'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! | Tushar Hiranandani Web Series Scam-2003 Will Be Streaming From November 3rd On SonyLIV - Sakshi
Sakshi News home page

Scam-2003 Vol 2 OTT Release: 'స్కామ్-2003' పార్ట్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Thu, Oct 19 2023 11:08 AM | Last Updated on Thu, Oct 19 2023 1:20 PM

Tushar Hiranandani Web Series Scam-2003 Will Be Streaming From November 3rd - Sakshi

2003లో సంచలనం సృష్టించిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా  తుషార్‌ హీరానందని తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ'. హిట్‌ సిరీస్‌ ‘స్కామ్‌ 1992’ని తెరకెక్కించిన హన్సల్‌ మెహతా నిర్మించారు. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. గతనెలలో ఓటీటీలో రిలీజైన పార్ట్-1 హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు)

ఈ నేపథ్యంలో పార్ట్-2 ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్-2 రిలీజ్‌పై సోనీలివ్‌ ట్వీట్‌ చేసింది. స్కామ్‌ 2003 పార్ట్‌-2 నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది. తొలిభాగంలో ఈ సిరీస్‌ను ఐదు ఎపిసోడ్స్‌లో చూపించారు. రెండో భాగంలో కూడా దాదాపు ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement