హైదరాబాద్: సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజెస్ అధ్యక్షుడు తుషార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్ పేర్కొన్నారు.
కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్న తుషార్.. ఈనెల 21న విచారణకు రావాలని 16వ తేదీన తనకు 41ఏ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో తెలిపారు. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు గడువు కోరినట్లు పేర్కొన్న తుషార్.. తన మెయిల్‌కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురద్దేశం కనబడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment