కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లో గత ఆదివారం హిందూ టెంపుల్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఖలిస్తానీ నిరసనల ప్రధాన నిర్వాహకుడు ఇందర్‌జీత్ గోసల్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై హింసాత్మక దాడికి సంబంధించి శుక్రవారం అతన్ని అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేసినట్లు పీల్ రీజినల్ పోలీసులు(PRP) వెల్లడించారు. నిందితుడు ఖలీస్తానీ వేర్పాటువాద గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే.. అరెస్ట్ చేసిన అనంతరం అతన్ని షరతులపై విడుదల చేశామని తెలిపారు. బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో ముందస్తుగా పేర్కొన్న తేదీన హాజరుకావలసి ఉంటుందని అతనికి తెలియజేశారు.
మరోవైపు.. టెంపుల్‌పై దాడి జరిగిన అనంతరం.. నవంబర్ 3, 4 తేదీల నుంచి చోటుచేసుకున్న సంఘటనలను పరిశీలించడానికి పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై జరిగిన దాడిపై ఇండో-కెనడియన్ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో, కెనడా ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
Glad that @PeelPolice has finally charged Khalistani extremist Inderjeet Gosal of Brampton for assault with a weapon. He was arrested yesterday but released on conditions. We urge @PeelPolice to also arrest / charge other accomplices of Gosal and their operators who are behind… pic.twitter.com/nBGKt4EjcT
— VHP Canada (@vhpcanada) November 10, 2024
ఎవరీ ఇందర్‌జీత్ గోసల్?
ఇందర్‌జీత్ గోసల్‌కు సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ పన్నూకు లెఫ్టినెంట్‌గా గుర్తింపు ఉంది. గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు కెనడియన్ ఆర్గనైజర్‌గా నియమించబడ్డాడు. కెనడియన్ పోలీసుల ప్రకారం.. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న 13 మంది కెనడియన్లలో గోసల్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment