త్యాగానికి ప్రతీక మొహర్రం | Moharram is symbolizing of sacrifice | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక మొహర్రం

Published Tue, Oct 4 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

చీకోడులో నిలబెట్టిన పీరీలు

చీకోడులో నిలబెట్టిన పీరీలు

దుబ్బాక: యుద్ధంలో అమరులైన యుద్ధ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మొహర్రం పండుగను  కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం అనావాయితీగా వస్తోంది. త్యాగాలకు ప్రతీకగా నిలిచిన మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. యుద్ధంలో అమరులైన హసన్, హుస్సేన్‌లను ప్రతి ఏడాది గుర్తు చేసుకుంటూ దుబ్బాక మండలం చీకోడు గ్రామస్తులు మొహర్రం పండుగను  కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. మసీదులో హసన్, హుస్సేన్‌ ప్రతిమలను ఆదివారం రాత్రి ప్రతిష్టించారు. తొమ్మిదవ రోజున గ్రామ ప్రజలు మటికీలను సమర్పించి,  ఈ నెల 12న పీరీలను ఊరేగించి, సాయంత్రం జరిగే జాతరతో ముగిస్తారు.

టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు
మొహర్రంను పురష్కరించుకుని ఈ నెల 6, 7, 8 తేదీల్లో  ఫ్రెండ్లీ టగ్‌ ఆఫ్‌ వార్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు స్కై బ్లూ యూత్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు మేదునూరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు హన్మంత్‌ తెలిపారు. ఆసక్తి గల యువకులు టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో పాల్గొని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement