ఘనంగా మౌలాలి పంజా ఊరేగింపు | Moharram procession | Sakshi
Sakshi News home page

ఘనంగా మౌలాలి పంజా ఊరేగింపు

Published Sat, Oct 8 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

ఘనంగా మౌలాలి పంజా ఊరేగింపు

ఘనంగా మౌలాలి పంజా ఊరేగింపు

 
నాయుడుపేటటౌన్‌ : మొహరం పండగను పురస్కరించుకుని పట్టణంలోని గరిడివీధిలో ఉన్న తాలీమ్‌ఖానా వద్ద నుంచి హజరత్‌ మౌలాలి పంజా ఊరేగింపును శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గరిడిలోని మౌలాలి తాలీమ్‌ఖానాలో ప్రతిష్టించిన పంజాను గుర్రంపై ఉంచి ఫాతెలు నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక మంది పంజా వద్దకు వచ్చి అటుకులు, బెల్లం, శనగలు, చక్కెర తదితర వాటితో ఫాతెలు జరిపి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. అలాగే అనేకమంది భక్తులు పంజాలను చేతపట్టి భక్తిశ్రద్ధలతో ఇళ్ల వద్ద నుంచి ఊరేగింపుగా వచ్చి తాలీమ్‌ఖానాలో ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మౌలాలీ పంజా ఊరేగింపులో పులి వేషాలు, తపెట్ల తాళ్లలతో కోలహలంగా నిర్వహించారు. మౌలాలి తాలీమ్‌ఖానా సభ్యులతో పాటు గరిడి యువత, గ్రామపెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement