ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు | TS High Court Denies Permission For Muharram Procession Amid Covid 19 | Sakshi
Sakshi News home page

మొహర్రం ఊరేగింపునకు అనుమతి నిరాకరణ

Published Wed, Aug 26 2020 4:24 PM | Last Updated on Wed, Aug 26 2020 4:24 PM

TS High Court Denies Permission For Muharram Procession Amid Covid 19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైద‌రాబాద్‌లో మొహ‌ర్రం ఊరేగింపున‌కు అనుమ‌తించేలా ఆదేశాలు జారీచేయ‌లేమ‌ని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం ఓ వ్యాజ్యాన్ని విచారిస్తూ అనుమతి నిరాక‌రించిందని పేర్కొన్న న్యాయస్థానం.. తాము కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. కాగా మొహర్రం అంబారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫాతిమా సేవాదళ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.(చదవండి: వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోంది: హైకోర్టు

ఈ సందర్భంగా... ఈ నెల 30న పాత‌బ‌స్తీ డ‌బీర్‌పురా బీబీకా అలావా నుంచి చాద‌ర్ ఘాట్ వ‌ర‌కు మొహ‌ర్రం ఊరేగింపున‌కు అనుమ‌తి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ క్రమంలో హైకోర్టు ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. పిటిష‌నర్ తరఫున కౌన్సిల్ పాండురంగారావు వాదనలు వినిపించారు. ఊరేగింపున‌కై పిటిషనర్‌.. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏనుగుల‌ను సొంత ఖ‌ర్చుల‌తో తెప్పించుకుంటారని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలమేమని తేల్చి చెప్పింది.(చదవండి: శిఖం భూములనెలా కేటాయించారు? )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement