moharram
-
మొహర్రం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సందేశం
సాక్షి, గుంటూరు: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నేడు మొహర్రం సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ సందేశం విడుదల చేశారు.‘ముస్లిం సోదరులు పాటించే మొహర్రం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీక. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రమే. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయి’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
దోష నివారణ చేస్తానని.. గుడి వద్ద ఉండమని చెప్పి.. సొమ్ముతో..
సంగారెడ్డి: ఇంటికి దోష నివారణ పూజ చేస్తానని యజమానులకు టోకరా వేసి బంగారంతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అంబేద్కర్‌నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిముత్తగల్ల భూమవ్వ పెద్ద కుమారుడు బాబు గడ్ల వ్యాపారస్తుడి వద్ద డ్రైవర్. గతేడాది మొహర్రం పండగ రోజు అతను విజయవాడకు చెందిన షేక్ మస్తాన్‌ను ఇంటికొచ్చాడు. గృహానికి దోషం ఉందని నివారణకు పూజ చేయాలంటే తిరస్కరించారు. తాజాగా బాధితురాలి చిన్న కుమారుడైన మధుతో మస్తాన్ సోషల్ మీడియాలో చాటింగ్ చేసి నంబర్ తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి వచ్చి, పూజ చేస్తున్నాడు. మధ్యలో అమ్మవారి అలంకరణకు బంగారు నగలు కోరాడు. 2.5 తులాల పుస్తెల తాడు, పావు తులం కమ్మలు, 5 తులాల వెండి పట్టీలు ఇచ్చారు. ఈ తంతు ముగిసిన అనంతరం సామగ్రిని సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఓ ప్రాంతంలో పడవేయాలని చెప్పగా మధు వెళ్లాడు. పొద్దు పోయే వరకు రాలేదు కాల్ చేయగా తనను గుడి వద్ద ఉండమని చెప్పి మస్తాన్ వెళ్లాడు. తర్వాత కుటుంబీకులు అనుమానం వచ్చి గదిలో వెళ్లి చూస్తే బంగారం నగలు లేవు. తాము మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐక్యతకు ప్రతీక మొహర్రం..!
సత్యసాయి: హిందూముస్లింల ఐక్యతకు ప్రతీకగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొహర్రం వేడకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని చావిడిలో పీర్లను కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గుండం తవ్వకంతో మొదలు.. గ్రామాల్లో గుండం తవ్వకాలతో మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రత్యేక ప్రదేశాల్లో భద్రపరచిన పీర్లను వెలికి తీసి శుభ్రం చేసి ప్రత్యేకంగా అలంకరించి 5వ రోజు చావిడిలో ప్రతిష్టిస్తారు. చావిడి వద్ద గుండంలో టన్నుల కొద్దీ కట్టెలు వేసి నిప్పంటిస్తారు. ముజావర్ల ఆధ్వర్యంలో ఆరాధన ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటి ఐదు రోజులు చావిడిలో పీర్లను కొలువుదీర్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 7వ రోజు చిన్న సరిగెత్తు నిర్వహించి పీర్ల గ్రామోత్సవం చేస్తారు. పదో రోజు పెద్ద సరిగెత్తులో భాగంగా పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజు వైభవంగా దీపారాధన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న పెద్ద సరిగెత్తును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే రోజు ఉపవాస దీక్షలతో అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. అనంతరం నిప్పుల గుండం పూడ్చి దానిమ్మ, తదితర పండ్ల మొక్కలు నాటడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మొహర్రంతో నూతన సంవత్సరం ఆరంభం మొహర్రం అంటే ఉర్దూలో త్యాగం, క్షమాపణ అని అర్థం. ఇస్లాం ధర్మం ప్రకారం మొహర్రం నుంచి ఇస్లామిక్ క్యాలెండర్ ఆరంభమవుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం.. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఈ నెల 19న ప్రారంభమై 29తో ముగుస్తుంది. ఇస్లాం ధర్మ పరిరక్షణలో భాగంగా ఇమామ్, హుస్సేన్, తదితర వీరుల సంస్మరణార్థం మొహర్రం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. క్రీ.శ.14వ శతాబ్దంలో ఇరాక్‌లోని కర్బలా ప్రాంతంలో శాంతి స్థాపనకు చేసిన యుద్ధంలో వారు తమ ప్రాణ త్యాగం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. దీంతో అప్పటి నుంచి మొహర్రంను ముస్లింలు సంతాప దినాలుగా నిర్వహిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్: ఈ వారం ఇలా కొనసాగే ఛాన్స్
ముంబై: దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో ఈ వారం సూచీల కదలికలకు అంతర్జాతీయ పరిణామాలే కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు జూన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన ఘట్టాన్ని దాదాపు పూర్తి చేశాయి. ఆయా రాష్ట్రాల కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ మూడో వేవ్ విస్తరణ అంశాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించున్నాయి. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. మొహర్రం సందర్భంగా గురువారం(ఆగస్ట్ 19న) ఎక్స్ఛేంజ్లకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితంకానుంది. ‘‘జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో మార్కెట్లో దీర్ఘకాలం పాటు బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఇదే సమయంలో సూచీల రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో చిన్నపాటి దిద్దుబాటుకు అవకాశం లేకపోలేదు. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో మూడునెలల కనిష్టానికి దిగివచ్చింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా అంచనాలకు తగ్గట్లే నమోదైతే ఆర్బీఐ వడ్డీరేట్ల భయాలు తగ్గి ఈ వారంలోనూ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 16500 స్థాయిపైన ముగిసింది. అప్‌ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 16,800–17,000 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువస్థాయిలో 16,380 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో గతవారంలో సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల రికార్డు స్థాయిలను నమోదుచేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1160 పాయింట్లు, నిఫ్టీ 291 పాయింట్లను ఆర్జించాయి. అంతర్జాతీయ పరిణామాలు చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడి అవుతాయి. ద్రవ్యోల్బణ కట్టడి చర్యలపై ఫెడ్ రిజర్వ్ ఆలోచన తీరును మార్కెట్ వర్గాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. బాండ్ల కొనుగోళ్లను క్రమంగా తగ్గించాలని కొందరు ఫెడ్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ అం శంపై మినిట్స్‌లో సానుకూల వైఖరి ఉంటే ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సంభవించవ చ్చు.యూరోజోన్ జూలై ద్రవ్యోల్బణ గణాంకాలు అదేరోజున(ఆగస్ట్18న)విడుదల కానున్నాయి. టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు కేంద్ర గణాంకాల శాఖ నేడు(సోమవారం) టోకు ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనుంది. జూన్‌లో 12.07 శాతంగా నమోదైన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం జూలైలో 11.30% దిగిరావచ్చనే ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కూడా అంచనాలకు తగ్గట్లు నమోదైతే ఆర్బీఐ వడ్డీరేట్ల భయాలు తగ్గి మార్కెట్ మరింత ముందుకెళ్లవచ్చు. ఆర్బీఐ శుక్రవారం ఆగస్ట్ 13తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల గణాంకాలను వెల్లడించనుంది. నికర కొనుగోలుదారులుగా ఎఫ్ఐఐలు ఆర్థిక వ్యవస్థ రికవరీ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఈ ఆగస్ట్ ప్రథమార్థంలో ఎఫ్ఐఐలు రూ.2,085 కోట్ల షేర్లను కొన్నారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ.2,044 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒకే రోజున నాలుగు లిస్టింగ్‌లు ఒకేరోజున నాలుగు లిస్టింగ్‌లతో ప్రాథమిక మార్కెట్... సెకండరీ మార్కెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈ ఆగస్ట్ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్న నాలుగు కంపెనీల షేర్లు సోమవారం(నేడు) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. దేవయాని ఇంటర్నేషనల్, క్రిష్ణా డయాగ్నస్టిక్స్, ఎక్సారో టైల్స్, విండ్లాస్ బయోటెక్ టైల్ కంపెనీల షేర్లు ఇందులో ఉన్నాయి. గ్రే మార్కెట్లో ఈ నాలుగు కంపెనీల షేర్లు ప్రీమియం ధరలతో ట్రేడ్ అవుతున్నందున లిస్టింగ్‌లో లాభాల్ని పంచవచ్చు. ఇదే వారంలో ఆప్టస్ వేల్యూ, నువోకో విస్టాస్ ఇష్యూలకు సంబంధించిన అలాట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అలాగే కార్‌ట్రేడ్ టెక్, నువాకో విస్టా కార్పొరేషన్ కంపెనీలు శుక్రవారం ఐపీఓ షేర్లను లిస్ట్ చేయాలని భావిస్తున్నాయి. -
మొహరం ఊరేగింపునకు సుప్రీంకోర్టు నో
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మొహరం ప్రదర్శనలను అనుమతించేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయాలని పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్ధానం సూచించింది. ఊరేగింపులకు అనుమతిస్తూ దేశమంతటికీ తాము సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాధారణ ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని, ఇది గందరగోళానికి తావివ్వడమే కాకుండా కోవిడ్-19 వ్యాప్తికి ఓ వర్గాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెద్దసంఖ్యలో ప్రజల ఆరోగ్యానికి ముప్పును కలిగించేలా తాము ఉత్తర్వులు జారీ చేయలేమని, మీరు హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొంది. పూరి జగన్నాథ్ రథయాత్ర ఒక నిర్ధిష్ట ప్రాంతానికి సంబంధించిన అంశమని, ఇది నిర్ధిష్ట ప్రదేశం కావడంతో ప్రమాదాన్ని అంచనా వేసి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశామని తెలిపింది. పిటిషన్‌ను ఉపసంహరించి హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. మొహరం ప్రదర్శనలకు అనుమతించాలని షియా నేత సయ్యద్ కల్బే జవాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్‌ను అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా కోరింది. లక్నోలో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అనుమతి కోసం హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొంది. చదవండి : విజయ్ మాల్యాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు -
మొహర్రం ఊరేగింపునకు నో
సాక్షి, హైదరాబాద్: మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మొహర్రం ఊరేగింపునకు అనుమతి కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలో తాము ఆదేశాలివ్వలేమని తేల్చిచెప్పింది. ఇటీవల కేంద్ర హోంశాఖ జారీచేసిన మార్గదర్శకాల మేరకు మసీదు/ప్రార్థనా మందిరం ఆవరణలో మొహర్రం ఉత్సవాలు చేసుకోవచ్చని సూచించింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఇతర రక్షణ చర్యలను తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా ఉత్సవాలు నిర్వహిస్తామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని హామీ ఇవ్వాలని, ఈ మేరకు అనుమతులు మంజూరు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ను బుధవారం హైకోర్టు ఆదేశించింది. మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు అనుమతి ఇచ్చేలా నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని, ఊరేగింపు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగును తెచ్చేందుకు అనుమతివ్వాలని ఫాతిమా సేవాదళ్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారించారు. గత కొన్నేళ్లుగా ఈ ఊరేగింపు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 30న ఊరేగింపునకు అనుమతించా లని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పాతబస్తీలోని బీబీకా ఆలం నుంచి చాదర్‌ఘాట్ మసీదు వరకు ఊరేగింపు ఉంటుందని, ఇందుకు అనుమతిచ్చేలా నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిందని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రార్థనా మందిరం ఆవరణలో ఉత్సవాలు చేసుకునేందుకు అనుమతి వ్వాలని సీపీని ఆదేశిస్తూ విచారణను ముగించారు. -
ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మొహర్రం ఊరేగింపునకు అనుమతించేలా ఆదేశాలు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఓ వ్యాజ్యాన్ని విచారిస్తూ అనుమతి నిరాకరించిందని పేర్కొన్న న్యాయస్థానం.. తాము కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. కాగా మొహర్రం అంబారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫాతిమా సేవాదళ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.(చదవండి: వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోంది: హైకోర్టు) ఈ సందర్భంగా... ఈ నెల 30న పాతబస్తీ డబీర్‌పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ క్రమంలో హైకోర్టు ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. పిటిషనర్ తరఫున కౌన్సిల్ పాండురంగారావు వాదనలు వినిపించారు. ఊరేగింపునకై పిటిషనర్.. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను సొంత ఖర్చులతో తెప్పించుకుంటారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలమేమని తేల్చి చెప్పింది.(చదవండి: శిఖం భూములనెలా కేటాయించారు? ) -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ, నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని, వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. ♦ డబీర్‌పుర వైపు నుంచి ఆల్వా బీబీ వైపు వచ్చే వాహనాలను సునార్ గల్లీ ‘టి’ జంక్షన్ నుంచి మత్తాకీ ఖిడ్కీ వైపు మళ్లిస్తారు. ♦ డబీర్‌పుర వైపు నుంచి వచ్చేవాహనాలను షేక్ ఫైజా కమాన్ వైపు అనుమతించకుండా జబ్బీర్ హోటల్ వైపు పంపిస్తారు. ♦ యాకత్‌పుర రైల్వే స్టేషన్ నుంచి షేక్ ఫైజా కమాన్ వైపు వెళ్లే వాహనాలను బడా బజార్ ‘టి’ జంక్షన్ నుంచి చావ్నీ మీదుగా మీర్ జుల్మా తలాబ్‌కట్ట వైపు పంపిస్తారు. ♦ పురానీ హవేలీ నుంచి ఏతిబజార్ చౌక్ వచ్చే వాహనాలను సెట్విన్ చౌరస్తా నుంచి డబీర్‌పుర వైపు మళ్లిస్తారు. ♦ మిట్టీ కా షేర్ నుంచి ఏతిబజార్ వైపు వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మదీనా చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ మొఘల్‌పుర నుంచి కోట్ల అలీజా వైపు వెళ్లే వాహనాలను బీబీ బజార్ చౌరస్తా నుంచి తలాబ్‌కట్ట వైపు మళ్లిస్తారు. ♦ మొఘల్‌పుర వాటర్ ట్యాంక్ నుంచి చౌక్ మదీనా ఖాన్ వైపు వచ్చే వాహనాలను హఫీజ్ ధంకా మసీదు నుంచి శాలిబండ వైపు పంపిస్తారు. ♦ శాలిబండ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను పార్శీ కేఫ్ నుంచి మొఘల్‌పుర వైపు పంపిస్తారు. ♦ పురానాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ ముర్గాన్ నుంచి ఛేలాపురా, షాగుంజ్, ఖిల్వత్ వైపు పంపిస్తారు. ♦ హిమ్మత్పురం నుంచి ఖిల్వత్, లాడ్ బజార్ వైపు వెళ్లే వాహనాలను మోతీగల్లీ నుంచి మూసాబౌలి వైపు మళ్లిస్తారు. ♦ షక్కీర్కోటి నుంచి వచ్చే వాహనాలను మిట్టీ కా షేర్ నుంచి ఘాన్సీబజార్, ఛేలాపుర వైపు పంపిస్తారు. ♦ సిటీ కాలేజ్, ముస్లింజంగ్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జ్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు. ♦ నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా చౌరస్తా నుంచి సిటీ కాలేజ్ వైపు పంపిస్తారు. ♦ చాదర్‌ఘాట్, సాలార్జంగ్ బ్రిడ్జి, నూర్ ఖాన్ బజార్ వైపు నుంచి వచ్చే వాహనాలను దారుష్షిఫా చౌరస్తా నుంచి నయాపూల్ వైపు పంపిస్తారు. ♦ చాదర్‌ఘాట్ వైపు నుంచి వచ్చే వాహనాలను కాలీఖబర్ వైపు పంపించరు. వీటిని శాంతి లాడ్జ్ వద్ద నుంచి చాదర్‌ఘాట్ బ్రిడ్జి వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలా ♦ మొహర్రం ఊరేగింపు నేపథ్యంలోసికింద్రాబాద్లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవిమంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉంటాయి. ♦ ట్యాంక్‌బండ్, కర్బాలా మైదాన్ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ నుంచి కవాడీగూడ, బైబిల్‌హౌస్, ఆర్పీ రోడ్ మీదుగా మళ్లిస్తారు. ♦ కర్బాలా మైదాన్ మీదుగా ఆర్పీ రోడ్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను బేగంపేట్ పాత ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ రోడ్ మీదుగా పంపిస్తారు. ♦ ఎంజీ రోడ్, సెంట్రల్ టెలిగ్రాఫిక్ ఆఫీస్ ఐలాండ్, రాణిగంజ్ మధ్య వన్‌వే అమలులో ఉంటుంది. కేవలం రాణిగంజ్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ట్రాఫిక్‌ను రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిస్టర్స్ రోడ్ వైపు పంపిస్తారు. -
‘భారత క్రికెట్ జట్టు అత్యుత్తమమైనది’
సాక్షి, విజయవాడ : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు, 1983 ప్రపంచకప్ విజేత జట్టులోని వికెట్‌కీపర్ సయ్యద్ కిర్మాణి గన్నవరంలో సందడి చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరగనున్న మొహరం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బెంగళూరు నుంచి స్పైస్‌జెట్ విమానంలో మధ్యాహ్నం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. ఆయనకు ముస్లిం మతగురువు మౌలానా గులాం మసూద్, అభిమానులు ఎం.అబ్బాస్, పాగోలు సురేష్, మహదీ అబ్బాస్, ఎస్కే అజాద్, శంకర్, హసనస్కరీ, ఎస్కే అజాద్, బాఖర్ అబ్బాస్, నాగరాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం గన్నవరంలోని డాక్యుమెంట్ రైటర్ అబ్బాస్ కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్ జట్టులో 15 ఏళ్ల పాటు వికెట్‌కీపర్‌గా కొనసాగిన తాను 88 టెస్టులు, 49 వన్డే మ్యాచ్‌లు ఆడినట్లు తెలిపారు. 1983లో కపిల్‌దేవ్ సారధ్యంలో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో తాను కీలకపాత్ర పోషించడం జీవితంలో మరిచిపోలేని విషయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులు సత్కారించిందన్నారు. ప్రస్తుతం విరాట్‌కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని అన్నారు. జట్టులో సమర్ధులైన, పట్టుదల, దేశభక్తి కలిగిన క్రీడాకారులు ఉన్నారని కితాబిచ్చారు. -
త్యాగానికి ప్రతీక మొహర్రం!
సాక్షి, హైదరాబాద్: మానవజాతి సుగుణాల్లో అత్యున్నతమైన త్యాగానికి మొహర్రం ప్రతీక అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. దైవ విశ్వాసంకోసం జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణత్యాగాన్ని ముహర్రం గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. మంచితనం, త్యాగానికి పర్యాయపదం మొహర్రం అన్నారు. ముహర్రంను స్ఫూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి పునరంకితమవుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. త్యాగనిరతికి పునరంకితం కావాలి: కేసీఆర్ ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొహర్రంను స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీ, సత్ప్రవర్తన, న్యాయం, మానవత్వం, త్యాగనిరతికి ప్రతి ఒక్క రూ పునరంకితం కావాలని సీఎం తన సందేశంలో కోరారు. -
ఇస్లాం నూతన సంవత్సరం మొహర్రమ్
‘మొహర్రమ్ ’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇస్లామ్ ధర్మంలో దీనికొక ప్రత్యేకత ఉంది. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉండింది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా ‘ముహర్రం’ నుండే కొత్తసంవత్సరం ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించబడే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా (ఫర్జ్ గా) నిర్ణయించబడక పూర్వం ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ప్రకారం, ఒకసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. ఆరోజు అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. అది ముహర్రం పదవ తేదీ. వారిని ప్రవక్త అడిగారు ఏమిటి ఈరోజు విశేషం? అని. దానికి వారు, ‘ఇదిచాలా గొప్పరోజు.ఈరోజే అల్లాహ్ మూసాను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దేవునికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు రోజా పాటిస్తాము’. అని చెప్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ఆషూరా రోజా కేవలం యూదులే కాదు క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు.అంటే ముహర్రం మాసం 9,10 లేదా 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి. షహీదులు దైవానికి సన్నిహితులు కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంతమాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర)అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే, ‘ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరులయ్యారో వారిని మృతులు అనకండి. వారు సజీవంగా ఉన్నారు. తమ ప్రభువు వద్ద ఆహారం కూడా పొందుతున్నారు.’ అంటోంది పవిత్రఖురాన్ . (3–169) దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, అమరులు అల్లాహ్‌కు సన్నిహితులేకాదు, ఆయన ద్వారా ఆహారం కూడా పొందుతున్నారు. కనుక వారుసజీవంగా ఉన్నారని నమ్మవలసి ఉంటుంది. అయితే, అమరులు సజీవంగా ఉండడం, ఆహారం పొందడం ఏమిటి? అన్నసందేహం కూడా ఇక్కడ తలెత్తే అవకాశం ఉంది. హజ్రత్ మస్రూఖ్ (ర) ఇలా అంటున్నారు. ‘మేము ఈ ఆయతుకు సంబంధించిన వివరణ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (ర)గారిని అడిగాము. అప్పుడాయన, ‘మేము కూడా ఇదే విషయం దైవప్రవక్త ముహమ్మద్ (స)గారికి విన్నవించుకున్నాము. దానికి ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ‘షహీదులు సజీవంగా ఉండడం, వారు ఆహారం పొందడం అంటే అర్ధమేమిటంటే, వారి ఆత్మలు పచ్చని పక్షుల రూపంలో ఉంటాయి. వాటికోసం అందమైన గోపురాలు దైవసింహాసనానికి వేలాడుతూ ఉంటాయి. ఆ పక్షులు స్వేచ్ఛగా, సంతోషంగా స్వర్గంలో, స్వర్గవనాల్లో విహరిస్తూ ఉంటాయి. మళ్ళీ తమ గోపురాలకు చేరుకుంటాయి. ఇదీ షహీదుల స్థాయి, వారి గౌరవం. వారి ఘనత. కనుక హజ్రత్ ఇమామె హుసైన్ (ర)అమరత్వం మరణం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపపనార్ధం, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మంకోసం, మానవీయ విలువలకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. దానికి ఇమామ్ స్ఫూర్తి ప్రేరణ కావాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కోర్కెలు తీర్చే రొట్టెలు
భక్తుల రొట్టెలకే సంతసించి వారు కోరిన కోర్కెలు బారాషహీద్ తీరుస్తారని నమ్మకం. విశ్వాసమే ప్రధానంగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా బారాషహీద్ ఖ్యాతి గాంచింది. ఇచ్చి పుచ్చుకోవడంలో మానవత్వం, పరస్పర సహకారం ఉందనే తత్వాన్ని బోధిస్తూ రొట్టెల పండగ చేసుకుంటారు. ఇందుకు నెల్లూరులోని బారాషహీద్ దర్గా ఖ్యాతిగాంచింది. వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతూ లక్షలమంది భక్తులు దర్గాకు చేరుస్తోంది. పవిత్ర యుద్ధంలో అమరులైన బారాషహీద్ పవిత్రమైన స్వర్ణాల చెరువు ప్రాంతంలో సమాధి చెందారు. ఆ సమాధి నేడు బారాషహీద్ దర్గాగా మారి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఒకటవ తేదీన మొదలయిన రొట్టెల పండగ ఉత్సవాలు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రాన్ని పాలించిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు కూడా లేనివిధంగా పూర్తి అటవీప్రాంతంగా ఉండేది. సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. ఆర్కాట్ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్ ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆదేశించారు. తనకొచ్చిన స్వప్నం గురించి ఆమె ఆర్కాట్ నవాబుకు చెప్పగా వెంటనే భారీ సైన్యంతో అటవీప్రాంతంలో ఉన్న స్వర్ణాలచెరువు వద్దకు ఆర్కాట్ నవాబు వచ్చి బారాషహీద్ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. ఈ క్రమంలో నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలు తమతో వచ్చిన పరివారానికి పంచిపెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్ నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూమిని దర్గాకు కేటాయించారు. ఇది సుమారు 266 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. 1751 నుంచి రొట్టెల పండగ... ఏటా మొహరం కలసి వచ్చేలా బారాషహీద్ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. దాదాపు 266 ఏళ్ల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. 1751వ సంవత్సరం జూలై 14వ తేది (శుక్రవారం) న బారాషహీద్ మహిమ ప్రకటితమైంది. నానాటికీ భక్తులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పులే బారాషహీద్కు కాపలా.. బారాషహీద్ దర్గా నిర్మితమయ్యాక బారాషహీద్ మహిమలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ ఉదయం పూట భక్తులు దర్గాను దర్శించుకొని వెళ్లేవారు. సాయంత్రం పూట దర్గాకు రక్షణగా పులి దర్గాలో సంచరించి రాత్రి అక్కడే నిద్రించి పొద్దునే వెళ్లేముందు దర్గా ప్రాంగణం మొత్తాన్ని తోకతో శుభ్రం చేసేది. దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు కూడా ఇది కొనసాగింది. పులికోసం దర్గాలో బోను ఉంది. ఐదు వరకు ఉత్సవాలు.. ఒకటవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 5వ తేది వరకు కొనసాగనున్నాయి. కోరిన కోర్కెలతో దర్గాపక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలను భక్తులు ఇచ్చి పుచ్చుకుంటారు. వారి కోర్కెలు తీరాక మరుసటి సంవత్సరం మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇలా రాష్ట్రం నుంచే కాకుండా సౌదీ అరేబియా, దుబాయ్ దేశాల్లో సిర్థపడిన ముస్లింలు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరవుతారు. నిజానికి నేడు తహలీల్ ఫాతియా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ముగించాలి. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉన్నందువల్ల 5వ తేదీన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఉత్సవాల్లో గంధమహోత్సవం, మొక్కుబడి రొట్టెల కార్యక్రమం ముఖ్యమైనవి. ఇలా చేరుకోవాలి నెల్లూరు ఆర్టీసీ బస్టాండు నుంచి కిలోమీటరు, రైల్వేస్టేషన్ నుంచి 2 కి.మీ దూరంలో దర్గా ఉంది. నగరంలో బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులతోపాటు నిరంతరం ఆటోలు ఉంటాయి. నెల్లూరు నుంచి 24 కి.మీ దూరంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ప్రసిద్ధమైన మస్తాన్‌వలీ దర్గా ఉంది. నెల్లూరు నుంచి 59 కి.మీల దూరంలో ఎస్పేటలో ఖాజానాయబ్ రసూల్ దర్గా ఉంది. నెల్లూరు నుంచి సంగం మీదుగా ఏఏస్పేటకు చేరుకోవచ్చు. – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, నెల్లూరు. -
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
-
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
► మొహర్రం రోజునా నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ► ఆంక్షలు విధించడం పట్ల మమతా బెనర్జీపై కోర్టు మండిపాటు ► గొంతు కోసినా కుట్రకు బలికానన్న మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహర్రం పండుగనాడు సహా అన్ని రోజుల్లోనూ అర్ధరాత్రి 12 వరకు నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. నిమజ్జనంపై ఆంక్షలు విధించినందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. పౌరులు తమ మతాచారాలను పాటించకుండా అడ్డుకునే హక్కు ప్రభు త్వానికి లేదని తేల్చిచెప్పింది. మతి లేకుండా హక్కులను హరించకూడదని ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. మొహర్రం ఉరేగింపు, దుర్గా విగ్రహాల నిమజ్జనం ఒకేరోజున జరుగుతాయనీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. మీకు కల వస్తే ఆంక్షలు విధించలేరు మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. విజయదశమి రోజున రాత్రి 10 గంటల వరకే నిమజ్జనానికి అనుమతించడంతోపాటు, మొహర్రం రోజైన అక్టోబరు 1న నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ తివారీ, జస్టిస్ హరీశ్ టాండన్‌ల ధర్మాసనం విచారించింది. ‘అధికారం ఉంది కదా అని మీరు (మమత) సరైన కారణాలు లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణిస్తాయన్న ఊహలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించకూడదు. ఏదో అనర్థం జరగబోతోందని మీరు కలగన్నంత మాత్రాన ఆంక్షలు విధించలేరు’ అంటూ ధర్మాసనం మమతకు మొట్టికాయలు వేసింది. దుర్గామాత విగ్రహాలు, మొహర్రం ఊరేగింపునకు వేర్వేరు మార్గాలను నిర్దేశించాలనీ, ఊరేగింపు వెళ్లే దారుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని కోర్టు ఆదేశించింది. కుట్రదారులదే బాధ్యత: మమత తీర్పు అనంతరం మమత బీజేపీని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడుతూ అక్టోబరు 1న హింస చెలరేగితే కుట్రదారులదే బాధ్యత అని అన్నారు. ‘నా గొంతు కోసినా సరే. కుట్ర కు నేను బలికాను. ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆమె అన్నారు. -
ముగిసిన మొహర్రం సంతాప దినాలు
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో మొహర్రం సంతాప దినాలు సోమవారం ముగిశాయి. గత నెల 12వ తేదీన పీర్ల నిమజ్జనంతో ఇవి ప్రారంభమయ్యాయి. ముగింపు సందర్భంగా కొండపేటలోని తల్లిపీర్ల చావిడి వద్ద నుంచి ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ పీర్లకు షీయా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం చురకత్తులు, బ్లేడ్లతో వీపు, ఎదలపై మాతం చేస్తూ ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అలాగే పట్టణంలోని ఆస్థానం నుంచి బనగానపల్లె నవాబు మీర్ఫజిల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ ఆధ్వర్యంలో దొరకోట వరకు షీయా మతస్తులు మాతం నిర్వహించారు. మాతం చూసేందుకు హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంఐఎం ఆధ్వర్యంలో వారకి మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
పీరీలను నిమజ్జనం చేసిన భక్తులు
ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో గురువారం మోహార్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ధర్మారం, మల్లాపూర్, ఎర్రగుంటపల్లి, మేడారం, దొంగతుర్తి తదితర గ్రామాలలోని హిందూ, ముస్లీంలు ఐక్యంగా వేడుకలను నిర్వహించారు. సాయంత్రం ఆయా గ్రామాలలో దర్గాల ఎదుట పీరీల వద్ద భక్తులు దూలాటలు ఆడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీరీలను ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. -
మొహర్రం ప్రశాంతం..
-
భక్తిశ్రద్ధలతో మొహర్రం
కడప కల్చరల్: శాంతి, ధర్మాల పరిరక్షణయే ధ్యేయంగా పోరాడి అమరులైన (షహీద్) వీరుల స్మృతి చిహ్నంగా మొహర్రం కార్యక్రమాలను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక అమీన్‌పీర్ దర్గాలోని పీర్ల చావడిలో దర్గా పీఠా«ధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆ«ధ్వర్యంలో∙పీర్ల వద్ద మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక భక్తులతోపాటు బయటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరం నాగరాజుపేటలోని బాదుల్లా మకాన్లో మూడు రోజులపాటు పీర్లను ప్రతిష్ఠించి ప్రార్థనలు చేశారు. నగరానికి చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరై పీర్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. స్థానిక విశ్వనాథపురంలోని పీర్ల చావిడిలో విశేష ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పలువురు భక్తులు ధైర్య త్యాగాలకు చిహ్నంగా నిప్పులపై నడిచారు. -
పీర్ల ఊరేగింపులో ఉద్రిక్తత
పుట్లూరు : యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లిలో ఆదివారం రాత్రి పీర్ల ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. యల్లనూరుకి చెందిన పీర్లు పెద్దమల్లేపల్లిలో మోహరం వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆదివారం పీర్లను ఊరేగిస్తుండగా రామకృష్ణ అనే వ్యక్తి తన ఇంటి వద్దకు పీర్లు రావాలని పట్టుబట్టడంతో గ్రామస్తులు గతంలో లేని విధంగా పీర్లను పంపడం కుదరదని వాగ్వాదానికి దిగారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లడం జరగదని గతంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఊరేగింపు జరుగుతుందన్నారు. సమస్య తీవ్రంగా మారుతున్న విషయం తెలుసుకున్న యల్లనూరు ఎస్సై హరినాథ్‌రెడ్డి, తాడిపత్రి రూరల్ ఎస్సై నారాయణరెడ్డి గ్రామస్తులతో చర్చించారు. ఈ ఏడాది మాత్రమే రామకృష్ణ ఇంటి వద్దకు పీర్లను పంపి భవిష్యత్తులో గ్రామ కట్టుబాట్ల ప్రకారం ఊరేగింపు నిర్వహించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. -
ఘనంగా మౌలాలి పంజా ఊరేగింపు
నాయుడుపేటటౌన్ : మొహరం పండగను పురస్కరించుకుని పట్టణంలోని గరిడివీధిలో ఉన్న తాలీమ్‌ఖానా వద్ద నుంచి హజరత్ మౌలాలి పంజా ఊరేగింపును శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గరిడిలోని మౌలాలి తాలీమ్‌ఖానాలో ప్రతిష్టించిన పంజాను గుర్రంపై ఉంచి ఫాతెలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక మంది పంజా వద్దకు వచ్చి అటుకులు, బెల్లం, శనగలు, చక్కెర తదితర వాటితో ఫాతెలు జరిపి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అలాగే అనేకమంది భక్తులు పంజాలను చేతపట్టి భక్తిశ్రద్ధలతో ఇళ్ల వద్ద నుంచి ఊరేగింపుగా వచ్చి తాలీమ్‌ఖానాలో ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మౌలాలీ పంజా ఊరేగింపులో పులి వేషాలు, తపెట్ల తాళ్లలతో కోలహలంగా నిర్వహించారు. మౌలాలి తాలీమ్‌ఖానా సభ్యులతో పాటు గరిడి యువత, గ్రామపెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక మొహర్రం
దుబ్బాక: యుద్ధంలో అమరులైన యుద్ధ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మొహర్రం పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం అనావాయితీగా వస్తోంది. త్యాగాలకు ప్రతీకగా నిలిచిన మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. యుద్ధంలో అమరులైన హసన్, హుస్సేన్‌లను ప్రతి ఏడాది గుర్తు చేసుకుంటూ దుబ్బాక మండలం చీకోడు గ్రామస్తులు మొహర్రం పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. మసీదులో హసన్, హుస్సేన్ ప్రతిమలను ఆదివారం రాత్రి ప్రతిష్టించారు. తొమ్మిదవ రోజున గ్రామ ప్రజలు మటికీలను సమర్పించి, ఈ నెల 12న పీరీలను ఊరేగించి, సాయంత్రం జరిగే జాతరతో ముగిస్తారు. టగ్ ఆఫ్ వార్ పోటీలు మొహర్రంను పురష్కరించుకుని ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఫ్రెండ్లీ టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు స్కై బ్లూ యూత్ ఆసోసియేషన్ అధ్యక్షుడు మేదునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు హన్మంత్ తెలిపారు. ఆసక్తి గల యువకులు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొని కోరారు. -
మొహరం సందర్భంగా జమ్మూకార్శీర్లో ఉద్రిక్తత
-
మొహర్రం సందర్భంగా చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
-
పాక్‌లో ఆత్మాహుతి దాడి
కరాచీ: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామం వద్ద భారీ సంఖ్యలో షియా వర్గానికి చెందిన ముస్లింలు గుమిగూడారు. పవిత్ర మొహర్రం మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే సమయంలో బాంబులు ధరించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అక్కడికి వచ్చి తనను తాను పేల్చుకోవడం తో ఈ దారుణం చోటుచేసుకుంది.