ఎన్నో క్రైం స్టోరీలను విని ఉంటాం. ఆ కేసుల్లో చాలామటుకు హత్య చేయడం.. తప్పించుకునేందుకు రకరకాలుగా ట్రై చేసి చివరికి ఎక్కడో ఒక చోట దొరికపోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. దీంతో తల్లే కొడుకును కాపాడేందుకు రంగంలో దిగి రక్షించుకునే తాపత్రయాన్ని.. చూస్తే సినిమానే తలిపించే కథలా ఉంటుంది ఈ క్రైం స్టోరీ.
వివరాల్లోకెళ్తే...యూపీలోని అలీఘర్‌లో 2015లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి గోండా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసినట్లుగా నేరాలు మోపి కేసు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఒక బాలిక అనుమానస్పద మృతి వార్తను చూసి సదరు అమ్మాయి తండ్రి ఆ బాలిక తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్య నేరం కింద కేసు నమోదు జైలుకి పంపారు అధికారులు.
ఐతే నిందితుడు విష్ణు తల్లి ఈ ఆరోపణలు అవాస్తవం అని నిరూపించి తన కొడుకును ఈ కేసు నుంచి బయటపడేలా చేయాలనకుంది. అందులో భాగంగా తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసును చేధించేందుకు పూనుకుంది. ఇక్కడే ఈ కేసులో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మేరకు ఏ అమ్మాయి ఐతే కిడ్నాప్ అయ్యి హత్యకు గురయ్యిందన్నారో ఆ అమ్మాయి బతికే ఉందని ఈ తల్లి గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
ఈ క్రమంలో పోలీసులు సదరు బాధితురాలిని హత్రాస్‌లో ట్రాక్ చేసి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపర్చి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఐతే ఈ కేసులో మరింత ముందకు వెళ్లాడానికి ఆమెకు డీఎన్‌ఏ టెస్ట్‌లు కూడా నిర్వహించనున్నట్లు పోలీస్ అధికారి సింగ్ చెప్పారు. ఆ తదనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐతే ఆ ఘటనలో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు.
దాదాపు ఏడేళ్ల తర్వాత గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఈ మేరకు విష్ణు తల్లి తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేసులో ఇరుకిస్తున్నారని తెలిసి.. తానే స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించేందకు తాను ఈ బాధ్యత తీసుకున్నాని చెప్పింది.
(చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..)
Comments
Please login to add a commentAdd a comment