
వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక సూసైడ్ నోట్
సికింద్రాబాద్: నగరంలోని సికింద్రాబాద్లో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి సూసైట్ నోట్ రాయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. నర్సింగ్ అనే వ్యక్తి వడ్డీ సికింద్రాబాద్లోని తుకారంగేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.14 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బాకీ ఎలాగైనా తీర్చాలంటూ వ్యాపారీ వేధింపులకు గురిచేయడంతో మనోవేదనకు గురైన నర్సింగ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
వడ్డీవ్యాపారుల వల్లే తన భర్త సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని నర్సింగ్ భార్య మంగళవారం ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.