పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు.
కరాచీ: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు. బాలోచిస్తాన్ ప్రావిన్స్లోని ఓ గ్రామం వద్ద భారీ సంఖ్యలో షియా వర్గానికి చెందిన ముస్లింలు గుమిగూడారు.
పవిత్ర మొహర్రం మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే సమయంలో బాంబులు ధరించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అక్కడికి వచ్చి తనను తాను పేల్చుకోవడం తో ఈ దారుణం చోటుచేసుకుంది.