shia
-
పాక్‌లో షియా, సున్నీ పోరు.. 25 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో గల కుర్రం జిల్లాలో గత వారం చివర్లో ప్రారంభమైన ఈ ఘర్షణలు కొంతమేరకు తగ్గాయి. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన 25 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.కుర్రం ప్రాంతం ఇటీవలి కాలంలో మత హింసకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ తలెత్తిన భూవివాదం హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడి గిరిజన పెద్దల సహాయంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి బారిస్టర్ సైఫ్ అలీ తెలిపారు. కుర్రంలో శాంతి చర్చల అనంతరం ఇకపై ఎలాంటి హింసాకాండకు పాల్పడకుండా ఉండేందుకు ఇరువర్గాలు అంగీకరించాయన్నారు.సున్నీ ఆధిపత్య పాకిస్తాన్ జనాభాలో 15 శాతం మంది షియా ముస్లింలున్నారు. చాలా కాలంగా ఈ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. షియా వర్గం ఆధిపత్యం ఉన్న కుర్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇరు వర్గాల మధ్య మధ్య ఉద్రిక్తతలున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన భూ వివాద ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతిచెందారు.కాగా కుర్రం జిల్లాలో హింసను ముగించేందుకు శాంతి ఒప్పందంపై ఇరు వర్గాల పెద్దలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఏ వర్గమైనా ఉల్లంఘించిన పక్షంలో వారు రూ.12 కోట్ల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు -
ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
జెరూసలేం/టెల్ అవీవ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరుతోంది. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్బొల్లా’ ఇజ్రాయెల్‌పై తాజాగా రాకెట్లు ప్రయోగించింది. మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడినట్లు సమాచారం. తమపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే హెజ్బొల్లా ఈ చర్యకు దిగింది. మరోవైపు ఇరాన్ కూడా సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని ఆ దేశంతో పాటు అమెరికా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగుతోంది. ఇరాన్ వెనక్కి తగ్గుతుందని న్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వెలిబుచ్చారు. హెజ్బొల్లా ముఖ్య నేత అలీ హతం దక్షిణ లెబనాన్‌లోని బజౌరీ పట్టణంపై ఇజ్రాయెల్ తాజాగా డ్రోన్ దాడిలో హెజ్బొల్లా ముఖ్యనేత అలీ అబిద్ అలీ మరణించాడు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. గాజాలో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది మరణించారు. టెల్ అవీవ్‌లో పాలస్తీనా పౌరుని దాడిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.కంటైనర్ నౌకపై హౌతీల దాడి హౌతీ తిరుగుబాటుదారులు శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో సౌదీ అరేబియాకు వెళ్తున్న నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. దానికి నష్టం వాటిల్లేదని తెలిసింది. -
వాళ్లని వదలం.. ఎక్కడున్న వెతికి మరీ చంపుతాం: ఐసిస్ హెచ్చరిక
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ షియా ముస్లింలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో షియా ముస్లింలకు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్-కే) సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న పత్రిక అల్-నబ ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ‘షియా ముస్లింలు ప్రమాదకరమైన వారని, వాళ్లు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. బాగ్దాద్ నుంచి ఖోరాసన్ వరకు, షియా ముస్లింలు ఉంటున్న ప్రతిచోటా దాడులు జరుగుతాయని ఆ ప్రకటనలో తెలిపింది. ఖమా ప్రెస్ ప్రకారం, ఐసిస్ చర్యలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతికి అతి పెద్ద ముప్పుగా మారాయి. ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లోని షియా మసీదును శుక్రవారం పేల్చివేసిన తర్వాత ఈ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఈ దాడిలో 80 మందికి పైగా గాయపడగా, 60 మంది మరణించారు. ఈ దాడి తామే చేసినట్లు ఐఎస్-కే ప్రకటించింది. అక్టోబర్ 8 న, ఆఫ్ఘనిస్తాన్ లోని కుండుజ్ లోని షియా మసీదుపై జరిగిన మరో ఉగ్రవాద దాడిలో 100 మందికి పైగా మరణించగా, అనేక మంది గాయపడ్డారు. చదవండి: లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం
యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా మీడియాకు తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. మౌలానా జొహర్ అలీ ఎడ్యుకేషన్ పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన అజాం ఖాన్.. వక్ఫ్ ఆస్తుల్ని దానికి మళ్లించారని రజా ఆరోపించారు. ఈ రెండు సంస్థల్లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లేఖ రాసినట్టు వెల్లడించారు. వక్ఫ్ బోర్డులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని మంత్రిని ప్రశ్నించగా... 1995 వక్ఫ్ బోర్డు చట్టం ఈ హక్కు కల్పిస్తోందని సమాధానమిచ్చారు. చట్టబద్ధంగానే తాము వ్యవహరించామని చెప్పారు. వక్ఫ్ బోర్డుల రద్దు ప్రక్రియ పూర్తైన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డులకు కొత్త పాలక మండలిని లేదా అధికారిని నియమిస్తామని తెలిపారు. -
పాక్‌లో ఆత్మాహుతి దాడి
కరాచీ: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పన్నెండు మంది గాయాలపాలయ్యారు. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామం వద్ద భారీ సంఖ్యలో షియా వర్గానికి చెందిన ముస్లింలు గుమిగూడారు. పవిత్ర మొహర్రం మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే సమయంలో బాంబులు ధరించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అక్కడికి వచ్చి తనను తాను పేల్చుకోవడం తో ఈ దారుణం చోటుచేసుకుంది.