళ్లాడు. కొద్ది సేపటి తర్వాత అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఎవరో చెట్టుకు వేలాడుతున్నట్టుగా గుర్తించి స్థానికులకు చెప్పాడు. అంతా వెళ్లి చూడగా చిరంజీవి మృతి చెంది చెట్టుకు వేలాడుతూ ఉన్నాడు. దీంతో కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాం పరిశీలించారు. మృతుడి సెల్ఫోన్లో నంబర్ల ఆధారంగా మృతుడి తండ్రి కృష్ణకు సమాచారం ఇచ్చారు. కంచరపాలెం సీఐ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో ఎస్సై సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిరంజీవి విశాఖకు ఎందుకు వచ్చినట్టు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు అనేది తెలియాల్సి ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడి
కరాచీ: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామం వద్ద భారీ సంఖ్యలో షియా వర్గానికి చెందిన ముస్లింలు గుమిగూడారు. పవిత్ర మొహర్రం మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే సమయంలో బాంబులు ధరించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అక్కడికి వచ్చి తనను తాను పేల్చుకోవడం తో ఈ దారుణం చోటుచేసుకుంది.