
సాక్షి, గుంటూరు: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు మొహర్రం సందర్భంగా ముస్లింలకు వైఎస్ జగన్ సందేశం విడుదల చేశారు.
‘ముస్లిం సోదరులు పాటించే మొహర్రం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీక. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల కూడా మొహర్రమే. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయి’ అని వైఎస్ జగన్ తెలిపారు.