Tushar
-
'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
2003లో సంచలనం సృష్టించిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఆధారంగా తుషార్ హీరానందని తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ'. హిట్ సిరీస్ ‘స్కామ్ 1992’ని తెరకెక్కించిన హన్సల్ మెహతా నిర్మించారు. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. గతనెలలో ఓటీటీలో రిలీజైన పార్ట్-1 హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు) ఈ నేపథ్యంలో పార్ట్-2 ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్-2 రిలీజ్‌పై సోనీలివ్ ట్వీట్ చేసింది. స్కామ్ 2003 పార్ట్-2 నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపింది. తొలిభాగంలో ఈ సిరీస్‌ను ఐదు ఎపిసోడ్స్‌లో చూపించారు. రెండో భాగంలో కూడా దాదాపు ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. Sabki zubaan pe tha Telgi ka naam, par Telgi ki zubaan pe kiska? Find out on 3rd November! Scam 2003-The Telgi Story, all episodes, streaming on 3rd November, only on Sony LIV #Scam2003OnSonyLIV #Scam2003 Thanking @BajpayeeManoj for lending his incredible voice ✨ pic.twitter.com/wLz04HZLcW — Sony LIV (@SonyLIV) October 18, 2023 -
GT Vs CSK: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు!
Gujarat Titans vs Chennai Super Kings: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. జిడ్డు బ్యాటింగ్‌తో సీఎస్కే ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌లో అతడిని తప్పించాలంటూ సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023 మెగా ఈవెంట్‌కు శుక్రవారం తెరలేచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ధోని సేనకు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(92) శుభారంభం అందించాడు. కానీ మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ముఖ్యంగా అంబటి రాయుడు, శివం దూబే బంతులు వృథా చేశారు. రాయుడు 12 బంతుల్లో 12 పరుగులు సాధించగా.. దూబే 18 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో 178 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయవంతం కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా శివం దూబేపై విమర్శల వర్షం కురుస్తోంది. నీ స్వార్థం కారణంగా చెన్నై ఓడిపోయింది. ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు ‘‘శివం దూబే వల్లే జోష్ మీదున్న గైక్వాడ్ మొమెంటమ్ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నాడు. ధోని అభిమానులకు ఒక్క సిక్సర్ కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. ఐపీఎల్-2023లో సీఎస్కేకు ఆరంభ మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఇన్నిఅనర్థాలకు దూబేనే కారణం’’ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కాగా శివం దూబే తమకు ఆప్షన్ మాత్రనేనని, ఏదేమైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిందంటూ ధోని తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అంబటి రాయుడు స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండే నోబాల్స్‌తో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిపై కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. కొత్త రూల్ వల్ల ఈ మహానుభావుడిని ఆడించి సీఎస్కే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్.. తొలి భారత క్రికెటర్‌గా! WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్’ రేసులో.. We Had Lost This Match Because Dube And Rayudu .Especially Shivam Dube .Because He Had Wasted The Lots Of Balls And Overs. So Especially Kindly Drop These 2 Players In Upcoming Every Matches — Sam (@samkutty865) April 1, 2023 Because of Shivam Dube: -Gaikwad lost his momentum to score hundred. -Jaddu lost his wicket. -Dhoni fans not able to see more than 1 six. -CSK lost their momentum and gave below par target(yes its below par for this pitch). -CSK lost their opening match against GT.#CSKvsGT pic.twitter.com/VEMHDeFLpF — 𝐑𝐮𝐠𝐠𝐚™ (@LoyalYashFan) March 31, 2023 Shivam Dube just retire hurt man. What a selfish cricketer. Thank God, we have sleeper cell in Vijay Shankar ik opposite team. Or else we'd be screwed — VRS (@azizdopleganger) March 31, 2023 -
చెన్నై పేసర్ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! దారుణ వైఫల్యం..
Gujarat Titans vs Chennai Super Kings, 1st Match: ఐపీఎల్ చరిత్రలో మొదటి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ ఈ మేరకు ఘనత వహించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్- చెన్నై మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందుగానే చెన్నై తుషార్ దేశ్‌పాండేను సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది. దీంతో ఐపీఎల్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ పేరు నమోదైంది.ఇక చెన్నై జట్టు బ్యాటింగ్ ముగించుకున్న తర్వాత బ్యాటర్ అంబటి రాయుడును ఫీల్డింగ్ సమయంలో తప్పించింది సీఎస్కే. అతడి స్థానంలో ఫాస్ట్ బౌలర్ తుషార్‌ను బరిలోకి దించింది. దారుణ వైఫల్యం అయితే, ఈ మ్యాచ్‌లో తుషార్ .. 3.2 ఓవర్లు బౌలింగ్ చేసి.. 51 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. భారీగా పరుగులు సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. మరోవైపు.. గుజరాత్ జట్టు కూడా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా టీమ్‌లోకి తీసుకుంది. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. రషీద్ మెరుపు ఇన్నింగ్స్ ధోని సారథ్యంలోని చెన్నైపై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన హార్దిక్ సేన ఐపీఎల్-2023లో తొలి విజయం నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 3 బంతుల్లో 10 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడీ ఆఫ్గన్ స్టార్. ఐపీఎల్లో ఇంపాక్ల్ ప్లేయర్ నిబంధన తొలిసారి ►ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే, ఓవర్ ముగిసిన తర్వాత.. వికెట్ పడినపుడు, ఒకవేళ బ్యాటర్ రిటైర్ అయితే సబ్‌స్టిట్యూట్‌ను వాడుకోవచ్చు. ఇంపార్ట్ ప్లేయర్ నిబంధన వాడుకునే క్రమంలో.. మ్యాచ్‌కు ముందు తుది జట్టుతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ల పేర్లు వెల్లడించాలి. వారిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు. ►ఒకవేళ 11 మంది సభ్యుల జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉన్న తరుణంలో స్వదేశీ క్రికెటర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసుకోవాలి. ►మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టుకు అవసరమైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ సేవలు వినియోగించుకోవచ్చు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటర్‌కు బదులు.. బౌలర్లను బరిలోకి దింపవచ్చు. ►ఛేజింగ్‌లో అదనపు బ్యాటర్ కావాలని భావిస్తే.. ఒక బౌలర్‌ను తప్పించి అతడి స్థానంలో బ్యాటర్‌ను ఆడించవచ్చు. అయితే, ఒక్కసారి ఇంపాక్ట్ ఆటగాడి కోసం మైదానం ►వీడితే ఏ బ్యాటర్ లేదంటే బౌలర్ మళ్లీ గ్రౌండ్(సదరు మ్యాచ్)లో అడుగుపెట్టే అవకాశం ఉండదు. ►ఒకవేళ.. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో వచ్చే ఇంపాక్ట్ ప్లేయర్ బౌలర్ అయినట్లయితే.. అతడు తన నాలుగు ఓవర్ల కోటా పూర్తిచేయవచ్చు. ►సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించే ఇంపాక్ట్ ప్లేయర్ సారథిగా మాత్రం వ్యవహరించే వీలు ఉండదు. మొత్తంగా.. 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. -
ఎమ్మెల్యేల కేసులో సిట్‌కు ఎదురుదెబ్బ.. తుషార్‌కు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట లభించగా.. తాజాగా తుషార్‌కు సైతం ఉపశమనం కలిగింది. తుషార్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సిట్ విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, విచారణ సందర్భంగా సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్ పేరు చేర్చారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 41ఏ సీఆర్పీసీపై రిప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కోర్టు.. తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ కేసులో తుషార్‌కు ఊరట లభించింది. మరోవైపు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తు జరపాలన్న బీజేపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్, సిట్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. -
ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్
హైదరాబాద్: సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజెస్ అధ్యక్షుడు తుషార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్ పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్లో పేర్కొన్న తుషార్.. ఈనెల 21న విచారణకు రావాలని 16వ తేదీన తనకు 41ఏ నోటీసులు ఇచ్చారని పిటిషన్లో తెలిపారు. అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు గడువు కోరినట్లు పేర్కొన్న తుషార్.. తన మెయిల్‌కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురద్దేశం కనబడుతుందన్నారు. -
ఎమ్మెల్యేల కేసులో తుషార్‌ను టార్గెట్ చేసిన సిట్.. ఆయన ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నందుపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేయగా.. ఈ వ్యవహారంతో లింకులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఫౌంహాస్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలని తుషార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రామచంద్రభారతి, రోహిత్‌రెడ్డితో తుషార్ ఫోన్లో మాట్లాడారు. తుషార్‌కు బీజేపీ కీలక నేతలు సన్నిహితులు అంటూ ఫోన్ సంభాషణ కొనసాగింది. ఇక, గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడులో రాహుల్‌పై తుషార్ పోటీ చేశారు. మరోవైపు.. రెమా రాజేశ్వరి నేతృత్వంలో సిట్ బృందం కేరళలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గుస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, తుషార్‌ను రామచంద్రభారతికి పరిచయం చేసింది జగ్గుస్వామినే కావడం విశేషం. -
దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
-
IPL 2022: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చహర్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీకి భారీ షాక్ తగిలినట్లయింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్ సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న కథనాల నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఉసూరుమంటున్నారు. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల స్టార్ దూరం అయితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. మరి చహర్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దామా! తుషార్ దేశ్‌పాండే ఐపీఎల్- 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టాడు ఈ ముంబై పేసర్. గత సీజన్లో సీఎస్కేకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు. దేశవాళీ టోర్నీల్లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన తుషార్.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా 26 ఏళ్ల తుషార్ నిలిచాడు. రాజ్వర్ధన్ హంగర్కర్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాజ్వర్ధన్ హంగర్కర్. మెగా వేలంలో భాగంగా చెన్నై 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఈ యువ ఫాస్ట్ బౌలర్ గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు దీపక్ చహర్లాగే జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ ఝులిపించగలడు కూడా! వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వరుస సిక్సర్లు బాది సత్తా చాటాడు. కేఎమ్ ఆసిఫ్ 2018 నుంచి సీఎస్కే జట్టులో ఉన్నాడు ఆసిఫ్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. కేరళకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తొలుత దుబాయ్‌లో జీవించేవాడు. ఓ షాప్‌లో స్టోర్‌కీపర్‌గా పనిచేశాడు. యూఏఈ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. 2018లో సీఎస్కే కొనుగోలు చేయడంతో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఢిల్లీతో మ్యాచ్‌కు దీపక్ చహర్ గాయం కారణంగా దూరం కావడంతో ఆసిఫ్ అతడి స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ -
బోణీ అదిరింది
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలిరోజే భారత్ రెండు రజతాలతో ఖాతా తెరిచింది. షూటర్ తుషార్ మానే... జూడో ప్లేయర్ తబాబి దేవి తంగ్జామ్ రజత పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తుషార్ 247.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో సెర్బియా షూటర్లు గ్రిగొరి షమకోవ్ (249.2) స్వర్ణం, అలెక్సా మిత్రోవిక్ (సెర్బియా) కాంస్యం గెలుచుకున్నారు. చివరి షాట్ దాకా భారత ఆటగాడు స్వర్ణం రేసులో నిలిచాడు. అప్పటి వరకు షమకోవ్కు దీటుగా గురి కుదరగా... చివరి షాట్ తుషార్‌ను రజతానికి పడేసింది. ఇందులో అతనికి 9.6 పాయింట్లు రాగా, షమకోవ్ 9.9 పాయింట్లతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. మహిళల జూడో 44 కేజీల ఫైనల్లో తబాబి దేవి తంగ్జామ్ 1–11తో మరియా జిమినెజ్ (వెనిజులా) చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల హాకీలో భారత్ 10–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. రవిచంద్ర, సాగర్, సుదీప్ రెండేసి గోల్స్, శివమ్, రాహుల్, సంజయ్, మణిందర్ తలా ఒక గోల్ చేశారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లీగ్ మ్యాచ్‌లో జక్కా వైష్ణవి రెడ్డి 21–13, 21–6తో ఎలీనా అండ్రూ (స్పెయిన్)పై గెలిచింది. -
భారత మహిళల క్రికెట్ కోచ్ తుషార్ రాజీనామా
న్యూఢిల్లీ: అప్పుడు పురుషుల జట్టు కోచ్ అనిల్ కుంబ్లే... ఇప్పుడేమో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరోతె... జట్టు సభ్యులను నొప్పించలేక తప్పుకున్నారు. మంగళవారం తుషార్ తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్ మహిళా క్రికెటర్లతో విబేధాలే ఆయన దిగిపోవడానికి కారణమని తెలిసింది. తుషార్ శిక్షణపై స్టార్ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, కోచ్‌ను తప్పించాల్సిందేనని పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుషార్‌తో రాజీనామా చేయించింది. ‘వ్యక్తిగత కారణాలతో కోచ్ పదవి నుంచి తుషార్ తప్పుకున్నారు. ఈ అవకాశమిచ్చిన బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. తుషార్ కోచింగ్‌లోనే గతేడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వన్డే, టి20 సిరీస్‌లను గెలిచింది. అయితే ఆసియా కప్ టి20 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన తర్వాత క్రికెటర్లకు కోచ్‌కు మధ్య విబేధాలు పొడసూపాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో కోచ్‌ను రాజీనామాతో తప్పించారు. -
విద్యార్థి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం
బెంగళూరు: నగదు, నగల కోసం ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన నలుగురికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ శుక్రవారం చెప్పారు. పాట్నాకు చెందిన వారిక్, జార్ఖండ్‌కు చెందిన రోహిత్, బార్గర్ల్స్గా పని చేస్తున్న శివాని, ప్రీతి అనే నలుగురికి ఈ శిక్షతో పాటు ఒక్కొక్కరిని రూ. ఐదు వేలు జరిమాన విధించిందన్నారు. అదే విధంగా హత్యకు గురై ఇంజనీరింగ్ విద్యార్థి తుషార్ (21) కుటుంబ సభ్యులకు రూ. 45 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. బీహార్‌కు చెందిన తుషార్ బెంగళూరు చేరుకుని ఇక్కడి ఎస్కేఐటీ కాలేజ్‌లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసేవాడు. వారిక్ ప్రయివేటు కంపెనీ ఉద్యోగి. 2011 జనవరిలో ఈ నలుగురు తుషార్‌ను కిడ్నాప్ చేశారు. తరువాత యలహంక సమీపంలోని అట్టూరు లేఔట్‌లోని వారిక్ ఇంటిలో నిర్బందించారు. చివరికి ఓడ్కా బాటిల్‌తో తుషార్ తల పగలగొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లి విరసాగర రోడ్డులోని కెంపనహళ్ళి దగ్గర ఉన్న నీలగిరి తోటలో విసిరి వేసి అక్కడి నుంచి పరారైనారు. అప్పటి అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.ఎస్. అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం నిందితులు నేరం చేసినట్లు రుజువు కావడంతో శిక్ష, జరిమాన విధించిందని అలోక్‌కుమార్ తెలిపారు.