హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు
ఇజ్రాయెల్‌పై నేడు ఇరాన్ దాడి!
అమెరికా అధికారుల అంచనా
జెరూసలేం/టెల్ అవీవ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరుతోంది. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్‌బొల్లా’ ఇజ్రాయెల్‌పై తాజాగా రాకెట్లు ప్రయోగించింది. మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడినట్లు సమాచారం.
తమపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే హెజ్‌బొల్లా ఈ చర్యకు దిగింది. మరోవైపు ఇరాన్ కూడా సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని ఆ దేశంతో పాటు అమెరికా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగుతోంది. ఇరాన్ వెనక్కి తగ్గుతుందని న్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వెలిబుచ్చారు.
హెజ్‌బొల్లా ముఖ్య నేత అలీ హతం
దక్షిణ లెబనాన్‌లోని బజౌరీ పట్టణంపై ఇజ్రాయెల్ తాజాగా డ్రోన్ దాడిలో హెజ్‌బొల్లా ముఖ్యనేత అలీ అబిద్ అలీ మరణించాడు. హెజ్‌బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. గాజాలో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది మరణించారు. టెల్ అవీవ్‌లో పాలస్తీనా పౌరుని దాడిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.
కంటైనర్ నౌకపై హౌతీల దాడి
హౌతీ తిరుగుబాటుదారులు శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో సౌదీ అరేబియాకు వెళ్తున్న నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. దానికి నష్టం వాటిల్లేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment