సాక్షి, తాడిపత్రి అర్బన్: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని పాతకోటలో నివాసముంటున్న షేక్ గౌస్, ఖతీజా (38) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్తకు తెలియకుండా ఖతీజా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసింది. దీంతో పాటు సొంత పూచీకత్తుపై తన ఇంటి సమీపంలోని కొందరికి అప్పులు ఇప్పించింది.
ఈ క్రమంలో అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తడంతో తరచూ వడ్డీ వ్యాపారులు ఇంటి వద్దకు చేరుకుని దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవవుతుందని భావించిన ఆమె శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!)
Comments
Please login to add a commentAdd a comment