PC: IPL Twitter
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా అద్భుతాలు చేస్తున్న ఆటగాళ్ల జాబితాలో సీఎస్‌కే మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే ముందువరుసలో ఉన్నాడు. ఈ ఎడమ చేతి వాటం విధ్వంసకర వీరుడు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 38.50 సగటున 160.42 స్ట్రయిక్ రేట్‌తో 3 అర్ధసెంచరీల సాయంతో 385 పరుగులు చేశాడు. కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లో 12 ఫోర్లు, 33 సిక్సర్లు బాదిన దూబేతో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా నేటి క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌కు తిప్పలు తప్పవు.
గతంలో ఎన్నడూ లేనంత భయంకరంగా ఆడుతున్న దూబే విషయంలో హార్ధిక్ సేన ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా మూల్యం చెల్లించుకోక తప్పదు. బ్యాట్‌తో పాటు బంతితోనూ చెలరేగే సత్తా ఉన్న దూబే.. నేటి (మే 23) మ్యాచ్‌లో గుజరాత్ పాలిట ప్రమాదకారిగా దాపురించవచ్చు. నేటి మ్యాచ్‌లో దూబే మరో 3 సిక్సర్లు బాదితే, ఓ సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
Cameo of Shivam Dube.pic.twitter.com/uGQGckQacn
— CricketGully (@thecricketgully) May 20, 2023
సీఎస్‌కే తరఫున ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు షేన్ వాట్సన్ పేరిట ఉంది. వాట్సన్ 2018 సీజన్‌లో అత్యధికంగా 35 సిక్సర్లు బాదాడు. వాట్సన్ తర్వాత అంబటి రాయుడు (2018లో 34 సిక్సర్లు), డ్వేన్ స్మిత్ (2014లో 34), శివమ్ దూబే (2023లో 33), ధోని (2018లో 30) ఓ సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ జరుగబోయే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7: 30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా తదుపరి వెళ్లేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. లక్నో-ముంబై జట్ల మధ్య రేపు (మే 24) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఇవాళ ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో (మే 26) తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో విజేత.. ఇవాళ జరిగే మ్యాచ్‌లో విజేతతో ఫైనల్స్‌లో (మే 28) తలపడుతుంది.
చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్ లేకుండానే..!
Comments
Please login to add a commentAdd a comment