IPL 2023 GT Vs CSK: Shivam Dube Receives Hate Fans, Slams Tushar - Sakshi
Sakshi News home page

IPL 2023: ప్లీజ్‌.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’..

Published Sat, Apr 1 2023 1:42 PM | Last Updated on Sat, Apr 1 2023 2:27 PM

IPL 2023 GT Vs CSK: Shivam Dube Receives Hate Fans Slams Tushar - Sakshi

గుజరాత్‌ చేతిలో చెన్నై ఓటమి (Photo Credit: IPL/BCCI)

Gujarat Titans vs Chennai Super Kings: టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబేపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు మండిపడుతున్నారు. జిడ్డు బ్యాటింగ్‌తో సీఎస్‌కే ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌లో అతడిని తప్పించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2023 మెగా ఈవెంట్‌కు శుక్రవారం తెరలేచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ధోని సేనకు ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(92) శుభారంభం అందించాడు.

కానీ మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ముఖ్యంగా అంబటి రాయుడు, శివం దూబే బంతులు వృథా చేశారు. రాయుడు 12 బంతుల్లో 12 పరుగులు సాధించగా.. దూబే 18 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. 

ఈ క్రమంలో 20 ఓవర్లలో 178 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో గుజరాత్‌ విజయవంతం కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా శివం దూబేపై విమర్శల వర్షం కురుస్తోంది. నీ స్వార్థం కారణంగా చెన్నై ఓడిపోయింది.

ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు
‘‘శివం దూబే వల్లే జోష్‌ మీదున్న గైక్వాడ్‌ మొమెంటమ్‌ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నాడు. ధోని అభిమానులకు ఒక్క సిక్సర్‌ కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. ఐపీఎల్‌-2023లో సీఎస్‌కేకు ఆరంభ మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఇన్నిఅనర్థాలకు దూబేనే కారణం’’ అని ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా శివం దూబే తమకు ఆప్షన్‌ మాత్రనేనని, ఏదేమైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిందంటూ ధోని తమ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యం కారణమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అంబటి రాయుడు స్థానంలో వచ్చిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ తుషార్‌ దేశ్‌పాండే నోబాల్స్‌తో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిపై కూడా ఫ్యాన్స్‌ మండిపడుతున్నాడు. కొత్త రూల్‌ వల్ల ఈ మహానుభావుడిని ఆడించి సీఎస్‌కే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.  

చదవండి: IPL 2023: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్‌.. తొలి భారత క్రికెటర్‌గా!
WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్‌ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్‌’ రేసులో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement