కాబూల్: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ షియా ముస్లింలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో షియా ముస్లింలకు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్-కే) సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న పత్రిక అల్-నబ ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ‘షియా ముస్లింలు ప్రమాదకరమైన వారని, వాళ్లు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది.
బాగ్దాద్ నుంచి ఖోరాసన్ వరకు, షియా ముస్లింలు ఉంటున్న ప్రతిచోటా దాడులు జరుగుతాయని ఆ ప్రకటనలో తెలిపింది. ఖమా ప్రెస్ ప్రకారం, ఐసిస్ చర్యలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతికి అతి పెద్ద ముప్పుగా మారాయి. ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లోని షియా మసీదును శుక్రవారం పేల్చివేసిన తర్వాత ఈ హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఈ దాడిలో 80 మందికి పైగా గాయపడగా, 60 మంది మరణించారు.
ఈ దాడి తామే చేసినట్లు ఐఎస్-కే ప్రకటించింది. అక్టోబర్ 8 న, ఆఫ్ఘనిస్తాన్ లోని కుండుజ్ లోని షియా మసీదుపై జరిగిన మరో ఉగ్రవాద దాడిలో 100 మందికి పైగా మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
చదవండి: లాక్‌డౌన్‌లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది
Comments
Please login to add a commentAdd a comment