వెన్నుపోట్లు.. కత్తిపోట్లు! ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆసక్తికర రాజకీయం.. | Interesting Politics In Joint Medak District | Sakshi
Sakshi News home page

వెన్నుపోట్లు.. కత్తిపోట్లు! ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆసక్తికర రాజకీయం..

Published Thu, Dec 28 2023 1:43 PM | Last Updated on Thu, Dec 28 2023 3:18 PM

Interesting Politics In Joint Medak District - Sakshi

సంగారెడ్డి: 'ఈ ఏడాది ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలోనూ తన బలాన్ని పెంచుకుంది. ఈసారి రెండు మంత్రి పదవులు కూడా దక్కడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా తన పట్టును నిలుపుకుంది. బీజేపీ ఈసారి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కోల్పోయింది.  పలు పార్టీ నేతలు ఒక పార్టీ నుంచి మరోపారీ్టకి మారడంపోటీలో నిల్చున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చూశాం. ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తిదాడి రాష్ట్రంలో సంచలంగా మారింది.' – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్‌రేసులోకి వచి్చంది. 11 అసెంబ్లీ స్థానాలకు నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అందోల్, నారాయణఖేడ్, మెదక్, హుస్నాబాద్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతకు ముందు కేవలం ఒక్క సంగారెడ్డిలోనే కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం వహించింది. బీఆర్‌ఎస్‌ కూడా ఏడు చోట్ల విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 

‘స్థానిక'ంలో అవిశ్వాసాల జోరు..
స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల రగడ ఈ ఏడాదే షురువైంది. మున్సిపాలిటీలు, సహకార సంఘాల చైర్మన్‌ పదవులపై సభ్యులు అవిశ్వాస తీర్మాణాల నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి, అందోల్, సదాశివపేట్, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌లపై అవిశ్వాసం పెడుతూ కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయా చైర్మన్లు రాష్ట్ర అత్యున్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించడంతో అవిశ్వాసాల రగడం కొన్ని నెలలు సద్దుమనిగింది. ఎన్నికల అయిన వెంటనే మళ్లీ బల్దియాల్లో అవిశ్వాసాల లొల్లి షురువైంది. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అవిశ్వాసాల తీర్మాణాలు నెగ్గుతాయా? లేదా? అనే దానిపై కొత్త సంవత్సం 2024లో తేలనుంది.

పార్టీలు మారిన నేతలు..
ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీల్లో కొనసాగిన నేతలు ఈ ఏడాది జరిగిన ఎన్నికల వేళ పార్టీలు మారారు. రాత్రికి రాత్రే కండువాలు మర్చారు. ప్రధానంగా కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ మంది నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలు మారిన ముఖ్యనేతల్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గాలి అనిల్‌కుమార్, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జహీరాబాద్‌కు చెందిన నరోత్తం, టీపీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ వంటి నాయకులంతా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ను వీడారు. 

రెండు మంత్రి పదవులు.. 
కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందోల్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిలారపు దామోదర రాజనర్సింహకు అమాత్య పదవి వరించింది. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన హరీశ్‌రావు మంత్రిగా కొనసాగిన విషయం విధితమే. అయితే మాజీ మంత్రి హరీశ్‌ రావు పోర్టు పోలియో వైద్యారోగ్యశాఖ ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహకు దక్కడం గమనార్హం.

ఉమ్మడి జిల్లా నుంచి సీఎం పదవి చేజారిపోయింది. గజ్వేల్‌ నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయి. రెండు చోట్ల పోటీ చేయగా గజ్వేల్‌లో గెలిచారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్‌కు క్యాబినేట్‌లో చోటు దక్కింది. గతంలో సీఎం కేసీఆర్‌ మంత్రిగా పనిచేసిన రవాణాశాఖ ఈసారి పొన్నంకు దక్కడం గమనార్హం.

ఉన్న ఒక్క స్థానాన్ని కోల్పోయిన బీజేపీ
గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్‌రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పారీ్టకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కోల్పోవాల్సి వచ్చింది. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు బీజేపీ అభ్యరి్థగా గెలుపొందిన విషయం విదితమే. మరోవైపు ఉమ్మ డి జిల్లాలో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరికి కనీసం డిపాజిట్లు రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల్లో కనీసం పట్టులేని అభ్యర్థులను బరిలోకి దించడంతో కనీసం వార్డు కౌన్సిలర్‌కు వచ్చే ఓట్లన్ని కూడా ఆయా నియోజకవర్గాల్లో సాధించలేకపోయింది. 

కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం..
అక్టోబర్‌ 30న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అప్పటి మెదక్‌ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నియోజకవర్గంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి నమస్తే సార్‌ అంటు మిరుదొడ్డి మండలం చేప్యాలకు చెందిన గటాని రాజు వచ్చి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు.

వెంటనే అక్కడున్న పోలీసులు, ప్రజలు రాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక అంబులెన్స్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో దుబ్బాకకు వచ్చి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా 53 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఇవి చదవండి: వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement