money lenders
-
అనంతపురంలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం
-
వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై పట్టణ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కాసారపు రాజయ్య వద్ద రూ.56.35 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.4 లక్షలు, లవంగ రాజేందర్ వద్ద రూ.70 వేలు, రూ.1.58 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రమేశ్ వద్ద 28 ప్రామిసరీ నోట్లు, రెండు ఖాళీ చెక్కులు, అరవింద్ వద్ద 29 ఖాళీ చెక్కులు, రూ.2.50 లక్షల విలువైన మార్టిగేషన్ పేపర్లు, కడెం వెంకవ్వ వద్ద రూ.21.43 లక్షల విలువైన 56 ప్రామిసరీ నోట్లు, రూ.85 వేలు పట్టుకున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైలు నరేశ్‌కుమార్, మన్మధరావు, ఏఎస్సై వేణురావు, సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతె, టీఆర్‌నగర్ గ్రామాల్లోని నలుగురు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు ఎస్సై సదాకర్ తెలిపారు. టీఆర్‌నగర్‌కు చెందిన పెద్ద సారయ్య ఇంట్లో రూ.1.19 లక్షలు, 129 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు. ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని గోధూర్, సత్తక్కపల్లి గ్రామాల్లో శనివారం ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. గోధూర్‌లో బండి పురుషోత్తం ఇంట్లో రూ.8.33 లక్షల విలువైన 17 ప్రామిసరీ నోట్లు, రూ.3 వేల విలువైన బ్లాంక్ చెక్, 23 చిన్న నోటు పుస్తకాలు, 2 మీడియం నోటు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తక్కపల్లిలో ఆరెళ్ల రాజగౌడ్ ఇంట్లో రూ.36.45 లక్షల విలువైన 18 ప్రామిసరీ నోట్లు, చిన్న బుక్స్ 18, మీడియం బుక్ 1, లాంగ్నోట్ బుక్ 1, రూ.1.69 లక్షలు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి, ఆ ఇదరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రాయికల్(జగిత్యాల): మండలంలోని ఇటిక్యాల, అల్లీపూర్ గ్రామాలకు చెందిన వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. అల్లీపూర్‌లోని రాజు ఇంట్లో రూ.1.80 లక్షలు, ఇటిక్యాలలోని శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రూ.18 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు లభ్యమైనట్లు తెలిపారు. ధర్మపురి: స్థానిక 9 మంది వడ్డీ వ్యాపారుల ఇళ్లలో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.6.23 లక్షలు, 65 ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపడుతున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మల్లాపూర్(కోరుట్ల): మండలంలోని రేగుంట, మొగిలిపేట గ్రామాలకు చెందిన పలువురి ఇళ్లలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతి, లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశామని ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. అయితే, పోలీసులకు నగదు, ఎలాంటి అప్పు పత్రాలు లభించలేదని తెలిసింది. కోరుట్ల: కోరుట్లకు చెందిన 12 మంది వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. అరిసెల్లి రాజేశం ఇంట్లో రూ.1.28 లక్షలు, రూ.69 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీ నం చేసుకున్నట్లు సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్ తెలిపారు. మెట్పల్లి: పట్టణానికి చెందిన పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. సీఐ నవీన్, ఎస్సై చిరంజీవి, పోలీసు సిబ్బంది ర్యాగల్ల వెలయేశ్వర్, వేముగంటి భూమేశ్వర్, ధ్యావనపల్లి రాజారాం ఇళల్లో రూ.5 లక్షలు, రూ.87 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 26 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమో దు చేశారు. అలాగే, కట్కం రమేశ్ ఇంట్లో సోదా లకు వెళ్లగా అతను పోలీసులను అడ్డుకొని, వాగ్వాదానికి దిగాడు. ఒక దశలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినప్పటికీ పోలీసులు రమేశ్ ఇంట్లోకి వెళ్లి, తనిఖీలు చేపట్టారు. బంగారం తాకట్టు పెట్టుకొని, అప్పులు ఇచ్చే ఇతను గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరిపిన సోదాల్లో కూడా భారీ గా బంగారం పట్టుబడినట్లు తెలిసింది. ఈ తని ఖీలను ఎస్బీ డీఎస్పీ రవీందర్ పర్యవేక్షించారు. బుగ్గారం(ధర్మపురి): మండలంలోని వెల్గొండ, శెకెల్ల గ్రామాలకు చెందిన వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. అప్పు పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని, శెకెల్లకు చెందిన బంక వెంకటేశం, వెల్గొండకు చెందిన వెంకటరాజంలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
అనంతపురం సిటీ: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన మేరకు... అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న నందమూరి నగర్ నివాసి షేక్ షామీర్‌బాషా (30)కు తల్లిదండ్రులు షఫీ, మాలిన్‌బీ, భార్య రిజ్వాన్బీ, ఇద్దరు పిల్లలున్నారు. మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో వర్క్ షాప్ నిర్వహణ, కుటుంబ అవసరాలకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. తరచూ అప్పు చెల్లించాలంటూ ఘర్షణ పడుతుండడంతో వర్క్‌షాప్‌కు దూరమవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయలకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. గురువారం ఉదయం హెచ్చెల్సీ కాలనీ సమపంలో పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రైల్వే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆరా తీశారు. ఫొటోలు చూపగానే మృతుడిని షామీర్బాషాగా గుర్తిస్తూ గుండెలవిసేలా రోదించారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల తాళలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
భర్తకు తెలియకుండా అప్పులు..చివరికి అదే ఆమెను..
సాక్షి, తాడిపత్రి అర్బన్: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని పాతకోటలో నివాసముంటున్న షేక్ గౌస్, ఖతీజా (38) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్తకు తెలియకుండా ఖతీజా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసింది. దీంతో పాటు సొంత పూచీకత్తుపై తన ఇంటి సమీపంలోని కొందరికి అప్పులు ఇప్పించింది. ఈ క్రమంలో అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తడంతో తరచూ వడ్డీ వ్యాపారులు ఇంటి వద్దకు చేరుకుని దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవవుతుందని భావించిన ఆమె శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!) -
అప్పుకు అనేక అవసరాలు.. ఇదే వారి పెట్టుబడి.. ప్రాణాలు పోయినా సరే!
నిజామాబాద్‌కు చెందిన సురేష్ తన అవసరాల కోసం జ్ఞానేశ్వర్ దగ్గర రూ.50 లక్షలు, అతని అన్న వద్ద రూ.30 లక్షలు, మరో బంధువు వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. జ్ఞానేశ్వర్‌కు ఇప్పటికే రూ.32 లక్షలు చెల్లించాడని తెలిసింది. ఇది వడ్డీలకే సరిపోతుందని, అసలు ఎప్పుడు చెల్లిస్తావంటూ అతడు సురేష్‌ను తీవ్రంగా వేధించాడు. మరోవైపు కరిపె గణేష్ వద్ద రూ.60 లక్షలు తీసుకున్న సురేష్.. రూ.40 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. అయినప్పటికీ అసలు డబ్బులు చెల్లించాలంటూ గణేష్ బెదిరించాడు. మరోవైపు నిర్మల్‌కు చెందిన చిట్టీల వ్యాపారి వినీత వద్ద తీసుకున్న చిట్టీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె కూడా వేధించసాగింది. ఈ నేపథ్యంలోనే సురేష్ కుటుంబసభ్యులు నాలుగురోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షి, హైదరాబాద్: వడ్డీ వ్యాపారుల ఆగడాలకు, దౌర్జన్యాలు, బెదిరింపులకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతున్నాయి. పంట పెట్టుబడికి అప్పు.. వ్యాపారం కోసం అప్పు.. చిన్న కుటుంబాల్లో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు అప్పు.. ఇలా అప్పుకు అనేక అవసరాలు, కారణాలున్నాయి. అయితే బాధితుడి అవసరాన్ని, పరిస్థితిని ఆసరాగా తీసుకుని వడ్డీ వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరం కొద్దీ అధిక వడ్డీకి తీసుకున్నా ఆ తర్వాత కనీసం వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టలేక, అసలు అప్పు ఎన్నటికీ తీరే మార్గం లేక బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం వడ్డీ వ్యాపారుల దోపిడీకో తాజా ఉదాహరణ. ఒక్క సురేష్ కుటుంబమే కాదు.. మాట పడితే ప్రాణం పోయినట్టుగా భావించే కుటుంబాలు వడ్డీ వ్యాపారుల బెదిరింపులకు భయపడి, ఆస్తుల జప్తుతో అవమానపడుతున్న ఎంతోమంది బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. దారుణ ఘటనలు జరిగినప్పుడు పైపై దాడులు, కేసులతో సరిపెడుతుండటంతో వడ్డీ వ్యాపారుల దందా మూడు లక్షలు.. ఆరు కోట్లు అన్నట్టుగా సాగుతోంది. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారానికి (మనీ లెండింగ్), చిట్టీలు, ఫైనాన్స్ సంస్థలకు అనుమతులు జారీ చేసే అధికారం స్థాయిల వారీగా జిల్లా కలెక్టర్ నుంచి మండల తహసీల్దార్ వరకు కల్పించారు. మొత్తం మీద కలెక్టర్‌కు దీనిపై అజమాయిషీ అధికారం ఉంటుంది. మనీ లెండింగ్ బిజినెస్‌కు అవసరమైన అనుమతి కోసం మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ 2017 ప్రకారం అనుమతి ఇస్తారు. కానీ రాష్ట్రంలో డెయిలీ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్న 90 శాతం మందికి ఎలాంటి అనుమతులు లేవు. ఏఎస్ఐ మోహన్‌రెడ్డి కేసు తర్వాతా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ ఏఎస్ఐ మోహన్‌రెడ్డి కేసు తర్వాత కూడా వడ్డీ వ్యాపారుల్లో మార్పు రాలేదు. తనఖా పెట్టిన ఆస్తులను కాజేయడం, వడ్డీ పేరుతో తీసుకున్న అసలుకు పది రెట్లు కట్టించుకొని కూడా, ఇంకా అసలే తీరలేదనడం, ఆస్తులను రిజిస్టర్ చేయించుకోవడం వంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. గ్రేటర్లో రూ.1,200 కోట్ల వ్యాపారం! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున ప్రతి నెలా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు జీరో వడ్డీ వ్యాపారం సాగుతోందని అంచనా. రోజువారీ వడ్డీ వ్యాపారం సాగించే వారి సంఖ్య నాలుగైదు వేల మంది వరకు ఉంటుందని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం విలువైన భూములు, స్థలాలు, ప్లాట్స్, ఫ్లాట్స్‌ను మాత్రమే తనఖా ఉంచుకుని అప్పులివ్వటం వీరి ప్రత్యేకత. కొందరు ఖాళీ చెక్‌లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని అప్పులిస్తున్నారు. వసూళ్ల కోసం రౌడీషీటర్లు, బౌన్సర్లను రంగంలోకి దింపి బాధితులను పీల్చి పిప్పి చేస్తున్నారు. జగిత్యాల మాఫియా రూటే సపరేటు జగిత్యాల పట్టణంలో ప్రారంభంలో తక్కువ వడ్డీ అని ఎరవేసే వ్యాపారులు.. పోనుపోను తమ వికృతరూపాన్ని బయటపెడతారు. ప్రతినెలా 10 శాతం చొప్పున పెంచుకుంటూ.. పోయి వడ్డీకి వడ్డీలు కట్టి, చక్రవడ్డీలు అంటూ ఇచ్చిన వడ్డీ కంటే 20 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. 1980ల్లోనే ఇక్కడ ఈ వ్యాపారం వేళ్లూనుకుపోయింది. 1990 నాటికే ఏటా దాదాపు రూ.1,200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. వీరి వ్యాపారం ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ వరకు విస్తరించింది. గిరిగిరి.. నెలవారీ గిరిగిరి, వీక్లీ, ఫైనాన్స్, నెలవారీ వడ్డీ తదితర పేర్లతో వ్యాపారులు డబ్బు అప్పు ఇస్తున్నారు. గిరిగిరిలో రూ.10 వేలు కావాల్సి వస్తే రూ.8 వేలు ఇస్తారు. రోజూ రూ.100 చొప్పున వంద రోజుల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.10 వేలు నేరుగా ఇస్తే రోజుకు రూ.120 చొప్పున వందరోజులు కట్టాలి. నెలవారీ ఫైనాన్స్‌లో రూ.50 వేలు ఇస్తే రూ. 6,500 చొప్పున 10 నెలలు తిరిగి చెల్లించాలి. కొందరు బడా వ్యాపారులు తమ సహచర వ్యాపారులకు ఉదయం రూ.లక్ష ఇచ్చి, సాయంత్రానికి దానికి అదనంగా రూ.10,000 వసూలు చేస్తున్నారు. -
రుణం కోసం కుమారుడి తాకట్టు
టీ.నగర్: తీసుకున్న రుణం కోసం కుమారుడిని తండ్రి తాకట్టు పెట్టినట్లు భార్య ఫిర్యాదు చేసింది. రామనాథపురం జిల్లా, పరమకుడి జ్యువెలరీ బజారు వీధికి చెందిన దంపతులు రమేష్, శరణ్య. వీరికి 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహ సమయంలో శరణ్యకు 90 సవర్ల బంగారు నగలను వరకట్నంగా ఇచ్చారు. రమేష్ తండ్రితోపాటు నగల దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారంలో రెండేళ్లుగా నష్టం రావడంతో శరణ్య నగలు విక్రయించినట్లు సమాచారం. బయట రుణాలు తీసుకుని వ్యాపారం సాగించారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో రుణదాతలు రమేష్‌ను వేధించడం మొదలుపెట్టారు. రుణాల బాధతో శరణ్య గత డిసెంబరులో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో కుమారుడ్ని రుణదాతలకు అప్పగించి, నగదు చెల్లించగానే అతన్ని ఇంటికి తీసుకురావడం పరిపాటిగా మారినట్లు భార్య శరణ్య ఆరోపించారు. ఇలావుండగా, రమేష్ ఇంట్లో నుంచి శరణ్యను గెంటివేశాడు. దీంతో ఆమె తన కుమారుడు, సోదరుడితో కలిసి పరమకుడి ముత్తాలమ్మన్ ఆలయ ప్రాంగణంలో ఆందోళన జరిపింది. భర్త రమేష్‌పైన, రుణాలిచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అప్పుల తిప్పలు
సాక్షి, బీబీపేట(నిజామాబాద్): పేదలకు కరోనా మిగిల్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఆరు నెలలుగా అనుభవించిన గడ్డు పరిస్థితుల నుంచి బయట పడడానికి వారికి కొన్నేళ్ల కాలం పడుతుంది. పనుల్లేక పూట గడవక విధిలేని పరిస్థితుల్లో అప్పుల బాట పట్టిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో వడ్డీ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. పేదల అవసరం వడ్డీ వ్యాపారులకు అవకాశంగా మారింది. గతంలో కన్నా ఇప్పుడు రెట్టింపు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు తీసుకుంటున్న మొత్తాన్ని బట్టి రూ. 10కి పైనే వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు తిరిగి చెల్లిస్తున్న మొత్తం వడ్డీకి కూడా సరిపోకపోవడం బాధాకరం. ఈ జాబితాలో ఎక్కువగా రోజు వారీ కూలీలు చిరువ్యాపారులు ఉన్నారు. పనిచేస్తేనే నాలుగు వేళ్లు నోట్లోకి.. కరోనా చిరు వ్యాపారులు, కూలీలు, చిన్నచిన్న ఉద్యోగుల బతుకులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ మొదలైన తర్వాత రెండు నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు కదల్లేని పరిస్థితి. అప్పటి వరకు దాచిపెట్టుకున్న డబ్బులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన రేషన్ వీరి కడుపును పూర్తిగా నింపలేకపోయాయి. ఇక రెండు నెలల తర్వాత దశలవారిగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నప్పటికీ అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతో కూలీలకు పనులు దొరకడం కష్టంగా మారింది. గ్రామాల్లో కొంత వరకు ఉపాధి హామీ పనులు ఆదుకుంటున్నా, పట్టణాల్లోని నిరుపేదల బతుకులు మరీ దారుణంగా మారాయి. ఇక వీధి వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు మినహా మిగిలిన వస్తువులు, తిను బండారాలను కొనేవారు లేకుండా పోయారు. దీంతో రోజూ వీధులు తిరుగుతూ రోడ్లపై బండ్లు, బుట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న పేద వర్గాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇక విధి లేని పరిస్థితుల్లో అప్పులు తెచ్చుకొని బతుకు బండి లాగించాల్సిన దుస్థితి నెలకొంది. అవసరాన్ని ఆసరాగా తీసుకొని.. ఓ వైపు నిరుపేదల దుస్థితి ఇలా ఉంటే వడ్డీ మాఫియా మా త్రం దీన్ని అవకాశంగా మలుచుకుంటోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 2కు మించి వడ్డీకి ఇవ్వకూడదు. కానీ సాధారణ రోజుల్లోనూ రూ. 5 వరకు వడ్డీ వసూలు చేసేవా రు. అయితే ఇప్పుడు కష్టకాలంలో తగ్గించాల్సింది పోయి రె ట్టింపు చేశారు. వడ్డీ మాఫియా మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడంతో పేదలపై కరోనా భారం కన్నా వడ్డీ భారం ఎక్కువగా కనిపిస్తోంది. కూలీలు, వీధి వ్యాపారులు రూ. 10 వేలు నుంచి రూ. 50 వేల వరకు వడ్డీకి తీసుకుంటున్నారు. రోజువారీ, వారం వారీ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంది. వీ ధి వ్యాపారులు పెట్టుబడి కోసం ఉదయం తీసుకుంటే సా యంత్రానికి తిరిగి చెల్లించాలి. ఇప్పుడు రోజంతా వ్యాపారం చేసినా తిరిగి చెల్లించడానికి మొత్తం సరిపోతుంది తప్ప ఏమీ మిగలడం లేదని పలువురు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి నుంచి ప్రామిసరీ నోట్లు, వస్తువులు, వాహనాలు, ఇళ్లపట్టాలు తీసుకుంటూ వడ్డీకి డబ్బులిస్తున్నారు. పనులు దొరక్క ఒకటి రెండు రోజులు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైతే బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే నిరుపేదల జీవితాలు మరింత దారుణంగా మారనుంది. భారంగా దుకాణాల కిరాయిలు జిల్లా వ్యాప్తంగా ఆయా దుకాణాలు నడిపే వ్యక్తులు చాలా వరకు కిరాయికి తీసుకున్న షాపులే. జిల్లా కేంద్రంలో ఒక్కో షాపు కిరాయి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు కూడా ఉంది. మండల కేంద్రంలో రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. దీంతో ఆరు నెలలుగా దుకాణాలు సరిగ్గా నడవకపోవడంతో రూం అద్దెలు చెల్లించడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. అటు అద్దె చెల్లించకపోవడంతో సదరు యజమానులు రూంలు ఖాళీ చేయించడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా వరకు షాపులు మూతబడ్డాయి. ఒక్కో షాపు యజమాని వడ్డీకి డబ్బులు తెచ్చి రూం అద్దెలు చెల్లిస్తున్నారు. కరోనా వల్ల చాలా నష్టాలు చూస్తున్నాం కరోనా వైరస్ వల్ల దుకాణాలు నడవక పోవడంతో కుటుంబం నడవడమే ఇబ్బందిగా ఉంది. గతంలో వచ్చిన గిరాకీ ఇప్పుడు లేకపోవడంతో తెచ్చిన సరుకులు సైతం వాలిడిటీ అయిపోయి పాడేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొనడానికి వచ్చే ప్రజలు కూడా భయంతో వణుకుతున్నారు. దుకాణాలు విడిచి వేరే పని చేసుకోవాలంటే ఇంత సరుకులు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే చిన్న వ్యాపారులను ఆదుకోవాలి. – వెంకటేశ్, జనరల్ స్టోర్ నిర్వాహకుడు, బీబీపేట దుకాణాలు నడపడం భారంగా ఉంది కరోనా వల్ల దుకాణాలు నడవకపోవడంతో వాటి అద్దెలు కూడా చెల్లించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెచ్చిన సరుకులు అమ్ముడు పోతలేవు. దీంతో దుకాణాలు నడపడం భారంగా మారింది. అంతే కాకుండా గ్రామాల్లో సైతం లాక్డౌన్ విధించడంతో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం లాక్డౌన్ లేకుంటే అయిన కొద్దిగా గిరాకీ వస్తుండేది. కానీ లాక్డౌన్ పెట్టడంతో జనాలు బయటకు రావడం లేదు. దీంతో దుకాణాలు నడవడం కష్టంగా మారింది. – మహేశ్, మొబైల్ షాపు నిర్వాహకుడు, బీబీపేట అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలు తెలపాలి పేదల నుంచి వడ్డీ వ్యాపారులు అప్పులకు సంబంధించి అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలు తెలపాలని, వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకోం. ఇచ్చిన అప్పులను వసూలు చేసే క్రమంలో ఇళ్లపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రజలు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – యాలాద్రి, సీఐ, భిక్కనూరు -
వడ్డీ పిండేస్తున్నారు..
గరివిడి: జిల్లాలో వడ్డీ వ్యాపారులు కాలసర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అత్యవసరంగా నగదు అవసరమై వచ్చిన వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వడ్డీ మీద వడ్డీ వేస్తూ వారి శ్రమను జలగల్లా పీల్చుకుంటున్నారు. బారువడ్డీ, చక్రవడ్డీ అంటూ అసలు కన్నా వడ్డీయే ఎక్కువగా లాగేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరండంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరు వడ్డీ వ్యాపారులు పోలీస్ స్టేషన్లలో పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ బాకీలు వసూలు చేసుకుంటున్నారు. పట్టణాల్లో అయితే ఈ వడ్డీ వ్యాపారం అధికంగానే నిర్వహిస్తున్నారు. కొంతమంది పెత్తందార్ల సపోర్ట్‌తో ఈ వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. వడ్డీ వ్యాపారం మూడు ప్రామిసరీ నోట్లు..ఆరు ఖాళీ చెక్కులు అన్న చందంగా విచ్చలవిడిగా సాగుతోంది. కోర్టు కేసుల పేరిట వేధింపులు.. అప్పు కోసం తమ వద్దకు వచ్చేవారి నుంచి వడ్డీ వ్యాపారులు బ్యాంక్ ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు తీసుకుని ఖాళీ ప్రాంశరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. డబ్బు ఇచ్చే సమయంలో రూ. 100కు రూ. 10 నుంచి రూ.20 తగ్గించి మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. వడ్డీ మాత్రం వంద రూపాయలకు వసూలు చేస్తున్నారు. కొంతమంది నిస్సహాయులు భవనాలు, భూములు, నగలు, ఇళ్లను తనఖా పెడుతున్నారు. వారు వడ్డీ చెల్లించడంలో ఆలస్యమైతే వడ్డీ వ్యాపారులు ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. రుణ గ్రహీత వడ్డీ చెల్లించడం ఆలస్యమైనా.. వడ్డీ అధికమని ప్రశ్నించినా.. వారి ఇచ్చిన ఖాళీ చెక్కులు, ప్రాంశరీ నోట్ల ఆధారంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. నూటికి తొంబై శాతం మంది వడ్డీ వ్యాపారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవు. ఇటీవల అవినీతి శాఖాధికారులు పలువురు అధికారులను పట్టుకుంటున్న సందర్భాల్లో కూడా అధిక మొత్తంలో ప్రాంశరీ నోట్లు దొరకడం విశేషం. బాధ్యతాయుతమైన అధికారులు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఏసీబీ దాడుల వల్ల తెలిసింది. వడ్డీ వసూలు చేసేది ఇలా.. రూ. లక్ష తీసుకుంటే నాలుగు నుంచి పది రూపాయల వరకూ వడ్డీ వసూలు చేస్తారు. నెల నెలా కొంత మొత్తాన్ని అసలు కింద జమచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణ గ్రహీత నెల నెలా అసల కింద సొమ్ము జమ చేస్తున్నా వడ్డీ మాత్రం చివరి నెల వరకూ రూ. లక్షకే వసూలు చేస్తారు. ఈ లెక్కన రుణ గ్రహీత తీసుకున్న సొమ్ముతో సమానంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. కఠిన చర్యలు.. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయకూడదు. ఎవరినీ వేధింపులకు గురి చేయకూడదు. అధిక వడ్డీ, వేధింపులపై బాధితులు ఫిర్యాదు చేస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు. – కె. కృష్ణ ప్రసాద్, ఎస్సై, గరివిడి -
అధిక వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం
-
వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం
సాక్షి, ప్రకాశం : జిల్లాలో అధిక వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. ఒంగోలులోని రైల్‌పేటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళను అక్రమ వడ్డీ వ్యాపారులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆదిలక్ష్మి ఇప్పటికే తీసుకున్న అప్పులకు అధిక వడ్డీల రూపంలో లక్షల రూపాయలు చెల్లించారు. అయిన కూడా అక్రమ వడ్డీ వ్యాపారులు అసలు చెల్లించాలంటూ ఆదిలక్ష్మిని వేధిసున్నారు. ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టాలని ఆమెను ఒత్తిడికి గురిచేస్తున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులకు సంబంధించి ఆదిలక్ష్మి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘అప్పు తీర్చలేకపోతే నీ కూతుళ్లను పంపించు’
గురుగ్రామ్, హరియాణా : ‘వడ్డి వ్యాపారుల దౌర్జన్యాల నుంచి కాపాడండి అంటూ నా భర్త పోలీసులను ఆశ్రయించాడు. కానీ పోలీసులు నా భర్త ఫిర్యాదును పట్టించుకోలేదు. ఆ ఫలితం ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. అప్పు ఇచ్చిన వాళ్లు మా ఇంటికి మీదకు వచ్చి దాడి చేశారు. అప్పు తీర్చలేక పోతే నీ ఇద్దరు కూతుళ్లను మాతో పంపించు అంటే దూషించారు. ఈ అవమానం తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపిస్తుంది గురుగ్రామ్‌కి చెందిన మోని దేవి(33). మోని దేవి తెలిపిన వివారాల ప్రకారం.. సురేందర్ సైనీ(36) ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం సైనీ అదే గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి లక్ష రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. కానీ వాటిని చెల్లించలేక పోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వారు సైనీ మీద ఒత్తిడి తీసుకురాసాగారు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారి వల్ల తన ప్రాణాలకు ప్రమాదాం ఉందని భావించిన సైనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు సరిగా స్పందించలేదు. ఈ క్రమంలో ఓ రోజు అప్పు ఇచ్చినవారు సైనీ ఇంటికి వచ్చి అప్పు తీర్చమంటూ దూషించడమే కాక ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ బెదిరించారు. అంతేకాక అప్పు చెల్లించలేక పోతే సైనీ ఇద్దరు కుమార్తెలను వారి వెంట పంపిచాలంటూ అసహ్యంగా మాట్లాడరు. ఈ అవమానాన్ని భరించలేని సైనీ ఆత్మహత్య చేసుకుని మరణించాడు అని అతని భార్య మోని దేవి తెలిపింది. తన భర్త ఆత్మహత్యకు పోలీసులే కారణమని ఆరోపించింది. ఒక వేళ పోలీసులు గనక తన భర్త ఇచ్చిన ఫిర్యాదు గురించి పట్టించుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయింది. అయితే ఈ విషయం గురించి పోలీసులను అడగగా వారు సైని తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలపడం గమనార్హం. -
‘వడ్డీ’కాసురులు
జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు వ్యాపారులు అడ్డగోలు వడ్డీతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. అసలుకన్నా వడ్డీ ఎక్కువైనప్పుడు.. కట్టలేని పరిస్థితుల్లో అప్పు తీసుకున్నవారి ఇళ్లను, ప్లాట్లను, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. – సాక్షి, కామారెడ్డి సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన రాజయ్య (పేరు మార్చాం) అవసరానికి ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. రాజయ్య వ్యాపారం దెబ్బతింది. తీసుకున్న అప్పు చెల్లించలేకపోయాడు. అప్పు తీర్చడానికి మరికొంత కాలం గడువు అడిగాడు. దీనికి సమ్మతించిన సదరు వడ్డీ వ్యాపారి.. 15 నెలలకు వడ్డీ లెక్కగట్టి అసలు, వడ్డీ మొత్తం రూ. 3.50 లక్షలు అయ్యిందని తేల్చాడు. ఇంత మొత్తం బాకీకి ఇంటికి సంబంధించిన కాగితాలు ఇవ్వాలనే షరతు పెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజయ్య ఇంటికాగితాలు చేతికిచ్చాడు. మరో ఏడాది గడిచింది. అప్పు వడ్డీలతో రూ. 5 లక్షలు దాటింది. ఇక లాభం లేదని ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి తేవడంతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. వ్యాపారాల్లో నష్టాలే తప్ప లాభాలు రాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. సదరు వడ్డీ వ్యాపారి పది నెలల తర్వాత మళ్లీ అసలు, వడ్డీ లెక్కేశాడు. అప్పు రూ. 7 లక్షలు దాటిందని.. వారం రోజుల్లో మొత్తం అప్పు తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. వారం తర్వాత పదిహేను మందిని తీసుకుని వచ్చాడు. ఎంత బతిమాలినా కనికరించకపోవడంతో రాజయ్య సామాన్లు సర్దుకుని, వేరే ఇంటికి మారాడు. జిల్లా కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అమ్ముతూ నాలుగు పైసలు సంపాదించాలన్న ఆశతో ఓ ఆంధ్రా మేస్త్రీ తన దగ్గర ఉన్న డబ్బులను పెట్టుబడిగా పెట్టాడు. అవి సరిపోకపోవడంతో ఓ వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాడు. ఎంత కావాలన్నా ఇస్తాను కాని, ప్లాటును తన పేరిటే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే షరతు పెట్టాడు. దానికి సమ్మతించిన మేస్త్రీ.. రెండు ప్లాట్లను రిజస్ట్రేషన్ చేసి రూ. 5 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి డబ్బులు సరిపోకపోవడంతో మరో రూ. 5 లక్షల అప్పు అడిగాడు. ప్లాటు తన పేరిటే ఉండడంతో సదరు వ్యాపారి అప్పు ఇచ్చాడు. మేస్త్రీ ఆరు నెల ల్లో ఇంటి నిర్మాణాలను పూర్తి చేశాడు. మరో ఆరు నెలలైనా ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయలేదు. తన సొంత డబ్బులుపోను రూ. 10 లక్షలు అప్పు గా తీసుకుని పెట్టిన పెట్టుబడికి సంబంధించి వడ్డీ లెక్కలు చూసుకున్నాడు. వడ్డీ వ్యాపారి డబ్బుల కోసం ఒత్తిళ్లు తేసాగాడు. ఓరోజు కూర్చోబెట్టి ‘‘నువ్వు తీసుకున్న అప్పుకు ఇప్పటికే రూ. 4 లక్షల మిత్తి అయ్యింది. అసలుతో కలిపి రూ.14 లక్షలు కట్టు’’ అని ఒత్తిడి తెచ్చాడు. ఇళ్లు అమ్ముడవకపోవడంతో మేస్త్రీ చేతులెత్తేశాడు. వ్యాపారి రెం డు ఇళ్లకు రూ. 18 లక్షలు లెక్కగట్టి.. తనకు రావాల్సిన రూ. 14 లక్షలు పోనూ మిగిలిన రూ. 4 లక్షలను మేస్త్రీ చేతిలో పెట్టాడు. తాను కష్టపడి దాచుకున్న సొమ్ము కూడా పోవడంతో ఆ మేస్త్రీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొంత కాలానికి ఆ వ్యాపారి ఒక్కో ఇంటిని రూ. 26 లక్షలకు అమ్ముకున్నాడు. కష్టపడ్డ మేస్త్రీకి మాత్రం కన్నీళ్లు మిగిలాయి. అవసరానికి అప్పు ఇస్తున్నామని చెప్పుకుంటూ కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీసుకున్నవారి రక్తాన్ని పీల్చేస్తున్నారు. అడ్డగోలు వడ్డీలతో వారి నడ్డి విరుస్తున్నారు. ఇదే సమయంలో తమ దగ్గర తీసుకున్న అప్పును తీర్చలేని వారికి సంబంధించిన ఆస్తులను జబర్దస్తీగా స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొందరు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరాయి. ఎలాంటి అనుమతులు, లెక్కా పత్రం లేకుండానే రూ. కోట్లల్లో వడ్డీల దందా నిర్వహిస్తున్నారు. అప్పుపై అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చే ముందు ఇంటి కాగితాలో, ప్లాటు కాగితాలనో తనఖా పెట్టుకోవడం, సకాలంలో అప్పు చెల్లించకుంటే ఆస్తులను ఆక్రమించుకోవడం పరిపాటిగా మారింది. అడ్డగోలు వడ్డీలు... వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు చేస్తున్న దందా సామాన్యులను దివాలా తీయిస్తోంది. ప్రతి మని షికి ఏదో ఒక సందర్భంలో అప్పు చేయాల్సి వ స్తోంది. ప్రధానంగా పిల్లల చదువులకో, ఇళ్ల నిర్మా ణానికో, ప్లాటు కొనుగోలు కోసమో, పిల్లల పెళ్లి ళ్లు, ఫంక్షన్లు, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడుల కోసమో.. ఇలా ప్రతిదానికి అప్పు చేయాల్సిందే. ఇలాంటి సందర్భంలో వడ్డీ వ్యాపారులు ‘కొంద రు’ అడ్డగోలు వడ్డీలతో నడ్డివిరుస్తున్నారు. నూటి కి నెలకు రూ. 3 నుంచి రూ. 5 వరకు వడ్డీ వసూ లు చేస్తున్నారు. కొందరైతే మూడు నెలలకోసారి, మరికొందరు ఆరు నెలలకోసారి వడ్డీ లెక్కలు గ డుతున్నారు. కొందరు వడ్డీ వ్యాపారులు ముందుగానే ఆరు నెలల వడ్డీని తీసుకుంటున్నారు. వడ్డీ, అసలు కలిపి మళ్లీ కొత్త లెక్క రాసుకోవడం మూ లంగా అప్పుభారం ఏడాదిన్నర, రెండేళ్లలో రెట్టింపవుతోంది. వాయిదా ప్రకారం డబ్బు చెల్లించకుం టే వడ్డీలపై వడ్డీలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. తనఖా తప్పనిసరి కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు ఇచ్చేటపుడు ఏదైనా తనఖా పెట్టాలన్న షరతు విధిస్తున్నారు. ప్రధానంగా ఇంటికి సంబంధిం చిన డాక్యుమెంట్లుగాని, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు గాని వారి వద్ద తనఖా పెట్టుకున్న తరువాతనే అప్పులు ఇస్తున్నారు. అప్పులు చెల్లించని పక్షంలో వడ్డీ వ్యాపారులు తమ మనుషులను తీసుకెళ్లి ఇంటి ముందర నానా హంగామా చేయడం, అప్పుకట్టకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. అప్పులు తీసుకున్నవారు చాలా మంది వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేయాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. -
పోలీసుల అదుపులో వడ్డీ వ్యాపారులు
సిరిసిల్లక్రైం/ వేములవాడ/ ఎల్లారెడ్డిపేట : వడ్డీవ్యాపారులపై రాజన్న సిరిసిల్ల పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏకకాలంలో జిల్లావ్యాప్తంగా దాడిచేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరుపేదలకు అప్పులిచ్చి వారివద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తున్నార నే ఆరోపణలతో బుధవారం కొందరు ఫైనాన్షియర్లను అరెస్ట్ చేశారు. జిల్లాకేంద్రంతో పాటు వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలాల్లో దాడులు నిర్వహించారు. సిరిసిల్లలో ఐదుగురు.. సిరిసిల్ల పట్టణంలో వడ్డీవ్యాపారం, ప్రయివేటు చిట్టీలు నడిపిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఆడెపు మురళి, సయ్యద్ షఫి, వొడ్నాల సత్యనారాయణ, పతెం రవీందర్, దార అశోక్ అరెస్ట్ చేశారు. వీరివద్ద పెద్ద ఎత్తున ప్రామిసరీనోట్లు, ఖాళీ చెక్కులు, భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో ముగ్గురు.. ఎల్లారెడ్డిపేట మండలంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వడ్లూరి సత్యనారాయణను అదుపులోకి తీసుకుని చిట్టీలకు సంబంధించిన రికార్డులను సీజ్ చేశారు. రాచర్ల గొల్లపల్లికి చెందిన పెట్రోల్ బంక్ యజమాని అల్లాడి ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. బస్టాండ్ వద్ద చిట్‌ఫండ్ నిర్వహిస్తున్న కొండ రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేములవాడలో ముగ్గురు.. వేములవాడలో అనుమతులు లేకుండా చిట్టీలు,వడ్డీ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మార్కెట్ ప్రాంతంలో కె. కిషన్, మటన్‌మార్కెట్ ప్రాంతంలో ఉన్న బి. దశరథం, పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో ఉన్న కె. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుంచి చిట్టీల రిజిస్టర్లు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పేదరికాన్ని సొమ్ము చేసుకోవద్దు అవసరాల నిమిత్తం అప్పుకు వచ్చే పేదలకు వడ్డీల మీద వడ్డీలు వేసి సొమ్ము చేసుకోవద్దని ఎస్పీ విశ్వజిత్ కాంపాటి అన్నారు. బుధవారం సాయంత్రం పోలీస్ కార్యాలయంలో వడ్డీవ్యాపారులను అరెస్టు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో చాలామంది చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారాలు చేస్తున్నారన్నారు. చాలా మంది నేతకార్మికులు అప్పులు చేసి అధిక వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల జాబితా తమ వద్ద ఉందని అందరిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఇద్దరు సీనియర్ సిటిజన్లకు నోటీసులు ఇస్తున్నామన్నారు. కొండ రమేష్ అనే వ్యక్తిని 109 సెక్షన్ కింద బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ, టౌన్ సీఐ చెల్లగుండ్ల శ్రీనివాస్‌రావు, సీసీఎస్ సీఐ భన్సీలాల్ ఉన్నారు. -
అనంతలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం
ధర్మవరం: తీసుకున్న అప్పు చెల్లించినా, కేవలం రూ.వెయ్యి వడ్డీ కట్టలేదనే కారణంతో వడ్డీ వ్యాపారులు ఓ యువతిని బలవంతం చేయబోయారు. ఆమె ఎదురు తిరగడంతో తలపై రాళ్లతో కొట్టి గాయపర్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని యాదవవీధికి చెందిన చాకలి పెద్దన్న, సరోజమ్మ కుమార్తె లావణ్య. వీరు అదే కాలనీకి చెందిన వడ్డీవ్యాపారి ఖాజాపీరా వద్ద మూడేళ్ల క్రితం రూ.2లక్షల వరకు అప్పు తీసుకున్నారు. బుధవారం రాత్రి అసలు, వడ్డీ కలిపి చెల్లించారు. అయితే.. పది రోజులు ఆలస్యంగా చెల్లించినందుకు గాను అదనంగా రూ. వెయ్యి వడ్డీ ఇవ్వాలని అతను ఒత్తిడి చేశాడు. అంత డబ్బు కట్టాము కదా.. వదిలేయాలని కోరారు. కాగా.. గురువారం ఉదయం 11.30 గంటలకు లావణ్య ధర్మవరం చెరువు నుంచి పశువులకు గడ్డి కోసుకుని వస్తుండగా ఖాజాపీరాతో పాటు ఫకద్ధీన్, మబ్బాషా అనే వ్యక్తులు ఆమెను అటకాయించారు. వడ్డీ ఇస్తావా.. కోర్కె తీర్చుతావా అంటూ చెరువులోకి లాక్కుపోయారు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వస్తుండగా.. వెనక నుంచి రాళ్లతో దాడి చేశారు. ఆమె తల వెనుక భాగంలో రాయి తగిలి తీవ్ర గాయమైంది. బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కింజరాపు వారే అతి పెద్ద వడ్డీ వ్యాపారులు
► వారి ఇళ్లలో సోదాలు చేయాలి ► వైఎస్సార్ సీపీ నేత దువ్వాడ డిమాండ్ టెక్కలి: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యాపారంలో భాగంగా ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబీకులే అతి పెద్ద వడ్డీ వ్యాపారస్తులని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీకు చెందిన నేతలే అధికంగా ఉన్నారని వారిని రక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని దువ్వాడ పేర్కొన్నారు. అయితే సుమారు 25 ఏళ్ల క్రితం వందల కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్రలో టిడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడుతో ఈ వడ్డీ వ్యాపారం ప్రారంభమైందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల్లో పలు షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, రైస్ మిల్లులు తదితర వ్యాపారాలతో పాటు పలువురు నేతలతో ఎర్రన్నాయుడు వడ్డీ వ్యాపారాలు సాగించారని దువ్వాడ చెప్పారు. అసలు నేరస్తులను విడ్చిపెట్టి సామాన్య వ్యాపారులపై పోలీసులు దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. కింజరాపు కుటుంబీకులు చేసిన వడ్డీ వ్యాపారాలపై మంత్రి అచ్చెన్నాయుడు నోరు విప్పాలని దువ్వాడ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సామాన్య వ్యాపారులపై దాడులు చేయడం కాదని కింజరాపు కుటుంబీకుల ఇళ్లల్లో సోదాలు చేసి వారిపై కేసులు నమోదు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. -
పోలీసుల అదుపులో 10మంది వడ్డీ వ్యాపారులు
విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంలో బుధవారం వేకువ జామున విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దుబ్బాడ, య్యన్నపేట, విజయనగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా వారి నుంచి పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక సూసైడ్ నోట్
సికింద్రాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి సూసైట్ నోట్ రాయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. నర్సింగ్ అనే వ్యక్తి వడ్డీ సికింద్రాబాద్‌లోని తుకారంగేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.14 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బాకీ ఎలాగైనా తీర్చాలంటూ వ్యాపారీ వేధింపులకు గురిచేయడంతో మనోవేదనకు గురైన నర్సింగ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వడ్డీవ్యాపారుల వల్లే తన భర్త సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని నర్సింగ్ భార్య మంగళవారం ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సికింద్రాబాద్‌లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు